Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
అనుమానం పెనుభూతం.. బ్రెస్ట్ క్యాన్సర్ పై అపోహలు, వాస్తవాలు
రొమ్ము క్యాన్సర్.. ఇది ఆధునిక మహిళను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధి. ఆడవాళ్లలో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యానర్ పై అపోహలు చాలా ఉన్నాయి. రొమ్ములో ఏ చిన్నపాటి గడ్డ కనిపించినా.. క్యాన్సరేమో అని బెంబేలెత్తిపోతున్నారు కొందరు మహిళలు.
క్యాన్సర్ అనేక రూపాలలో వస్తుంది. మగవాళ్లలో అయితే అవయవాలకు క్యాన్సర్ వస్తుంది. కానీ.. మహిళలలో ఎక్కువగా కనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్. కానీ కొన్ని సందర్భాలలో పురుషులను కూడా రొమ్ము క్యాన్సర్ ఆందోళనకు గురిచేస్తోంది. రొమ్ము క్యాన్సర్ పై సాధారణంగా వినిపిస్తున్న అపోహలేంటో చూద్దాం. లేనిపోని అనుమానాలతో.. మరింత డీలా పడకుండా.. కింది అంశాలను పరిశీలించండి.

పురుషులకు రొమ్ము క్యాన్సర్ ?
మగవాళ్లు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు కొన్ని వందల పురుషుల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అయితే.. స్త్రీలతో పోల్చితే పురుషులలో రొమ్ము క్యాన్సర్ కి గురయ్యే వారి సంఖ్య చాలా తక్కువే.

ట్యాబ్లెట్స్ క్యాన్సర్ కారకమా ?
గర్భనిరోధక మాత్రల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని.. చాలా మంది మహిళలు అనుమానపడుతుంటారు. ఇలాంటి అపోహలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఈ ట్యాబ్లెట్స్ లో క్యాన్సర్ కారకమైన ఈస్ట్రోజెన్ ఉన్నమాటే నిజమే అయినప్పటికీ.. అది కొంత పరిమాణంలోనే ఉంటుంది కాబట్టి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు.

రొమ్ము క్యాన్సర్ కి చికిత్స లేదా ?
ఇతర వ్యాధుల తరహాలే రొమ్ము క్యాన్సర్ ని త్వరగా గుర్తిస్తే.. వెంటనే తగ్గించవచ్చు. కాబట్టి శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. మొదటి దశలో అయితే రొమ్ము క్యాన్సర్ ని తరిమికొట్టవచ్చు.

శస్త్ర చికిత్స తప్పదా ?
రొమ్ము క్యాన్సర్ ను శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే తగ్గించవచ్చు అని చాలా మంది భావిస్తారు. కానీ.. రొమ్ము క్యాన్సర్ ను కీమో థెరపి, రేడియేషన్ థెరపి, మందుల ద్వారా తగ్గించవచ్చు.

బ్రా ధరిస్తే ?
బ్రా లేదా డ్రాయర్ వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలా మంది అభిప్రాయం. వీటి వల్ల ఛాతీలో నొప్పి, అలర్జీ వంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ కు సంకేతాలని భావించడం సరికాదు.

కెఫీన్ క్యాన్సర్ కారకమా ?
కెఫీన్ కి రొమ్ము క్యాన్సర్ కి ఎలాంటి సంబంధం లేదు. కెఫీన్ వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని ఏ అధ్యయనాలు నిరూపించలేదు. అయితే కెఫీన్ వల్ల రొమ్ము క్యాన్సర్ కు అవకాశాలు తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

40 ఏళ్లు దాటిన వాళ్లకే రొమ్ము క్యాన్సర్ ?
వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఎక్కువని చాలామందిలో అపోహ ఉంది. కానీ వయసుతో సంబంధం లేకుండా.. రొమ్ము క్యాన్సర్ వస్తోంది. 90 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్లు పైబడిన మహిళల్లోనే కనిపిస్తున్నప్పటికీ.. చిన్న వయస్కులలోనూ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. 20 ఏళ్ల వయసు గల ఆడవాళ్లలో కూడా రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ 40 సంవత్సరాల వయసు ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్ కి అవకాశాలు ఎక్కువ కాబట్టి.. ముందుగానే పరీక్ష చేయించుకోవడం మంచిది.

డియోడ్రెంట్స్
బాహ్యమూలాలలో షేవ్ చేసుకున్న తర్వాత వాడే యాంటీసెప్టిక్ డియోడ్రెంట్ వాడటం వల్ల క్యాన్సర్ ముప్పు ఉందనుకోవడం అపోహే. ఇందులో ఉండే పారాబెన్స్ రొమ్ము క్యాన్సర్ కలుగ చేస్తాయని ఒక అపనమ్మకం ఉంది. ఈ డియోడ్రెంట్లు రొమ్ము క్యాన్సర్ కి కారకాలు కావు.

రొమ్ములో గడ్డలు
రొమ్ములో ముద్దలాగా, గడ్డలుగా ఉండటాన్ని గమనించి చాలా మంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. కానీ రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గా భావించడం సరికాదు. ఏదైనా గడ్డలు కనిపించిన వెంటనే ఆందోళన చెందకుండా.. ఒకసారి డాక్టర్ ని సంప్రదిస్తే.. ఎలాంటి భయం అవసరం లేదు.

ఛాతీ చికిత్సలకు క్యాన్సర్ కు సంబంధం లేదు
ఛాతీ చికిత్సల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ ఛాతీ చికిత్సల వల్ల రొమ్ము క్యాన్సర్ కలగదని.. తాజా పరిశోధనలు వెల్లడించాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం బ్రెస్ట్ ఇంప్లాంట్ వల్ల అనా ప్లాస్టిక్ లార్జ్ సెల్ లింఫోమా అనే అరుదైన క్యాన్సర్ కు అవకాశం ఉంది.

రొమ్ము క్యాన్సర్ కి కారణాలు
రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచే కొన్ని అంశాలను డాక్టర్లు గుర్తించారు. స్త్రీలకు వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. వంశపారంపర్యంగా, 12 ఏళ్ల కంటే ముందే రజస్వల కావడం, 55 ఏళ్ల కంటే ముందే నెలసరి ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం, 30 ఏళ్ల తర్వాతే తొలి సంతానం కలగడం, హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడడం, బరువు ఎక్కువగా పెరగడం... ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ ముప్పు పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications