బరువు తగ్గించకోవడానికి లెమన్ జ్యూస్ ను వివిధ రకాలుగా తీసుకోవడం ఎలా?

నిమ్మకాయ. వివిధ రాకాల వెజిటేబుల్స్ లో నిమ్మకాయ కూడా ఒకటి. ఇది బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లెమన్ వాటర్ లేదా లెమన్ జ్యూస్ ను ఒక రోజులో రెండు లేదా మూడు సార్లు త్రాగడం వల్ల చాలా క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

నిమ్మరసంలో గొప్ప ఆరోగ్యపరమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అసిడిక్ హెల్ప్ కు మాత్రమే కాదు, క్యాలరీలను తగ్గించడంలోనూ మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ గ్రేట్ గా సహాయపడుతుంది.

READ MORE: ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

నిమ్మరసం లేదా లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల జీర్ణక్రియ క్రమంగా పెంచుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజకరం. అంతే కాదు, బరువు తగ్గించడంలో కూడా లెమన్ జ్యూస్ చాల గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు మీరు అనుసరించాల్సిన చిట్కాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు: లెమన్ జ్యూస్ కు పంచదారకు ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగించాలి, తేనెలో శరీరంలో వేడి కలిగించే గుణాలు చాలా ఉండటం వల్ల త్వరగా క్యాలరీను తగ్గిస్తుంది.

READ MORE: ఆరోగ్యానికి నిమ్మరసం ఉపయోగించే 20 మార్గాలు

అదే విధంగా బరువు తగ్గించుకోవడానికి నిమ్మరసంను వివిధ మార్గాలో వినియోగించుకోవచ్చు . మరి ఆ మార్గాలను తెలుసుకోవాలన్నా,ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవాలన్నా ఈ క్రింది స్లైడ్ కు క్లిక్ మనిపించాల్సిందే...

READ MORE: లెమన్ జ్యూస్ తో గర్భిణీ స్త్రీలు పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే లెమన్ జ్యూస్ !

1. నిమ్మరసం -బెల్లం:

1. నిమ్మరసం -బెల్లం:

లెమన్ జ్యూస్ లో కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. ఒక చెంచా బెల్లంను ఒక గ్లాసు నిమ్మరసంలో మిక్స్ చేసి తీసుకోవాలి. బెల్లం శరీరంలో వేడి పుట్టిస్తుంది, క్యాలరీలను కరిగిస్తుంది. ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది.

2. లెమన్ జ్యూస్ -వాటర్ మెలోన్:

2. లెమన్ జ్యూస్ -వాటర్ మెలోన్:

వేసవి సీజన్ లో విరివిగా లభించే వాటర్ మెలోన్ కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ డ్రింక్ ను రోజుకు రెండు సార్లు తీసుకుంటే మెటబాలిజం రేటును పెంచుతుంది.

3. లెమన్ జ్యూస్ -తేనె:

3. లెమన్ జ్యూస్ -తేనె:

లెమన్ జ్యూస్ కు తేనె మిక్స్ చేయడం వల్ల చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు . బరువు తగ్గించుకోవడానికి నిమ్మరసం ఉపయోగించేటప్పుడు, ఈ డ్రింక్ ను రోజులో కనీసం మూడు సార్లు త్రాగాలి.

4. లెమన్ జ్యూస్ -దాల్చిన చెక్క:

4. లెమన్ జ్యూస్ -దాల్చిన చెక్క:

ఈ లెమన్ వాటర్ ను రోజులో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు తీసుకోవచ్చు. అది మీ జీవక్రియల యొక్క రేటు మీద ఆధారపడి ఉంటుంది. మీరు క్యాలరీలను వేగంగా తగ్గించుకోవాలనుకుంటే, దాల్చినచెక్క పొడిన లెమన్ జ్యూస్ లో మిక్స్ త్రాగాలి.

5. లెమన్ జ్యూస్-ఉప్పు:

5. లెమన్ జ్యూస్-ఉప్పు:

బరువు తగ్గించుకోవడానికి లెమన్ జ్యూస్ త్రాగేప్పుడు, అందులో చిటికెడు ఉప్పు వేసి త్రాగాలి. శరీరంలో తగినంత ఎనర్జి అందివ్వడానికి ఉప్పు సహాయపడుతుంది. మరియు ఎక్కువగా యాక్టీవ్ గా ఉంచుతుంది.

6. లెమన్ జ్యూస్ -వెల్లుల్లి:

6. లెమన్ జ్యూస్ -వెల్లుల్లి:

బరువు తగ్గించుకోవడానికి లెమన్ జ్యూస్ చాలా మంచిది . మరియు జీర్ణ సమస్యలను చాలా గ్రేట్ గా నివారిస్తుంది. లెమన్ జ్యూస్ లో కొద్దిగా వెల్లుల్లిపాయలను చితగొట్టి వేసి కాలీ పొట్టతో తీసుకొంటే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది .

7.నిమ్మరసం-హాట్ వాటర్:

7.నిమ్మరసం-హాట్ వాటర్:

బరువు తగ్గించుకోవాడినికి హాట్ వాట్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. హాట్ వాటర్ లో నిమ్మరసం మిక్స్ చేసి తీసుకవోాలి . ఇది ఎనర్జినీ అందిస్తుంది మరియు క్యాలరీలను బర్న్ చేస్తుంది.

8. లెమన్ జ్యూస్-పుదీనా:

8. లెమన్ జ్యూస్-పుదీనా:

లెమన్ జ్యూస్ లో కొద్దిగా పుదీనా ఆకులు వేసి తీసుకోవడం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చు. కాలీ పొట్టతో తీసుకుంటే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

Desktop Bottom Promotion