Latest Updates
-
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే..
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.?
వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదమే కాదు, పాము కాటు కేసులు కూడా ఎక్కువగా నమోదవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా గ్రామీణ వ్యవసాయ ప్రాంతాలు, వరదలు, భారీ వర్షాల సమయంలో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అయితే పాముకాటుకి గురైనప్పుడు చికిత్స చేసే సమయంలో రోగిని మేల్కోమంటారు. ఇందుకు కారణాలేంటి.. డాక్టర్ల సలహాలు తెలుసుకుందాం..

వైద్య నిపుణుల సూచనల మేరకు పాముకాటు తర్వాత కలిగి అతిపెద్ద హాని విషం వల్ల కాదని.. భయాందోళనలు కలగడంతో పాటు సరైన చికిత్స లేకపోవడం వల్లే కలుగుతుందని అంటున్నారు. ఇంటి చికిత్స, మంత్ర వైద్యం, పాము కాటు కలిగిన ప్రదేశం చుట్టూ కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, లేదా గుడ్డతో గట్టిగా చుట్టడం వంటి తప్పుల వల్ల రోగి పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పాముకాటుకి గురైన వ్యక్తిని మేల్కొని ఉండమని చెబుతుండటం చూస్తుంటాం.. ఇందుకు కారణాలు ఏంటంటే..
పాము విషం నుంచి వచ్చే ప్రభావం.. ఏ పాము కాటు వేసింది, శరీరంలోకి ఎంత విషం ప్రవేశించింది, బాడీలో ఏ భాగం ప్రభావమవుతందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పాముల విషం నరాలు, కండరాలపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కనురెప్పలు వాలిపోతాయి. మాట్లాడటంలో లేదా మింగడంలో ఇబ్బందులు పడతారు. శ్వాస కండరాలు క్రమంగా బలహీనపడతాయి. ఇలాంటి సమయంలో రోగి స్పృహను, శ్వాసను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

రోగి ఎందుకు మేల్కొని ఉండాలి..
పాము కాటు తర్వాత శరీరంలో రోగి లక్షణాలను, స్పృహ స్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి రోగి మేల్కొని ఉండటం చాలా అవసరం. రోగి నిద్రపోతే అతని పరిస్థితి విషమిస్తుందా లేదా స్పృహ కోల్పోతున్నారా అనేది గుర్తించడం కష్టతరంగా ఉంటుంది. ఇక, కొన్ని విషపూరిత పాముల విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తీవ్రమైనప్పుడు శ్వాస కండరాలు ప్రభావితమవుతాయి. అందుకే రోగి స్పృహను పర్యవేక్షించడం చాలా ముఖ్యం.
పాము కాటు తర్వాత ఈ తప్పులు వద్దు..
పాము కాటు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా గాయాన్ని బ్లేడుతో కోసి రక్తాన్ని బయటకు తీయకూడదు. నోటితో విషాన్ని పీల్చకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాటు పడిన చోట క్లాత్‌తో గట్టిగా కట్టడం వల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. విషాన్ని నోటితో పీలిస్తే పీల్చిన వ్యక్తికి హాని కలగవచ్చు. అందుకే ఇంటి చికిత్సపై ఆధారపడకుండా నేరుగా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. సరైన సమయానికి వైద్యుని వద్దకు చేరుకుని వారి సలహా మేరకు ఇంజెక్షన్ తీసుకోవాలి. రోగి శ్వాస, రక్తపోటు, ఇతర అవయవాల సమస్యలను పర్యవేక్షించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
