Latest Updates
-
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి!
ముఖం సహజ మెరుపు పొందాలంటే?

అందం, శరీరం లోపలినుండి సహజంగా వస్తుంది. ముఖం సహజ మెరుపు సౌందర్య సాధనాలలో లేదంటారు చర్మ నిపుణులు. శరీరంలోని ఇతర అవయవాలవలెనే చర్మంకూడా మీ ఆహారం, జీవన విధానాలపై ఆధారపడివుంటుంది. మీ శరీరాన్ని లోపలినుండి పోషిస్తే, మీ చర్మం సంరక్షణ, వయసు పైబడకుండా కనపడటమనేవి మీ చేతుల్లో వున్నాయి. డైటింగ్ చేసేవారు శరీరంలో కొవ్వు తగ్గించుకోవటానికిగాను సాధారణంగా అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ నిలిపేస్తారు.
కాని ఇవి శరీరానికి ఎంతో అవసరం. చర్మ సంరక్షణకే కాదు, గుండె సంబంధిత, రోగ నిరోధకత, సంతానోత్పత్తి, నరాల వ్యవస్ధ మొదలగు అన్ని వ్యవస్ధలపైనా వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఒక సారి చర్మం మెరుపు కోల్పోతే, లేదా ముడుతలవంటివి ఏర్పడితే, మరోమారు అవసరమైన కొవ్వు పట్టి నిగ నిగలాడటానికి ఎంతో కష్టపడాల్సివస్తుంది.
శరీరంలో కొత్త కణాలు పుట్టేలా చేస్తాయి. డ్యామేజీ అయిన కణాలు తిరిగి జీవంపోసుకునేలా చేస్తాయి. మలినాలను తొలగిస్తాయి. ఇటీవల చేసిన పరిశోధనలు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు పొడి చర్మానికి మందుగానే కాదు బరువు తగ్గించేందుకు కూడా తోడ్పడతాయని తెలుపుతున్నాయి. కనుక మీరు తినే ఆహారంలో బరువు తగ్గాలంటూ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ లను తొలగించకండి. ఇవి వుండే ఆహారాలు తప్పక తీసుకోండి అంటున్నారు చర్మ సంరక్షక నిపుణులు. మరి ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఆహారాలు వేటిలో వుంటాయి? మాంసం, చేపలు, ఇతర సీ ఫుడ్స్, కోడి మాంసం ఉత్పత్తులు, ఛీజ్, గుడ్లు, బఠాణీలు, గింజలు, ముతక బియ్యం, గింజ ధాన్యాలు, షుగర్ వంటివాటిలో అధికంగా వుంటాయి. మీరు తినే ఆహారాలలో ప్రధానంగా ఇవి వుండేలా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications