Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్!
మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో పాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. పాల ద్వారా లేదా పాల ఉత్పత్తుల ద్వారా మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరతాయన్న విషయం మరందరికీ తెలిసిందే. అయితే మనం చాలా సందర్భాల్లో గాడిదపాలు, మేక పాలు కూడా చాలా మేలు చేస్తాయని వింటుంటాం. గాడిద పాలు 1 లీటరు కొనాలంటే కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక మేక పాలు కావాలంటే కూడా ఇంతే.
అయితే వర్షాకాలంలో విస్తరించే డెంగ్యూని తగ్గించడంలో మేక పాలు నిజంగా అద్భుతాలు చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. డెంగ్యూ బారిన పడినప్పుడు ప్లేట్ లెట్లు పడిపోయానట్లు మేక పాలు తాగడం మేలు చేస్తాయనడంలో ఎంత నిజం ఉంది? దీనిపై ఆయుర్వేద నిపుణులు ఏం అంటున్నారు?

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదంలో మేక పాలను ఛాగ్ పే అని పిలుస్తారు. ప్రాచీన వైద్య గ్రంథమైన చరక సంహిత(చికిత్సాస్థానం, అధ్యాయం 8) లోని రాజయక్ష్మ ట్రీట్మెంట్ లో మేక పాల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. విపరీతమైన నీరసం,టీబీ, రక్తపు వాంతులు వంటి సమస్యలకు మేక పాలు అద్భుతమైన ప్రథమ ఔషధంగా పనిచేస్తాయి.
ఒకవేళ మేక పాలు దొరకని పక్షంలో ఆవు పాలకు ఐదు రెట్లు నీళ్లు కలిపి.. ఆ నీరంతా ఆవిరయ్యే వరకు బాగా మరిగించి, పటిక బెల్లం లేదా విదారిగంధ వంటి మూలికలతో కలిపి రోగికి ఇస్తే శరీరానికి ఎంతో బలం చేకూరుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
మేక పాలతో కలిగే అద్భుత ప్రయోజనాలు
సులభమైన జీర్ణక్రియ
ఆవు పాలతో పోలిస్తే మేక పాలలో కొవ్వు కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల ఇవి కడుపులో ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చాలా సులభంగా, వేగంగా జీర్ణమవుతాయి.
వ్యాధి నిరోధక శక్తి
ఇందులో ఉండే జింక్, సెలీనియం, మరియు ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఎముకల దృఢత్వం
క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం (ఫాస్ఫరస్) పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
దగ్గు, రక్తస్రావానికి చెక్
దీర్ఘకాలిక దగ్గు, శ్వాసకోశ సమస్యలు, క్షయ వ్యాధితో బాధపడే రోగులకు ఇది ఒక టానిక్‌లా పనిచేసి మేలు చేస్తుంది.
ప్లేట్ లెట్లు పెరుగుతాయా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
మేక పాలు తాగితే డెంగ్యూ రోగుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య అమాంతం పెరుగుతుందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రధాన శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా పచ్చి లేదా సరిగ్గా కాచని మేక పాలను తాగడం వల్ల బ్రూసెల్లోసిస్ అనే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది బ్రూసెల్లా మెలిటెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనివల్ల డెంగ్యూ రోగి పరిస్థితి మరింత విషమించి, కోలుకునే ప్రక్రియ నెమ్మదిస్తుందని ఆధునిక వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
