Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బరువు తగ్గాలంటూ భంగపడితే?

1. చాలా తక్కువ తింటారు - రోజూ హేపీగా ఐస్ క్రీమ్ లు, బేకరీ ఫుడ్లు తింటూ ఆనందించేవారు వెంటనే రుచి పచి లేని మాల్ట్, సూప్, సలాడ్ వంటివి తిని ఆకలి చంపుకుంటూంటారు. ఏదో అడవిలోవుండే వారిలా ఆకులూ పండ్లూ వంటివి తినేస్తూంటారు. దీనికి పరిష్కారంగా అధిక పీచు వుండి, విటమిన్లు అధికంగా వుండి, తక్కువ కొవ్వు కల పదార్ధాలు తినండి. రుచికల దోస, కేరట్, మొలకలు, హెర్బల్ టీలు, తీపి లేని ఐస్ క్రీములు మొదలైనవి తింటే మీరు గతంలోని మీ ఆహారాలు కోల్పోయినట్లుండదు.
2. వారాంతపు సెలవల్లో - వారాంతపు శెలవులు అంటే శని, ఆది వారాలు, రుచులు లేని డైటింగ్ చేయటం కష్టమే. కనుక ఈ రెండు రోజుల్లో మీరు కోరే తిండ్లు తినండి. భోజనం మితంగా చేయండి.
3. నీరు - బరువు తగ్గాలంటూ రోజంతా నీరు అధికంగా తాగటం, నీరు ఎక్కువ వుండే ఆహారాలు తీసుకోవడం చేయకండి. దీనివలన, శరీరం పాలిపోయినట్లుండి ముఖ వర్చస్సు లేదా చర్మ కాంతి తగ్గి బలహీనమయ్యే ప్రమాదం వుంది.దీనికి పరిష్కారంగా పండ్లరసాలు, ఎనర్జీనిచ్చే ఇతర పానీయాలు కేలరీలు తక్కువ వుండేవిగా తాగండి. సోయా, బాదం పాలు వంటివి బాగుంటాయి.
4. బరువు - మీ పోషకాహార నిపుణుడు బరువు తరచుగా చూసుకోమని చెపుతాడు. స్కేలుపై చూస్తే బరువు తగ్గినప్పటికి, మీ శరీరం తగ్గినట్లు కనపడదు. దీనికిగాను నడక, పరుగు పెట్టటం, లేదా ఇతర ఫిట్ నెస్ వ్యాయామాలు చేయండి. ఫలితం నిదానమైనప్పటికి తప్పక ప్రయోజనం వుంటుంది.
5. ఆహార ప్రణాళికల మార్పు - లావు తగ్గలేదనిపిస్తే ఆహారాలు మార్చటానికి ప్రయత్నిస్తారు. ఈ రకమైన మార్పులు, సురక్షితమూ, ఆరోగ్యమూ కాదు. కొద్ది రోజులు మీరు ఆచరించే ఆహార ప్రణాళిక కొనసాగాలని మార్పు తక్షణమే రాదని గుర్తించండి. ప్రతి పండు, ప్రతి కూరలో మేలు కలిగించే ఆహారం వుంటుంది. అన్ని రకాలు తీసుకోండి. అయితే పరిమితంగా ప్రతిరోజూ మీ ఆహారాన్ని ప్రణాళిక చేయండి. (రోజుకు 1500 కేలరీలు మాత్రమే).
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications