Latest Updates
-
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.?
Unseasonal Rains: ఎర్రటి ఎండాకాలంలో వర్షాలు.. ఆరోగ్య సమస్యలు రావొద్దంటే ఇలా చేయండి
వేసవి కాలం ప్రారంభమై ఓ వైపు సూర్యుడు మండిపోతుంటే.. తానూ ఏం తక్కువ కాదన్నట్లుగా వరుణుడు కూడా విరుచుకుపడుతున్నాడు. మొన్నటి వరకు అకాల వర్షం కురవడంతో.. చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. వాతావరణ మార్పులతో పిల్లలతో పాటు పెద్దవారు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
అయితే వీటన్నిటికి చెక్ పెట్టాలంటే ముందు నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సలహాలు, సూచనలు, చిట్కాలు పాటిస్తే.. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదూ.

గత రెండ్రోజులుగా వాతారణం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటి వరకు విపరీతమైన ఎండ, మరికాసేపట్లోనే వర్షం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన గాలి మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కుకారడం లాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీజనల్ ఫ్రూట్స్ చాలా ముఖ్యం.. తరచూ తినాల్సిందే!
ఓ వైపు ఎండ, మరోవైపు చల్లటి వాతావరణం. ఇలా ఏది వచ్చినా తట్టుకునే సామర్థ్యం కావాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. దీని కోసం సీజనల్ పండ్లతో పాటు కూరగయాలను తినాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి.
అయితే వేసవిలో వచ్చే మామిడి, పుచ్చకాయ, లిచీ, బచ్చలికూర, ఓక్రా, సీసా పొట్లకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే శీతాకాలం నుంచి వసంత కాలంలోకి మారేటప్పుడు పరివర్తన చెందే పండ్లు, కూరగాయలతో కూడా అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. నారింజ, జామ, బొప్పాయి, క్యారెట్లు, బచ్చలికూర మరియు ఆవాలు, ఆకు కూరలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు.
ముఖ్యంగా రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచడంలో సిట్రస్ పండ్లు మరింత ఉపయోగపడతాయి. జామ, ఉసిరి, బెల్ పెప్పర్స్, టొమాటోలతో రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
మసాలాలు మర్చిపోవద్దు:
అలాగే వీటితో పాటుగా ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, దాల్చిన చెక్క, పసులు వంటివి కూడా తరచుగా వంటల్లో వాడాలి. వీటి వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భారతీయ వంటకాల్లో ఇలాంటి సుగంధ ద్రవ్యాలు రుచి కోసం మాత్రమే కాకుండా.. వాటి ఔషధ గుణాల కోసం కూడా వాడుతుంటారు.
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి:
వేసవికాలంలో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఒంట్లోని నీరు మూత్రం రూపంలో, చెమట రూపంలో బయటకు వెళ్లిపోతే తగినన్ని నీళ్లు తాగాల్సి ఉంటుంది. లేకపోతే డీహైడ్రేషన్ కు గురవుతాం. కాలంతో సంబంధం లేకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నీటితో పాటు నిమ్మకాయ రసం, పుచ్చకాయ జ్యూస్ లాంటి పండ్ల రసాలు తీసుకోవాలి.
కంటినిండా నిద్ర పోవాలి:
అలాగే ప్రతీ రోజు రాత్రి 7-8 గంటల పాటు పడుకోవాలి. అవసరం అయినంత మోతాదులో ఆహారం, నీరు, నిద్ర ఉంటేనే మనిషి చాలా ఆరోగ్యంగా ఉండి.. ఎలాంటి సమస్యల బారినా పడడు. సో జాగ్రత్త ఫ్రెండ్స్.. ఈ చిట్కాలు పాటించి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి. అనారోగ్యం బారిన పడకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications