Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
స్విమ్మింగ్ తేలిక వ్యాయామంగా...!

పండ్ల ఆహారంపై వుండేవారు ప్రతిరోజూ మూడు నుండి నాలుగు లీటర్ల పరిశుభ్రమైన నీటిని తాగాలి. కూల్ డ్రింక్ లు, కాఫీ, టీ, ఆల్కహాల్, సోడా వంటి ఇతర పానీయాలు వదిలేయండి. తాజా పండ్లు, ఏవైనా సరే ప్రత్యేకించి ఆర్గానిక్ పండ్లు తినండి. సాయంత్రం కార్బో హైడ్రేట్లు లేని ఆహారాలు, కూరగాయలు, పండ్లు తినాలి. ప్రొటీన్ కలిపిన డ్రింకులు తీసుకోవచ్చు. అయితే వీటిలో మీగడ, ఫ్రక్టోస్ షుగర్, సర్కోస్, సక్రాలోజ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్లు వుండరాదు.
ఈ సమయంలో అధికంగా వ్యాయామం వంటివి చేయరాదు. స్విమ్మింగ్, సైకిలింగ్ వంటి సులభమైన వ్యాయామాలు చేయండి. పండ్లు ప్రధాన ఆహారంగా తినే వారికి రోజుకు 1000 కేలరీలు మించి చేరవు. అంతేకాక, శరీరానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి, ఒమేగా 3 కొవ్వులు కూడా శరీరానికి అందవు. కనుక ఇది ఎక్కువరోజులు ఆచరించరాదు. శరీరంలోని మలినాలు, విషపదార్ధాలను విసర్జించి శారీరక వ్యవస్ధను మెరుగుపరుచుకోవాలంటే, రెండు లేదా మూడు రోజులు పైన తెలిపిన ఫ్రూట్ ఫ్లష్ డైట్ విధానాన్ని ఆచరించవచ్చు. ఇది ఆచరిస్తే, శరీరంలోని కణాలు మరోమారు పునరుజ్జీవనం పొంది, ఎంతో తేలికైన అనుభూతి పొందుతారు. ఇతర విసర్జనా ప్రక్రియలకంటే కూడా ఈ ఆహార ప్రణాళిక మంచి ఫలితాలనిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
