Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
డ్యాన్స్ తో బాడీ డవున్...ఎనర్జీ అప్ !
నాట్యం చేస్తే బరువు బాగా తగ్గవచ్చు. జిమ్ లకు వెళ్ళటం, బరువులు ఎత్తటం అంతా చికాకు కలిగిస్తుంది కొంతమందికి. తినే తిండిని నియంత్రించుకోలేరు. కాని బరువు తగ్గాలి మరి అటువంటపుడు వారికి కనుక నాట్యాభిలాష ఉంటే, నాట్యం మొదలు పెట్టండి. డ్యాన్స్ చేయటం శరీరంలోని రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. కేలరీలు బాగా ఖర్చు అయి బరువు తగ్గించేందుకు సహకరిస్తుంది. ఫిట్ నెస్ లో భాగంగా, డ్యాన్స్ మీ శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. అయితే, డ్యాన్స్ లలో అన్ని భంగిమలు బరువు తగ్గేందుకు సహకరించవు. కొన్ని భంగిమలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తే, మీ శరీరం ఆకర్షణీయ రూపాన్ని సంతరించుకోవడం ఏమంత కష్టం కాదు.

ఫ్రీ స్టైల్ డ్యాన్సింగ్ - ఈరకమైన డ్యాన్స్ భంగిమలు మీ శరీరం స్వేచ్ఛగా కదిలేలా చేస్తుంది. డ్యాన్స్ స్టెప్స్ శరీర కదలికలు పట్టించుకోదు. ఎలా కావాలంటే అలా మీరు డ్యాన్స్ చేస్తూ ఉండటమే. ఫ్రీ స్టైల్ డ్యాన్సింగ్ మీకు బరువు తగ్గించడమే కాదు శరీర అవయవాలను తేలికగా ఉండేలా చేస్తుంది. ఈ డ్యాన్స్ మీరు పెద్ద మ్యూజిక్ పెట్టుకొని ఇంటిలోనే చేయవచ్చు. బీటింగ్ వేగంగా ఉండాలి. అపుడే డ్యాన్సింగ్ బాగా సాగి మీ ఎనర్జీ స్ధాయిలు పై పైకి ఎదుగుతాయి. ఈ వర్కవుట్లతో ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు చేస్తూ ఉండండి.
కేబరెట్ లేదా బెల్లీ డ్యాన్సింగ్- పొట్టను ఆడించేయడం లేదా శరీర దిగువ భాగాలను కదిలించేయడం కేలరీలు ఖర్చుచేయడం మీ పిరుదులను నియంత్రిస్తుంది. పిరుదులు అందంగా తయారవ్వటమే కాక, పొట్ట కొవ్వు కూడా ఈ డ్యాన్స్ కరిగిస్తుంది. కనుక శరీర దిగువ భాగానికి వ్యాయామం కావాలనుకుంటే, ఈ డ్యాన్స్ ప్రయత్నించండి. దీనిని వీడియో లేదా డ్యాన్స్ స్కూల్ తరగతులు చూసి మీరే సాధన చేయవచ్చు. శరీరం తేలికై ఫిట్ గా వుంటారు.
బ్యాలెట్ డ్యాన్స్ -ఈ డ్యాన్స్ మీ శరీరానికి మంచి షేప్ ఇస్తుంది. అవయవాలు బాగా సాగుతాయి. ఈ డ్యాన్స్ భంగిమలు చాలావరకు యోగా ఆసనాలవలేనే ఉంటాయి. ఇందులో ఉండే ఏకాగ్రత మీ శరీర భాగాలు సులువుగా కదిలేలా చేస్తుంది. కొవ్వు బాగా కరిగిపోతుంది.
పోల్ డ్యాన్సింగ్ - ఒక పోల్ ఎక్కడం, దానిపై తిరుగుతూండడం శరీరానికి ఎంతో కదలికలనిస్తుంది. కేలరీలు బాగా ఖర్చవుతాయి. ఒక్క 30 నిమిషాలు ప్రతిరోజూ చేస్తే అది జిమ్ లో 20 నిమిషాలపాటు చేసినంత శ్రమగా ఉంటుంది.
శరీర ఆరోగ్యానికి ఆచరించాల్సినది యోగాసనాలు, జిమ్ లే కాదు, డ్యాన్స్ భంగిమలతో కూడా మీరు అద్భుత ఫలితాలతో ఆరోగ్యం సాధించవచ్చు. ఈ కొద్దిపాటి డ్యాన్స్ భంగిమలతో మీ శరీర కొవ్వును తేలికగా కరిగించి మంచి ఆరోగ్య ఫలితాలను కూడా పొదవచ్చు. హై బీట్ మ్యూజిక్ లతో మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చు. అయితే, వర్కవుట్ల సెషన్ తర్వాత నీరు అధికంగా తాగి శరీరానికి సహకరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications