Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
చిన్న విషయానికే కోపం,అంతలోనే ఏడుపు..పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ కు ఇలా చెక్ పెట్టండి!
పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళల్లో తెలియని ఆందోళన మొదలవుతుంది. అప్పటివరకూ ఉల్లాసంగా ఉన్నవారు అకస్మాత్తుగా కోప్పడటం, చిన్న విషయానికే కన్నీళ్లు పెట్టుకోవడం లేదా విపరీతమైన చిరాకు పడటం మనం గమనిస్తూనే ఉంటాం.
శారీరకంగా వచ్చే కడుపు నొప్పితో పాటు, మానసిక స్థితిలో వచ్చే ఈ మార్పులనే మూడ్ స్వింగ్స్ అంటారు. ఇది కేవలం మీ మనసులో ఉండే అపోహ కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవేంటో,ఆ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ చూడండి.

అసలు మనసు ఎందుకు మారుతుంది?
పీరియడ్స్ ప్రారంభమయ్యే ముందు శరీరంలో ఈస్ట్రోజెన్,ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోతాయి. మన మెదడులో ఆనందాన్ని కలిగించే సెరోటోనిన్ అనే రసాయనం ఉంటుంది. ఈస్ట్రోజెన్ తగ్గినప్పుడు సెరోటోనిన్ కూడా తగ్గుతుంది. అందుకే ఆ సమయంలో దిగులుగా, నిరాశగా అనిపిస్తుంది.
-ఒకపక్క శారీరక నొప్పి,మరోపక్క హార్మోన్ల అసమతుల్యత వల్ల ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఇది మనల్ని మరింత అశాంతికి గురిచేస్తుంది.
-ఈ సమయంలో స్వీట్లు తినాలనే కోరిక పెరగడం, నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కూడా చిరాకు పెరుగుతుంది.
-కొందరిలో ఇది సాధారణ PMS (ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్) అయితే మరికొందరిలో PMDD (ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్) అనే తీవ్రమైన సమస్యగా మారవచ్చు.
ఈ మూడ్ స్వింగ్స్ కు చెక్ పెట్టండిలా..
నెలనెలా వచ్చే ఈ సమస్యను పూర్తిగా ఆపలేకపోయినా కొన్ని చిట్కాలతో దాని ప్రభావాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు.
-నొప్పుగా ఉందని ముడుచుకు పడుకోకండి. తేలికపాటి యోగా లేదా నడక వంటి వ్యాయామాలు చేయండి. ఇవి మీ మెదడులో ఎండార్ఫిన్లను విడుదల చేసి మూడ్ బాగుండేలా చేస్తాయి.
-చిప్స్, స్వీట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
-పీరియడ్స్ సమయంలో కెఫిన్ (టీ, కాఫీ) ఆందోళనను పెంచుతుంది. అందుకే వీలైనంత వరకు వాటిని తగ్గించి నీరు ఎక్కువగా తాగండి.
-రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర చాలా అవసరం. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
-మీకు నచ్చిన పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని జయించండి.
-మీ మూడ్ స్వింగ్స్ మరీ తీవ్రంగా ఉండి, మీ దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రం, ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సైకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications