For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అడిసన్ వ్యాధి : లక్షణాలు, కారణాలు, ప్రమాద కారకాలు మరియు చికిత్స

|

అడిసన్ వ్యాధి (నిస్సత్తువ వ్యాధి)ని అడ్రినల్ లోపం అని కూడా అంటారు. ఇది వినాళ గ్రంథి(ఎండోక్రైన్) లేదా హార్మోన్ల ఉత్పత్తి వ్యవస్థ యొక్క అరుదైన రుగ్మత. ఇది మీ శరీరం అవసరమైన పరిమాణంలో కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేయని సమయంలో అభివృద్ధి చెందుతుంది. అడ్రినల్ గ్రంథులు మీ మూత్ర పిండాల పైన ఉంటాయి. మీ (సాధారణ) శారీరక పనులకు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, అడ్రినల్ కార్టెక్స్ పాడైపోయినప్పుడు మరియు అవసరమైన స్టెరాయిడ్ హార్మోన్ల కార్టిసాల్ మరియు ఆల్డోస్టెరాన్ ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు ఈ వ్యాధి వస్తుంది. కార్టిసాల్ అనే హార్మోన్ ఒత్తిడితో కూడిన పరిస్థితులకు ఒకరి శరీర ప్రతిచర్యను నియంత్రిస్తుంది. ఆల్డోస్టెరాన్ మీ శరీరంలో సోడియం మరియు పొటాషియం స్థాయిలను నియంత్రించడానికి దోహదం చేస్తుంది.

Addisons Disease

అడిసన్ వ్యాధి ఏ వయసు వారికైనా వస్తుంది. మహిళలను, పురుషులను సమానంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి తగిన సమయంలో చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అడిసన్ వ్యాధికి బ్రిటీష్ వైద్యుడు థామస్ అడిసన్ పెట్టారు. ఈ వ్యాధి గురించి దట 'ఆన్ ది కాన్ స్టిట్యూషనల్ అండ్ లోకల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ ది సుప్రారెనల్ క్యాప్సుల్స్ (1855)లో వివరించారు.

1) అడిసన్ వ్యాధి యొక్క లక్షణాలు..

1) అడిసన్ వ్యాధి యొక్క లక్షణాలు..

ఈ వ్యాధి లక్షణాలు బయట పడటానికి రెండు నుండి మూడు నెలల సమయం పడుతుంది. ఇది సాధారణ క్రమంలో అభివృద్ధి చెందుతుంది.

వికారం

విపరీతమైన అలసట

లో బ్లడ్ షుగర్ (హైపోగ్లెకేమియా)

బరువు తగ్గడం

ఆకలి తగ్గడం

మీ చర్మం నల్లబడటం (హైపర్పిగ్మెంటేషన్)

లో బిపి, మూర్చ రావడం

సాల్ట్ క్రేవింగ్ (ఉప్పు తినాలన్న కోరిక)

కండరాలు లేదా కీళ్ల నొప్పులు

వాంతులు

కడుపునొప్పి

డిప్రెషన్ (కుంగుబాటు)

మహిళల్లో అయితే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి జట్టు రాలడం మరియు లైంగికంగా పట్టు కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధి సోకిన వారు న్యూరోసైకియాట్రిక్ లక్షణాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, పరిస్థితి అడిసోనియన్ సంక్షోభానికి దిగజారిపోతుంది. ఇది ఆందోళన, కంటిచూపు, వినికిడి సమస్యలు, మతిమరుపును కలిగిస్తుంది. పరిస్థితి మరింత దిగజారితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.

అధిక జ్వరం

గందరగోళం మరియు భయం

చంచలత

స్పృహ కోల్పోవడం

నడుము వెనుక లేదా కాళ్లలో ఆకస్మాత్తుగా నొప్పి

2) అడిసన్ వ్యాధి కారణాలు..

2) అడిసన్ వ్యాధి కారణాలు..

మీ శరీరంలో అడ్రినల్ గ్రంథులు దెబ్బతినడం వల్ల ఈ అడిసన్ వ్యాధి పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. దీని ఫలితంగా హార్మోన్ల ఉత్పత్తి జరగకుండా ఆగిపోతుంది. అడ్రినల్ లోపాలను రెండు భాగాలు విభజించారు. అవి ఒకటి ప్రాథమిక అడ్రినల్ లోపం. రెండోది ద్వితీయ అడ్రినల్ లోపం.

ప్రాథమిక అడ్రినల్ లోపం :

మీ అడ్రినల్ గ్రంథులకు తీవ్రమైన నష్టం జరిగినప్పుడు మరియు హార్మోన్లు ఉత్పత్తి కాని సమయంలో ఇది సంభవిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ అడ్రినల్ గ్రంథులపై దాడి చేసినప్పుడు ప్రాథమిక అడ్రినల్ లోపాలు బయటపడతాయి. గ్లూకోకార్టికాయిడ్లు, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ మరియు అసాధారణ పెరుగుదల (కణితులు) మరియు రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడానికి ఉపయోగించే కొన్ని బ్లడ్ సెల్స్ చిన్నగా ఉండటం వల్ల కూడా ఇది అభివృద్ధి చెందుతుంది.

ద్వితీయ అడ్రినల్ లోపం :

పిట్యూటరీ గ్రంథి హార్మోన్ల విడుదలకు అవసరమైన అడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్ (ఎసిటిహెచ్)ను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుంది. ద్వితీయ అడ్రినల్ లోపం యొక్క చాలా లక్షణాలు ప్రాథమిక అడ్రినల్ లోపం యొక్క లక్షణాలను పోలి ఉంటాయి. మందులు, కణితులు, జన్యుశాస్త్రం, మరియు మెదడుకు బలమైన గాయం కారణంగా ద్వితీయ అడ్రినల్ లోపం కూడా అభివృద్ధి చెందుతుంది.

3) అడ్రిసన్ వ్యాధికి ప్రమాద కారకాలు..

3) అడ్రిసన్ వ్యాధికి ప్రమాద కారకాలు..

అడిసన్ వ్యాధిని ఎక్కువగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నవి ఏంటేంటే..

డయాబెటిస్ లేదా గ్రేవ్స్ డిసీజ్ వంటి క్యాన్సర్ ఆటో ఇమ్యూనో వ్యాధి క్షయవ్యాధి వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు వంటివి అడిసన్ వ్యాధిని ఎక్కువగా అభివృద్ధి చేసే అవకాశముంది.

4) అడిసన్ వ్యాధి నిర్ధారణ ఇలా..

4) అడిసన్ వ్యాధి నిర్ధారణ ఇలా..

అడిసన్ వ్యాధిని అర్థం చేసుకోవడానికి మరియు పరిశీలించడానికి, డాక్టర్ మీ వైద్య చరిత్ర మరియు సంకేతాలు, మరియు లక్షణాలను పరిశీలిస్తారు. టెస్టులన్నీ పూర్తయ్యాక వ్యాధి నిర్ధారిస్తారు. అప్పుడే ఎసిటిహెచ్ స్టిమ్యులేషన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఇన్సులిన్ ప్రేరిత హైపోగ్లైకేమియా పరీక్ష ఇమేజింగ్ టెస్టులను చేస్తారు.

5) ఈ వ్యాధికి అవసరమైన చికిత్స..

5) ఈ వ్యాధికి అవసరమైన చికిత్స..

అడిసన్ వ్యాధికి చికత్సను వైద్యులు నిర్ణయిస్తారు. వారు గ్రంథులను నియంత్రించే మందులను సూచిస్తారు. అవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాకాకుండా మీ స్థాయిని మరింత సరిచేయడానికి మరియు మీ శరీరంలోని స్టెరాయిడ్ హార్మోన్ల అసమతుల్యతను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన చికిత్సను చేస్తారు. లేదా యోగా మరియు ధ్యానం వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు కూడా దోహదం చేస్తాయి. ఎందుకంటే మీ ఒత్తిడిని నియంత్రించడానికి ఇవి సహాయపడతాయి. మీకో ముఖ్య గమనిక.. మీరు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించే ముందు తప్పకుండా మీ వైద్యుడితో మాట్లాడండి లేదా సంప్రదించండి.

Read more about: health హెల్త్
English summary

Addison's Disease: Symptoms, Causes, Risk Factors And Treatment

In women, however, the effect is much greater. Their team is going to get up and lose sexually. Those infected are more likely to experience neuropsychiatric symptoms. If left untreated, the situation will worsen into the Adesonian crisis. It causes anxiety, eyesight, hearing problems, and forgetfulness. If the condition worsens, these symptoms should go to the doctor immediately.
Story first published: Thursday, September 5, 2019, 16:46 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more