Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
డైటింగ్ లో వున్నపుడు బయట తిండి ఎలా తినాలి?

అతి తక్కువ గ్లైసీమిక్ విలువలు కల ఆహారం - దీనినే గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారం అని కూడా అంటారు. అంటే, ఈ ఆహారాలు మీ రక్తంలోని షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయన్నమాట. ఇటువంటి సమయంలో మీరు ఎంచుకోవాల్సిన ఆహారాలు ఎలా వుండాలంటే?
- పచ్చని కూరగాయలు, ఆకు కూరలు అధికంగా వుండే ఆహారాలను ఎంపిక చేయాలి. అవి మీకు ప్రధాన ఆహారం కావచ్చు లేక సైడ్ డిషెస్ గాను కావచ్చు. మంచి రుచికల కూరగాయలు లేదా ఆకు కూరలు గల పదార్ధాలను ఎంపిక చేసి వాటిలో వుండే పోషక విలువలను పూర్తిగా ఆనందించండి. చిప్స్, లేదా వరి అన్నం లేదా బంగాళ దుంపలు, ఇతర దుంపలు వంటివి, నూనె పదార్ధాలు పూర్తిగా మానివేయండి.
- సలాడ్ల వంటివి మెయిన్ కోర్సు లేదా స్టార్టర్ లేదా సైడ్ డిష్ గా ఆర్డర్ చేయండి
- మీరు తినే ఆహారంలో ప్రధానంగా ప్రొటీన్లు వుండాలి. ఇవి శరీరానికి ఎంతో మంచివి. పిండిపదార్ధాలు కల ఆహారాలను విడనాడండి. ప్రొటీన్లు అధికంగా వుండాలంటే, మాంసం, చేపలు, చికెన్, గింజ ధాన్యాలు వంటివి తినాలి. మీ ఆహారంలో ప్రొటీన్ అధికంగా వుంటే అది మీ మొత్తం ఆహారంలో జి.ఐ. విలువలను అతి తక్కువగా వుంచుతుంది.
- పండ్లు అధికంగా వుండే ఆహారాలను డెసర్ట్ లుగా తీసుకోండి. రిఫైన్ చేయబడిన పిండి, షుగర్, కొవ్వులు మానివేయండి.
- నూనెలో వేయించిన చేపలు, అవకాడోలవంటివి తినవచ్చు. వీటిలో కొవ్వు వున్నప్పటికి వీటిలో కేలరీలు అధికమైనప్పటికి వీటిలో అనేక మంచి పోషకాలు, ఆరోగ్య కరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి.
- మంచి పోషక విలువలు కలిగిన టమాటాలు లేదా వెజిటబుల్ ఆధారిత కూరలు, తండూరి స్టైల్ మాంసం వంటివి పెరుగు మరియు ఇతర మసాలాలతో కలిపి మట్టి కుంపటిపై వండినవిగా తినండి. టిక్కాలలో కేలరీలు తక్కువగా వుంటాయి. దానికి కారణం అవి బాగా మట్టి కుంపటిపై వేయించబడతాయి. అయితే వీటితో పాటుగా మీరు కొవ్వు అధికంగా వుండే సాస్ ల వంటి వాటి జోలికి పోకండి. మీరు అధికంగా ఆర్డర్ చేయవలసినవి సైడ్ డిష్ లు అయిన వెజిటబుల్ లేదా సలాడ్లు మాత్రమే. వీటిలో గింజధాన్యాలు అధికంగా వుంటాయి. ధనియా, పప్పు వంటివి మీకు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
