Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డైటింగ్ లే కాదు....డ్యాన్స్ కూడాను ...?

బరువు తగ్గే చిట్కా 1 - ఎప్పుడూ ఒకే రీతిగా.....ఏ రకం వ్యాయామం చేసినప్పటికి దానిని మానకుండా కొనసాగిస్తూండండి. దీనికిగాను మీకు స్ధిర నిర్ణయం, మీ వద్ద వున్న వారి సహకారం మీకు కావాలి. వెయిట్ లాస్ కొరకు మీరు చేసే వ్యాయామాలు దీర్ఘకాలంలో తప్పక ఫలితాలనిస్తాయి. కొద్ది వారాలకో లేదా నెలలకో వ్యాయామాలు మార్చండి. విశ్రాంతి రోజులలో తప్ప వ్యాయామ తరగతులు మిస్ చేయకండి.
బరువు తగ్గే చిట్కా 2 - సమయానికి తినండి...వెయిట్ లాస్ కొరకు ఏం తినాలనేది మీకు తెలిసే వుంటుంది. ఆ ఆహారాలను అవి మూడు సార్లయినా లేదా ఆరు సార్లయినా తింటూనే వుండండి. మానకండి. తిండి మానేయటం, సమయానికి తినకపోవటం ఎసిడిటీ వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అలాగే శరీరానికి నీరు బాగా అందించండి.
బరువుతగ్గే చిట్కా 3 - చురుకుగా వుండండి - చురుకుగా వుండండి. అవకాశమున్నపుడల్లా, ఉద్యోగం కూర్చునేదయినప్పటికి లేచి కదులుతూ వుండండి. లేచి చిన్న నడక నడవండి. వీలైతే ప్రతి రెండు గంటలకు తాజా గాలి పొందండి. కొవ్వు పేరుకోకుండా వుంటుంది. కిరాణా స్టోర్స్ లేదా బస్ స్టాప్ మొదలగువాటికి నడవండి.
బరువుతగ్గే చిట్కా 4 - బాగా నిద్రించండి. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలనిద్ర కావాలి. తక్కువ లేదా ఎక్కువ నిద్రలు కొవ్వు ఏర్పరుస్తాయి. కనుక చాలినంత విశ్రాంతి తీసుకోండి.
బరువుతగ్గే చిట్కా 5 - సరైన రీతిలో శ్వాస తీసుకోండి. యోగా నిపుణుల మేరకు గాలి పీల్చితే లేదా వదిలితే మీ శరీరంలోని డయాఫ్రం సంకోచ వ్యాకోచాలు చేయాలి. ఇది మీకుగల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
బరువుతగ్గే చిట్కా 6 - సంయమనం పాటించండి. బరువు తగ్గాలంటే రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. కొంత కాలం పడుతుంది. కనుక తక్షణ ఫలితాలకై మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఒకే రోజు అలసిపోయేలా చేయకండి. వ్యాయామాలలో అపుడపుడు బ్రేక్ ఇచ్చినప్పటికి అది మీ శరీరానికి మంచిదే. అపుడపుడూ ఒక చాక్లెట్ లేదా పిజ్జా వంటివి తిన్నా మీ ఆహార ప్రణాళికకు అడ్డంకి కాదు.
మీ శరీరాన్ని అవగాహన చేసుకొని దాని కోరికలు గౌరవిస్తే అదే మీకు వెయట్ లాస్ అందిస్తుంది. డైటింగ్ పేరుతో అవసరమైన ఆహారాలు వదులుకోవడం, గంటల తరబడి వ్యాయామాలు చేసి శరీర సౌష్టవం మరింత దిగజారేలా చేసుకోకండి. పై చిట్కాలు పాటించి ఆరోగ్యంతో మంచి శారీరక సౌష్టవంతో ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications