త్వరగా మరియు ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే గ్రీన్ టీ డైట్ ప్లాన్

త్వరగా బరువు తగ్గించుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. అయితే మిమ్మల్ని త్వరగా బరువు తగ్గించే ఒక హెల్తీ వెయిట్ లాస్ సీక్రెట్ గ్రీన్ టీ డైట్. శరీరంలో కొన్ని పౌండ్ల బరువు తగ్గించే టీలో గ్రీన్ టీ ఒక ఉత్తమైనటీ . ఈ గ్రీన్ టీ శరీరంలో అదనపు కొవ్వును కరిగించడం మాత్రమే కాదు, గ్రీన్ టీ మిమ్మల్ని ఫిట్ గా మరియు హెల్తీ ఉండేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవడం కోసం గ్రీన్ టీను డైట్ ప్లాన్ చాలా సింపుల్ గా ఫాలో అవ్వొచ్చు. ఈ గ్రీన్ టీ డైట్ అనుసరించడానికి మీరు చేయాల్సిందల్లా చాలా తక్కువ క్యాలరీలున్న ఆహారాలను తీసుకుంటూ, శరీరంలో క్యాలరీలను బ్యాలెన్స్ చేసుకోవాలి.

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీ శరీరంలోని జవీక్రియలకు వెచ్చదనం కలిగిస్తుందన్న విషయం మీకు తెలుసా? ఇలా జీవక్రియలకు హీటప్ చేయడంతో శరీరంలోని ద్రవాలు చాలా వేగవంతంగా పనిచేయడానికి సహాయపడుతాయి? మీ మెటబాలిజం రేటు కూడా వేగవంతం అవుతుంది. మీ శరీరానికి అవసరం అయ్యే మరింత ద్రవాలను సప్లై చేయడానికి సహాయపడుతుంది . బరువు తగ్గడానికి మీరు గ్రీన్ టీ వెయిట్ లాస్ ప్లాన్ లో ఉన్నప్పుడు, కొన్న పౌండ్ల బరువు తగ్గించే గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయమని గుర్తుంచుకోవాలి.

ఇంకా గ్రీన్ టీ త్రాగితే కడుపు నిండుగా అనిపిస్తుంది, ఇది చాలా త్వరగా ఆకలిని పెంచదు. కాబట్టి, ఎప్పుడైతే మీరు ఒక కప్పు గ్రీన్ టీను తీసుకుంటారో అప్పటి నుండి మరో 30-45నిముషాల పాటు ఆకలి కాకుండా ఉంటుంది. మన శరీరం ఎక్కువ సమయం ఆకలికాకుండా ఉంటుందో, అప్పుడు మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీద శ్రద్ద పెట్టి సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.
కాబట్టి, బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ టీ డైట్ ప్లాన్ చేసుకొనే వారు అనుసరించాల్సిన కొన్ని సూచనలు క్రింది విధంగా ఉన్నాయి...

 కాఫీని స్వస్తి చెప్పండి :

కాఫీని స్వస్తి చెప్పండి :

కాఫీ, హార్ట్ హెల్త్ కు చాలా ఆరోగ్యకరమైనా, గ్రీన్ టీ మరింత ఉత్తమమైనది. ఇది మిమ్మల్ని యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. అంటే దాని అర్ధం గ్రీన్ టీ మరంత ఎఫెక్టివ్ గా రక్తప్రసరణ చేసి, మీకు శరీరంలో క్యాలరీలను బర్న్ చేయడానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే వెంటనే గ్రీన్ టీని మొదలు పెట్టండి.

మీ భోజనంతో పాటు:

మీ భోజనంతో పాటు:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక పెద్ద గ్లాసుతో గ్రీన్ టీ తీసుకోవాలి. అంతే కాదు,ఇంకా కొంత స్టాక్ పెట్టుకొని రోజులో టీ త్రాగాలనిపించినప్పుడంతా గ్రీన్ టీ త్రాగండి . దీన్ని భోజనానికి మద్య త్రాగండి.

ఎక్కువగా త్రాగండి:

ఎక్కువగా త్రాగండి:

మీ ఆకలి కోరికలను కంట్రోల్ చేసుకోవాలంటే, డేటైమ్ లో ఎక్కువ గ్రీన్ టీని త్రాగండి. భోజనానికి ముందు ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల అధికంగా తినడం నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత మరో కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది.

 నీటిని తొలగించడానికి సహాయపడుతుంది:

నీటిని తొలగించడానికి సహాయపడుతుంది:

మీకు కాఫీ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారా, కాబట్టి, వెంటనే గ్రీన్ టీ తో బ్రేక్ ఇవ్వండి. బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ టీ డైట్లో ఒక కప్పు గ్రీన్ టీని త్రాగాలి . అలాగే సాయంత్రంలో గ్రీన్ టీని త్రాగాలి. ఇది శరీరంల అదనపు నీటిని తగ్గిస్తుంది.

కార్బోహైడ్రేట్స్ పుష్కలం:

కార్బోహైడ్రేట్స్ పుష్కలం:

గ్రీన్ టీ కార్బోహైడ్రేట్స్ ను నిధానంగా విడుదల చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఈ కారనం చేతనే శరీరంలో ఫ్యాటా చాలా సులభంగా కరిగిపోతుంది. కాబట్టి, త్వరగా బరువు తగ్గాలనుకుంటే, రెండు టీ బ్యాగ్స్ ను నీటిలో డిప్ చేయాలి. గ్రీన్ టా స్ట్రాంగ్ గా ఉంటే బెటర్ గా కొవ్వు కరుగుతుంది.

బరువు పెరగరు:

బరువు పెరగరు:

గ్రీన్ టీ త్రాగినప్పుడు, బరువు పెరగడాన్ని నివారిస్తుంది. గ్రీన్ టీ త్రాగిన వెంటనే ఫ్యాట్ కణాల్లోకి షుగర్ చేరకుండా నివారిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

 స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

స్నాక్స్ మరియు ఆయిల్ ఫుడ్స్ లో ఎక్కువ క్యాలరీలుంటాయి. వీటిని తినడం వల్ల, ఒక్కసారి వీటిని తింటే, ఆ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. కాబట్టి, ఇటువంటి హై క్యాలరీ ఫుడ్స్ తినకుండా నివారించడానికి గ్రీన్ టీ డైట్ బాగా సహాయపడుతాయి. స్నాక్స్ తినాలనే కోరిక కలిగిన వెంటనే ఒక కప్పు గ్రీన్ టీని త్రాగండి.

 రెగ్యులర్ గా త్రాగాలి:

రెగ్యులర్ గా త్రాగాలి:

గ్రీన్ టీ డైట్ తో బరువు తగ్గడం చాలా సులభం.రెగ్యులర్ గా గ్రీన్ టీ ని రెగ్యులర్ గా త్రాగాలి, మీశరీరానికి తగినంత పానియం మీకు అందుతుంది. . దీర్ఘకాలంలో మీ శరీరంలో తక్కువ ఫ్యాట్ షోషణ చెందుతుంది.

Story first published: Thursday, July 24, 2014, 10:38 [IST]
Desktop Bottom Promotion