Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.!
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. లేదంటే త్వరగా అయిపోయే బ్రెడ్ జామ్, బ్రెడ్ పాలు తయారుచేసుకుని టిఫిన్ అయిపోయిందనిపిస్తారు. కానీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు తప్పనిసరిగా పుష్కలంగా ఉంటాయి. మైదాతో చేసే ఈ బ్రెడ్‌లో ఫైబర్, ఇంకా న్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే రోజూ ఉదయం తప్పనిసరిగా సమతుల్య ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

బ్రెడ్- జామ్, రోస్టెడ్ బ్రెడ్.. చెప్పుకోవడానికి ఆధునికంగా అనిపించినా ఇది తినడం ద్వారా కావాల్సిన స్థాయిలో పోషకాలు శరీరానికి అందవు. త్వరగా కడుపు నిండినట్లు అనిపించినా ఆ కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. అందుకే మీ రోజును ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభించడం ద్వారా రోజంతా ఎనర్జీగా ఉంటారు. శరీరానికి తగిన పోషకాలు అందడంతో కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి కూడా వేయదు. ఈ క్రమంలో మీ టిఫిన్‌లో బ్రెడ్‌కి బదువులుగా కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహారాలను ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
ఓట్స్..
ఓట్స్‌లో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం ద్వారా త్వరగా కడుపు నిండిన భావన కలిగి ఆకలిని నియంత్రిస్తుంది. ఓట్స్‌లో పాలలో ఉడికించి తీసుకోవచ్చు.. లేదా ఉప్మా మాదిరిగా అయినా చేసుకోవచ్చు. ఉప్మాలో రవ్వ బదులుగా ఓట్స్ వేసి ఉడికిస్తే సరిపోతుంది. ఓట్స్ ఉప్మా తీసుకోవడం ద్వారా ఎక్కువసేపు శక్తివంతంగా ఉండవచ్చు.
పెసర్లు
పొట్టు పెసర్లలో పీచుపదార్థం, ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని దోశలుగా లేదా మొలకలుగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మొలకల కోసం పెసలను ముందురోజు ఉదయం నానబెట్టి రాత్రి తడి గుడ్డలో కట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి మంచిగా మొలకలు వస్తాయి. లేదా పెసలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే రుబ్బి అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి పిండి మిశ్రమం చేసుకుని పెనంపై దోశలుగా పోసుకోవచ్చు. పెసలు కండరాలకు పోషణనిచ్చి అలసిపోకుండా కాపాడుతుంది.
అటుకులతో పోహా
అటుకుల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని తీసుకుంటే పొట్ట కూడా చాలా తేలికగా ఉంటుంది. రుచికరంగానూ ఉంటుంది. ఉప్మా మాదిరిగానే దీన్నీ చేసుకోవచ్చు. అయితే ముందుగా అటుకులను కడిగి పక్కన పెట్టుకుని.. బాణలిలో నూనె, ఆవాలు, కరివేపాకు, వేరుశనగలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇలా మీకు నచ్చినవి వేసుకుని వేగాక.. అటుకులు పసుపు వేసి కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసుకోవడం ద్వారా రుచి అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

రాగులు
సీజన్ ఏదైనా ఎముకల ఆరోగ్యానికి రాగులు మంచి ఆహారం. ఎండాకాలంలో ఉదయం రాగి జావా చేసుకుని తాగవచ్చు. వర్షాకాలంలో రాగి పిండితో దోశలు పోసుకోవచ్చు. రాగిపిండిలో కాస్త పెరుగు, నీళ్లు పోసి దోశ పండిలా చేసుకుని దోశలు తయారుచేసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది. కాల్షియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా అందుతాయి.
పెరుగులో ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్
ఉదయాన్నే పెరుగును సరైన విధానంలో తీసుకున్నట్లయితే ప్రొబయాటిక్స్ సమృద్ధిగా అందుతాయి. ప్రొటీన్, కాల్షియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అంది జీర్ణక్రియ మెరుగవుతుంది. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కొన్ని పండ్లు.. అరటి, ఆపిల్, బెర్రీ, దానిమ్మ లేదా ఇతర సీజనల్ పండ్లతో పాటు బాదం, వాల్‌నట్స్, చియా, అవిసె గింజలు వంటివి చల్లుకుని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవండి. ఎక్కువగా నూనె, ఉప్పు, వెన్న, పంచదారను వినియోగించడం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగుతూ, చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా రోజంతా శక్తిని పొందుతారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారం మానేయకుండా మీకు ఉన్న టైంలోనే సమతుల్య పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications