Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ జింజర్, హనీ డ్రింక్..!!
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి డిఫరెంట్ టిప్స్ ఫాలో అయి విసిగిపోయారా ? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగడం లేదా ? అయితే ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన చిట్కా మీ బెల్లీ ఫ్యాట్ ని ఊహించని రీతిలో కరిగించేస్తుంది. అది కూడా చాలా తక్కువ ఖర్చులో మీ బరువు తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ ని తయారు చేసుకోవడం కూడా ఈజీనే. కాబట్టి ఈ సింపుల్ టిప్ ఫాలోవడం ఎవరికైనా ఈజీనే.
మీ బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ ? దాన్ని ఎలా టార్గెట్ చేయాలి ?
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్. చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్, డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ఫెయిల్ అవుతున్నాయి. వాటిని ఫాలో అయినా ఫలితం కనిపించనప్పుడు.. మధ్యలోనే వదిలేయడం కామన్ గా జరిగిపోతోంది. కానీ మెటబాలిజం ప్రక్రియ సక్రమంగా సాగేలా జాగ్రత్తపడే వాళ్లలో బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది.
బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు
మీ వంటింట్లో ఉండే పదార్థాలు చాలు బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి. గ్రీన్ టీ బ్యాగ్, అల్లంలో చాలా అద్భుతమైన ప్రయోజనాలు దాగున్నాయి. ఈ రెండింటినీ కలిపినప్పుడు.. బరువు తగ్గడం మరింత తేలికవుతుంది. మరి ఈ రెండింటినీ ఉపయోగించే.. బెల్లీ ఫ్యాట్ కరిగించే డ్రింక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

ప్రయోజనాలు
ఇది ఫ్యాట్ తో పోరడానికి మాత్రమే కాదు.. మంచి పోషకాలను అందిస్తుంది. ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరచడానికి, రోజంతా యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

సమయం
ఈ డ్రింక్ తయారు చేయడానికి కేవలం అరగంట పడుతుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలు చాలా సురక్షితం కూడా.

ఫ్లాట్ టమ్మీ
ఈ డ్రింక్ తాగడం వల్ల శరీర వ్యవస్థను డెటాక్సిఫై చేయడంతో పాటు, పొట్టను ఫ్లాట్ గా మార్చడంలోనూ సహాయపడుతుంది.

కావాల్సిన పదార్థాలు
1 గ్రీన్ టీ బ్యాగ్
చిన్న అల్లం ముక్క
1 టీస్పూన్ తేనె ( అవసరం అనుకుంటే )

తయారు చేసే విధానం
ఒక కప్పు నీటిని ఉడికించాలి. తురిమిన తాజా అల్లం వేయాలి. అల్లం వేశాక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దాంట్లో టీ బ్యాగ్ ముంచాలి. 5 నిమిషాల ర్తవాత టీ బ్యాగ్ తీసేయాలి. అంతే బెల్లీ ఫ్యాట్ కరిగించే డ్రింక్ రెడీ. కావాలనుకుంటే తేనె మిక్స్ చేసి.. రెగ్యులర్ గా తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

టిప్
ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని.. ఈ డ్రింక్ తాగడం మంచిది.



Click it and Unblock the Notifications