Latest Updates
-
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు!
బొప్పాయితో ఆరోగ్యానికి బోలెడంత లాభం
బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.. కాబట్టి రెగ్యులర్ గా బొప్పాయి పండు తింటూ ఉండండి.
Read more:బొప్పాయి జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్
భోజనం చేశాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయి తినడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని అరికట్టవచ్చు. ఇలాంటి మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం.. పపాయ ఫ్రూట్. మరి పపాయలో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో చూసేయండి...

బొప్పాయి పండు
బొప్పాయి పండులో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఫ్లావనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. బొప్పాయి ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, శరీరానికి కావలసిన పోషకాలను సమృద్దిగా అందిస్తుంది.

బరువు తగ్గడానికి
బొప్పాయిపండులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్ వాడకాన్ని పెంచి.. బరువును తగ్గిస్తుంది.

హార్ట్ డిసీజెస్
బొప్పాయి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, యాంటీ-ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, అధిక కొవ్వు పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల నుంచి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

అలసట తగ్గించడానికి
అలసట, మార్నింగ్ సిక్ నెస్, అనారోగ్య సమస్యలు నివారించడానికి బొప్పాయి సహకరిస్తుంది. రోజులో రెండు సార్లు బొప్పాయి పండు తినటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బొప్పాయి ఆకులు రుతుక్రమ సమయంలో కలిగే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

రోగనిరోధక శక్తి పెంచడానికి
బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, సి, ఈ లను పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి.

క్యాన్సర్
క్యాన్సర్ నివారించడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, ల్యూటీన్, క్సాంతిన్, సిప్రోటాక్సింతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.

జీర్ణక్రియకు
పొట్ట, పేగులలో హాని కలిగించే విష పదార్థాలకు టానిక్ లా పనిచేస్తుంది పపాయ. జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా జరగడానికి ఈ ఫ్రూట్ సహకరిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వయసును తగ్గిస్తుంది
బొప్పాయికి వయసు ఛాయలు కనిపించకుండా చేసే శక్తి ఉంది. 5 సంవత్సరాలు తగ్గించి.. యవ్వనంగా కనపడేలా చేస్తుంది. చర్మం నిగారింపు సంతరించుకోవడానికి పపాయ ఫ్రూట్ సహకరిస్తుంది.

కంటి చూపు
బొప్పాయి పండు తినటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. యుక్త వయసులో పండ్లను ఎక్కువగా తీసుకుంటే.. భవిష్యత్ లో కంటి సమస్యలు తక్కువగా ఉంటాయి.

మధుమేహానికి
బొప్పాయి పండు తియ్యగా ఉన్నప్పటికీ.. బీపీ పేషంట్స్ కి మంచి పరిష్కారం. మధుమేహంను కంట్రోల్ చేయడానికి పపాయ ఫ్రూట్ సహకరిస్తుంది.

ఒత్తిడి
ఒత్తిడిగా ఫీలయినప్పుడు వెంటనే బొప్పాయి పండు తిని చూడండి.. తేడా మీకే తెలుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications