Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బాడీని బిల్డ్ చేయడానికి ఐదు చక్కటి మార్గాలు..!

1. ముందుగా కండారానలు అభివద్ది చేసుకోవాలి: కఠినమైన ఎక్సర్‌సైజులతో సిక్స్‌ప్యాక్.. ఈ బాడీ పొందడం అంత ఈజీ కాదని ఫిట్‌నెస్ నిపుణులు సెలవిస్తున్నారు. తీవ్రమైన కసరత్తులే కాదు ఆహార నియమాలు కూడా తప్పనిసరని వారు చెబుతున్నారు. సిక్స్‌ప్యాక్ కోసం కడుపులోని మజిల్స్‌ను దృఢపరచి కొవ్వును పూర్తిగా తగ్గించాల్సి ఉంటుంది. ఇందు కోసం కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
2. ఆహారం విషయంలో: సిక్స్‌ప్యాక్ కోసం ఎక్సర్‌సైజులతో పాటు ఆహారనియమాలు తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. డైట్ కంట్రోల్ ద్వారా 80 శాతం కొవ్వును తగ్గిస్తే ఎక్సర్ సైజుల ద్వారా 20 శాతం కొవ్వును కరిగించవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతు న్నారు. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే డిన్నర్‌ను పూర్తిగా నియంత్రించాల్సి ఉం టుంది. ఇందు కోసం ‘ఈట్ క్లీన్' ఆహారాన్ని తీసుకోవాలని వారు సెలవిస్తున్నారు. తీసుకునే ఆహారంలో 50 శాతం పండ్లు, కూరగాయలు ఉండేవిధంగా చూసుకో వాల్సి ఉంటుంది. కాలరీ స్నాక్స్‌ను తీసుకుంటే మంచింది. డిన్నర్‌లో ఎక్కువగా అవసరానికి మించి ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
3. సరైన వెయిట్ ట్రైనింగ్: కండరాలను బలపరచాలంటే తప్పనిసరిగా వైయిట్ ట్రైయినింగ్ చేయాల్సి ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలను ధృడ పరిచేందుకు ఈ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ‘వీటిలో అబ్డామినిస్, స్క్వాట్స్, క్రంచెస్, సిటప్స్, లెగ్ లిఫ్ట్‌స, జాక్‌నైఫ్ సిటప్స్, వి అప్స్, డంబుల్స్, వెయిట్ లిఫ్టింగ్స్, తదితర ఎక్సర్ సైజులను చేయాల్సి ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్స్ ఎక్సర్ సైజులను ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్ సైజులతో బాడీలోని వివిధ శరీరభాగాలు ధృడమైన ఆకృతిలో చక్కగా తీర్చి దిద్దబడతాయి'
4. శక్తి కోసం: వెయిట్ ట్రైనింగ్ తీసుకొన్న తర్వాత శరీరానికి తగినంత శక్తి కోసం మరో శిక్షణ అవసరం ఉంటుంది. శక్తిని పొదడం ద్వారా కండారలకు బలం చేకూరి వర్క్ అవుట్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ కండారాలను బలంగా, ధృడంగా ఉండేట్టు చేస్తాయి.
5. కడుపులోని రెక్టస్ అబ్డామినిస్ ను ధృడంగా తీర్చిదిద్దేందుకు స్క్వాట్స్, అబ్డామినిస్ ఎక్సర్‌సైజు లను చేయాల్సి ఉంటుంది. నడుమును సన్నపరిచి వెన్నెముక కు సమాంతరంగా బాడీని ధృడపరచాల్సి ఉంటుంది. స్క్వాట్స్ తో పాటు డెడ్‌లిఫ్ట్‌స ఎక్సర్‌సైజులు ఇం దుకు తోడ్పడతాయి. ఈ ఎక్సర్‌సైజులతో కడుపు వద్ద ఉన్న ఫ్యాట్ పూర్తిగా కరిగిపోతుం ది. ఇక క్రంచెస్ ఎక్సర్‌సైజులను చాతి, భుజాలను ధృడపరిచేం దుకు చేస్తారు. నేలపై పడుకొని కాళ్లు, చేతులను వంచుతూ ఈ ఎక్సర్‌సైజులను చేస్తారు. మజిల్స్ కోసం ఇలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సిక్స్ ప్యాక్ తో బాలీవుడ్, టాలీవుడ్ హీరోల్లా మీరు మీ శరీర సౌష్టవాన్ని పెంచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications