Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గించే బెస్ట్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్
మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నారా? మరియు బరువు తగ్గించుకోవడానికి ప్లాన్ ఏంటి?మీకు తెలియకపోతే, చింతించాల్సిన అవసరం లేదు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కొన్ని సలహాలివ్వడానికి మేమున్నాం. బరువు తగ్గాలంటే, ముందుగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. డైట్ ప్లాన్ చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. మీరు ఖచ్చితంగా కొన్ని కిలోల బరువు తగ్గించుకోవాలని నిజంగా మీరు కోరుకుంటున్నట్లైతే మీరు తీసుకొనే డైట్ మీద ప్రత్యేక శ్రద్ద చాలా అవసరం. ముందుగా దినచర్యను ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీరు ప్రారంభించాలి. లచ్ మితంగా తీసుకోవాలి అలాగే డిన్నర్ కూడా చాలా సింప్లీ మీల్స్ ను ఎంపిక చేసుకోవాలి.
బరువు తగ్గించే క్రమంలో మీరు ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందువల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొనే ఆహారంలో అన్నిరకాల విటమిన్స్ , మినిరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అన్నీ ఉండేట్లు చూసుకోవాలి. అదే విధంగామీరు తీసుకొనే ఈ హెత్తీ ఆహారాలు కూడా మీరు బరువు పెరగకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. మరి మన ఇండియన్ కుషన్స్ లో మీరు హెల్తీ వెయిట్ లాస్ బ్రేక్ ఫాస్ట్ ను తెలుసుకోవడం కష్టం అనిపిస్తే, ఇక్కడ మీకో శుభవార్త...
మీరు ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి మరియు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెండు ఒకే సారి జరగానికి కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ అల్పాహారాలు మీరు బరువు తగ్గడానికి చాలా సహాయపడుతాయి. అదే విధంగా ఈ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి. మరియు రుచికరంగా ఉంటాయి మరి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే కొన్ని బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్స్ క్రింది విధంగా...

కిచిడి
మీ దినచర్యను ఆరోగ్యకరమైన కిచిడితో ప్రారంభించవచ్చు. ఇది ఒక బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఐడియా. దాల్ కిచిడి లేదా బార్లీ కిచిడిని చాలా తక్కువ మాసాల దినుసులు, కారం తక్కువగా చేసుకుంటే, అంది మీకు మరింత ఎక్కువ పోషకాలను అందిస్తుంది. కిచిడి పొట్టనింపే బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. అంతే కాదు, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని బరువు పెరగనివ్వదు.

పోహా(అటుకులతో తయారుచేసే అల్పాహారాలు)
పోహా (అటుకులతో తయారుచేసే అల్పాహారాలు బ్రేక్ ఫాస్ట్ కు ఒక ఫర్ ఫెక్ట్ ఆప్షన్. ఇది మీ పొట్టలో తేలికగా ఉంచుతంది, చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉండే పోహా కళ్ళఆరోగ్యానికి చాలా మంచిది.

దాలియా
దాలియా లేదా గోధుమ రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్నప్పుడు గోధుమ రవ్వ ఉప్మా చాలా మేలు చేస్తుంది. ఇది ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ తో నిండి ఉంటుంది. అంతే కాదు చాలా తక్కువ క్యాలరీలు కలిగిన గోధుమరవ్వతో చాలా తసులభంగా మరియు త్వరగా అల్పాహారాన్ని తయారుచేయవచ్చు.

దోస
మల్టిగ్రెయిన్ దోసం. మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నట్లైతే దోసను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా అడై దోస ఎంపిక చేసుకోవాలి. దోసెకు చాలా తక్కువగా నూనెను ఉపయోగించాలి. లేదా నాన్ స్టిక్ పాన్ తో దోసెను తయారుచేసి తీసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్.

ఎగ్ సాండ్విచ్
గోధుమతో తయారుచేసిన బ్రెట్ మరియు సాల్ట్ పెప్పర్ వేసిన పోచ్చ్డ్ ఎగ్ ఫ్రై, ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్. గుడ్డులో అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉండి శక్తిని అందివ్వడంతో పాటు బరువును ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి.

స్టీమ్డ్ ఇడ్లీ
బరువు తగ్గడానికి ఆవిరిలో ఉడికించిన పదార్థాలన్నీకూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి, మీరు హెల్తీగా ఉంటూనే బరువు తగ్గించుకోవాలంటే గోధుమ రవ్వ లేదా రాగి ఇడ్లీలను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా ఎంపిక చేసుకోండి.

ఓట్స్
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కు ఓట్స్ కు హెల్తీ ఫ్రూట్స్ మరియు పాలు మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఉప్మా లేదా దోసె రూపంలో తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications