Latest Updates
-
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే?
గుడ్డు పెంకులతో ముఖానికి ఫేస్ ప్యాక్.. ఇలా చేశారంటే పాజిటివ్ రిజల్ట్ పక్కా.!
శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను అందించడంతో పాటు సౌందర్య రక్షణలో గుడ్డు ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అందుకే రోజుకి ఒక ఉడకబెట్టిన గుడ్డు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఇక గుడ్డులోని తెల్లసొన చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే గుడ్డు పెంకులను అందరూ బయటపారవేస్తుంటారు. కానీ గుడ్డు పెంకులు కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.

గుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్ పుష్కలంగా ఉండటంతో పాటు స్వల్పంగా ఇతర ఖనిజాలు సైతం ఉంటాయి. ఈ పెంకులను పొడి చేసి ఫేస్ ప్యాక్‌లాగా పెట్టుకోవడం వల్ల చర్మం నిగారింపు మరింత పెరుగుతుంది. చర్మంపై ముడతలను తగ్గించడంతో పాటు, మొటిమలను, నల్లమచ్చలను తొలగిస్తుంది. ఖరీదైన ఫేస్ ప్యాక్‌లు కొనే అవసరం లేకుండా, బ్యూటీ పార్లర్లకు వెళ్లే పని లేకుండా ఈ కిచెన్ చిట్కాతో మీ చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
గుడ్డు పెంకుల ఫేస్ ప్యాక్ తయారీ విధానం
ముందుగా గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టాలి. తర్వాత పొడిగా చేసి పౌడర్‌గా తయారుచేసుకోవాలి. ఈ పౌడర్‌ను ఓ గిన్నెలోకి తీసుకుని తేనె, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు ముఖానికి అలాగే ఉంచిన తర్వాత ఆరిపోతుంది. అనంతరం గోరువెచ్చని నీటితో ఫేస్ ప్యాక్‌ను తొలగిస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేయడం ద్వారా సత్ఫలితాన్ని పొందవచ్చు.
గుడ్డు పెంకుల ఫేస్ ప్యాక్ యూజ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అయితే ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదటి సారిగా గుడ్డు పెంకుల ఫేస్ ప్యాక్ వాడేవారు ముందుగా చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం శ్రేయస్కరం. స్కిన్ ఎలర్జీ ఉన్నవారు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాలి.

ఎగ్ షెల్ ఫేస్ ప్యాక్ తో ప్రయోజనాలు
గుడ్డు పెంకులో ఉండే ఖనిజాలు ముఖంపై ముడతలు తొలగించడంలో కీలపాత్ర పోషిస్తారు. చర్మాన్ని బిగుతుగా ఉంచి మృదువుగా ఉండేలా చేసేందుకు కోలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మం లోతుల్లోకి వెళ్లి మలినాలను తొలగిస్తుంది. తద్వారా మొటిమలు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలను, ముఖంపై నల్ల మచ్చలు లేకుండా చేస్తుంది. గుడ్డు పెంకులోని సహజ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఫేస్‌ను బాక్టీరియాను చంపేస్తుంది.
ఈ మిశ్రమంలో ఉండే మినరల్స్.. చర్మంపై మృత కణాలను తొలగించడమే కాకుండా.. సహజ ఎక్స్ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. తద్వారా మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇందులోని సహజ పోషకాలు ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని రిలాక్స్ చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు పొల్యూషన్ వల్ల కలిగే మంట, వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా మీ చర్మాన్ని అధిక వేడి నుంచి రక్షించడంలో సహకరిస్తుంది. వేసవిలో తరచుగా బయటకు వెళ్లే వారు ఈ గుడ్డు పెంకుల ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
