Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఉడ్ యాపిల్(వెలగపండు)లోని ఔషధ గుణాలు: ఆరోగ్య ప్రయోజనాలు
‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు'అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇది బాగా వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినప్పటికీ దీంతో చేసే పెరుగు పచ్చడి, పప్పు కూరని రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు అయితే మంచి వాసన వస్తూ తీపీ పులుపూ కలిపిన రుచితో ఉంటుంది. దీన్ని బెల్లం లేదా తేనె అద్దుకుని తింటారు. కొబ్బరిపాలు కలుపుకుని మలయాళీలు అల్పాహారంగా తింటుంటారు. ఇండోనేషియన్లు, మిక్కిలి పండిపోతే జ్యూస్‌లూ, జామ్‌లూ చేస్తుంటారు. వేసవిలో నిమ్మకాయ షర్బత్‌లా ఈ జ్యూస్ దాహార్తిని తీరుస్తోంది.
వినాయక చవితినాడు కూడా గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగ తప్పని సరి. వెలగపండులేని వినాయక చవితిని ఊహించలేం. గణపతికి ప్రీతిపాత్రమైన వెలక్కాయలు పాలవెల్లి అలంకారంగానూ నైవేద్యంగానూ పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అంతకుమించిన ఔషధ గుణాలెన్నో అందులో దాగున్నాయి. అందుకే ఈ పూజా ఫలం ... అమృత తుల్యం అంటుంటారు.
పూజా ఫలం.. అమృత తుల్యం
ఉడ్ యాపిల్, మంకీ యాపిల్, ఎలిఫెంట్ యాపిల్ , కర్డ్ ఫ్రూట్.. ఇలా ఇంగ్లీష్‌లో చాలా పేర్లే ఉన్నాయి. ఏనుగులు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. కాబట్టేనేమో ఎలిఫెంట్ యాపిల్ అనీ కూడా అంటారు. వినాయక చవితి మొదలుకుని వేసవి వరకూ ఇవి వస్తూనే ఉంటాయి. మిగిలిన పండ్ల మాదిరిగా కాకుండా కొబ్బరికాయలా దీన్ని కూడా పగుకొట్టి తినాల్సిందే.
పోషక భరితం.. వెలగ (ఆంగ్లం Elephant apple) రూటేసి కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగ ను శాస్త్రీయంగా 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' అనిగాని అంటారు. ఇది దాదాపు అన్నినేలలో పెరుగుతుంది. మిగిలిన పళ్లలో మాదిరిగానే ఇందులోనూ పోషకాలకూ లోటు లేదు. 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రిబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. మరి వెలగపండులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

డయేరియా:
ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట.

అజీర్తిని తొలగిస్తుంది:
అజీర్ణ సమస్యలు తొలగించే విషయంలో ఇది ఔషధమనే చెప్పాలి. కడుపులోని నులిపురుగులని చంపి, అజీర్తి సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. అల్సర్‌తో బాధపడే వారు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది.

రక్తహీనతకు ఔషధం వంటిది:
రక్తహీనత లేకుండా చేస్తుంది. గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది.రక్తహీనతను నివారించే ఇనుమూ దీన్నుంచి లభిస్తాయి.

. ఎక్కిళ్లకు తక్షణ నివారిణి:
ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి.

ఎనర్జీ బూస్టర్:
అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది.

కిడ్నీసమస్యలు మరియు స్టోన్స్ నివారిస్తుంది :
మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి.

కాలేయ సమస్యలను నివారిస్తుంది:
బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లూ, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది.

హార్ట్ కు మంచి టానిక్ వంటిది:
గుండె జబ్బుల్ని నివారించే ఫాస్ఫరస్‌లతో హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది.

క్యాన్సర్ నివారిణి:
స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

వీర్యవృద్ధి:
వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది.

కండరవృధ్ధి
దీన్ని తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృధ్ధి చెందుతాయి.

మధుమేహ నివారణి:
వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
వ్యాధినిరోధకత పెరగడం వల్ల దగ్గూ, జలుబూ, వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. వంద గ్రాముల వెలగపండులో 140 కెలొరీలు ఉంటాయి. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది.

పండే కాదు.. ఈ చెట్టు బెరడూ,
పండే కాదు.. ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. కానీ వేసవి వరకూ ఇవి దొరుకుతూనే ఉంటాయి. మరి ఇప్పటికైనా వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...



Click it and Unblock the Notifications