Latest Updates
-
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే?
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.?
ఉదయాన్నే కప్పు టీ లేదా కాఫీ కడుపులో పడితే కానీ మహిళలు ఇంటి పనులు ప్రారంభించలేరు. ఉదయం, సాయంత్రం మాత్రమే కాదు.. పని ఒత్తిడి. నిద్రమత్తు, అలసటగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటిని సిప్ చేయాల్సిందే. ఎందుకంటే వాటిలోని కెఫీన్ ఇన్‌స్టంట్ రిలీఫ్‌ను ఇస్తుంది. అయితే రోజంతా వీటిని తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మహిళల్లో హార్మోన్లు, పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందా.? కెఫీన్ ప్రభావం మహిళలపై ఎలా ఉంటుంది.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి.. ఇక్కడ చూద్దాం..

అధిక కెఫీన్ తీసుకోవడం ద్వారా శరీరంపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో నిద్రలేమి, గుండె దడ, కడుపు నొప్పి, రుతుక్రమ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంకా గర్భధారణ సమయంలో మహిళలు 200మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవద్దని సిఫారసు చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. చూద్దాం..
హార్మోన్ బ్యాలెన్స్‌పై కెఫీన్ ప్రభావం
సంతానోత్పత్తి, గర్భధారణకి మహిళల్లో హార్మోన్లు సమతుల్యంగా ఉండాలి. ఈ క్రమంలో కెఫీన్ నేరుగా హార్మోన్ల అసమతుల్యతకి దారితీయదు. టీ, కాఫీ వల్ల నేరుగా ఈ సమస్య వాటిల్లకపోయినా పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. ఈస్ట్రోజెన్ పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. రోజులో అధికంగా కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి ఫలితంగా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో రుతుస్రావంలో మార్పులు కలుగుతాయి. రోజువారీ ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపిస్తుంది.
రుతుస్రావం, సంతానోత్పత్తి
బుుతుస్రావంపై కెఫీన్ ప్రభావాల గురించి స్పష్టమైన అధ్యయనాలు లేకపోయినా.. కొన్ని రీసెర్చ్‌లు మాత్రం కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే రుతుచక్రం నిడివిలో మార్పులు కలిగినట్లు చెబుతున్నాయి. అయితే కెఫీన్ ప్రభావం వల్లనే గర్భధారణ సమస్యలు తలెత్తుతాయని అనుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మీకు నెలసరిలో సమస్యలు కనిపించినా, పీరియడ్స్ సమయంలో అధికంగా నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉన్నా.. గర్భం ధరించడంలో ఇబ్బందులు ఉన్నా, దానికి కారణం కెఫీన్ అని భావించవద్దు. వైద్య పరీక్షల ద్వారా అసలైన కారణాన్ని తీసుకుని చికిత్స తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్ తీసుకోవడం తగ్గించడంతో చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్ వంటివాటిని తీసుకోవడం కూడా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తిగా మానేయాలా.?
అయితే టీ, కాఫీ అలవాటు ఉన్నవారు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా కెఫీన్ తీసుకోవడం మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. టీ, కాఫీలు జీర్ణక్రియ, కడుపు సమస్యలను మాత్రమే తీవ్రతరం చేస్తాయని చెబుతున్నారు. వాటి వల్ల హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం లేదని అంటున్నారు. కానీ.. ఇర్‌రెగ్యులర్ పీరియడ్స్, సంతానోత్పత్తి సమస్యలు, అధికంగా లేదా తక్కువగా రక్తస్రావం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. కెఫీన్‌ను తీసుకోవడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకుంటే చాలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
