Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.!
ఈ రోజుల్లో చిన్నారులు ఎక్కువగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో వారి వయసు కంటే వేగంగా బరువు పెరుగుతున్నారు. ఈ అధిక బరువు వారు ఎక్కువగా తినడం వల్ల వస్తుందని కొట్టిపారేయకండి.. ఎందుకంటే చిన్నారుల్లో ఊబకాయం అనేది భవిష్యత్తులో డయాబెటిస్, అధిక రక్తపోటు, నిద్ర లేమితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో ఊబకాయం సమస్య రావడానికి తల్లిదండ్రులు కూడా పరోక్షంగా కారణం కావచ్చు. కాగా, ఏ తప్పులు, పొరపాట్ల వల్ల ఒబెసిటీ పెరుగుతుంది.. ఇందుకు నివారణ మార్గాలు ఏంటి.. నిపుణుల సలహాలు చూద్దాం..

ఊబకాయానికి కారణాలు
మొబైల్ ఫోన్లు, టీవీ అతిగా చూడటం..
ఈ కాలంలో పిల్లలు చిన్న వయసులోనే మొబైల్ ఫోన్, టీవీలకు ఎక్కువగా బానిస అవుతున్నారు. స్క్రీన్ టైం ఎక్కువసేపు గంటల తరబడి చూడటం వల్ల అక్కడి నుంచి కదలకుండా ఉన్నచోటే ఉంటున్నారు. దీని వల్ల రోజువారీ శారీరక కార్యకలాపాలాపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పిల్లలు ప్రతిరోజూ ఆడుకోవడం, నడవడం, వయస్సుకి తగిన విధంగా ఇతర శారీరక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్లయితే టీవీ, ఫోన్‌కి ఎక్కువ సమయం అలవాటు కాకుండా ఉంటారు.
ప్యాక్‌డ్, జంక్ ఫుడ్ అలవాట్లు
చిన్న వయసు నుంచే పిల్లలు ఎక్కువగా చిప్స్, బిస్కెట్లు, పిజ్జా, బర్గర్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్, మిఠాయిల, ఇంకా కూల్‌డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇంటి ఫుడ్ కంటే బయట తిండిపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో వారిలో కేలరీలు పెరిగి ఒబెసిటీకి దారితీస్తుంది. జంక్ ఫుడ్‌కి బదులుగా పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు, పాలు వంటి పోషకాహారం చేర్చుకోవడం ద్వారా కేలరీలు ఎక్కువగా శరీరంలోకి చేరవు. ఒబెసిటీ రాకుండా నివారిస్తుంది.

బలవంతంగా తినిపించడం..
చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్లేట్‌లో వడ్డించిన ఆహారం మొత్తం తినేయాలని ఒత్తిడి పెడుతుంటారు. వారి ఆకలి, కడుపు నిండిన భావనను పట్టించుకోరు. పదేపదే వారికి తినిపించడం చేసినట్లయితే వారి ఆహారపు అలవాట్లపై దుష్ప్రభావం చూపిస్తుంది. అందుకే వారి ఆకలిని అర్థం చేసుకుని భోజనం మితంగా పెట్టాలి.
నిద్ర వేళలు
పిల్లలకు చిన్న వయసు నుంచే తగినంత నిద్రతో పాటు రోజూ సరైన నిద్ర వేళలు పాటించడం ముఖ్యం. ఫోన్, టీవీ ధ్యాసలో పడి రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండటం ద్వారా వారి నిద్ర వేళలు డిస్టర్బ్ అవుతాయి. దీంతో వారి నిద్రపై ప్రభావం చూపి.. నిద్ర లేమికి దారితీస్తుంది. దీంతో బరువు పెరగడంతో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. అందుకే పిల్లలకు సరైన సమయంలో నిద్ర పోయేలా చూడటం మంచిది.

తల్లిదండ్రుల ఆరోగ్య అలవాట్లు
చాలా వరకు పిల్లలు తమ అలవాట్లను తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. పేరెంట్స్ జంక్ ఫుడ్ తినడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం లాంటి అలవాట్లు ఉన్నట్లయితే వారు కూడా అదే అలవాటు చేసుకుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకునేలా చేయాలి. ఇది మొత్తం వారి కుటుంబ జీవనశైలిని మెరుగుపరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
