Latest Updates
-
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా..
అలసిన కళ్లకు హోం రెమిడీస్
మీ కళ్లు అలసిపోతున్నాయా ? తరచుగా ఎర్రగా మారుతున్నాయా ? మీ కళ్లు దురదగా ఉంటున్నాయా ? అలాంటప్పుడు వెంటనే కళ్లకు రిలీఫ్ ఇవ్వాలనిపిస్తుంది కాదూ. ఇలా అలసటకు గురై.. ఒత్తడికి లోనవుతున్న కళ్లకు ఉపశమనం కలిగించడానికి సహజ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
నయనం ప్రధానం అన్నారు. ఎన్నెన్నో అందాలను.. ఆకర్షణీయమైన ప్రపంచాన్ని చూడాలంటే కంటి ఆరోగ్యం బాగుండాలి. అవి ప్రమాదానికి గురైతే.. మూడ్ తోపాటు పనికి కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చెబుతున్న అమేజింగ్ టెక్నిక్స్ ఫాలో అయి చూడండి.. మీ కళ్లు ఎంత బాగా సేదతీరుతాయో.
వందేళ్ళ కంటి చూపుకోసం తినండి విటమిన్ రిచ్ ఫుడ్స్
పని ఒత్తిడి, దూరప్రయాణాలు, బైక్ ల మీద జర్నీలు, కంప్యూటర్ల మీద గంటల తరబడి పనిచేయడం, స్మార్ట్ ఫోన్లలతో ఎక్కువ సేపు గడపటం.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్లు అలసటకు లోనవుతుంటాయి. కారణమేదైనా.. సున్నితమైన కళ్లపై శ్రమ మాత్రం పెరుగుతోంది. కాబట్టి అలసిపోతున్న కళ్లకు సాంత్వన ఇవ్వడానికి చక్కటి హోం రెమిడీస్ మీ కోసం...

కంటినిండా నిద్ర
మీ కళ్లకు నూతనోత్తేజం కలిగించాలంటే.. కంటినిండా నిద్రపోవాలి. రోజుకి 7గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. సరిగా నిద్రలేకపోతే.. కళ్లు అలసిపోతాయి.. ఒత్తిడికి గురవుతాయి. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు కళ్లను శుభ్రం చేసుకుంటే బాగా నిద్రపడుతుంది.

చల్లటి టీ బ్యాగ్స్
టీ తాగిన తర్వాత టీ బ్యాగ్ లను వేస్ట్ చేయకండి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టీ బ్యాగులను నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత కళ్లపై పెట్టుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

దోసకాయ
దోసకాయ ముఖ్కలను కళ్లపై కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తర్వాత కళ్లపై పెట్టుకుంటే.. అలసిపోయిన కళ్లకు ఉపశమనం కలుగుతుంది. చాలా ఈజీ పరిష్కారం.

ఐ బాత్
శుభ్రంగా ఉన్న నీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. కంటిని ఆ నీటిలో ముంచుతూ.. కళ్లు తెరవాలి. దీనివల్ల కళ్లలో ఉన్న దుమ్ము, దూళి బయటకు పోతాయి. ఈ పద్ధతి ఈజీగా.. ఇంట్లో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

దోసకాయ రసంలో ముంచిన దూది
కంటికి అవసరమైన ఉపశమనం త్వరగా.. ఈజీగా పొందడానికి ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది. దోసకాయ రసంలో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని రాత్రంగా అలాగే ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల కళ్ల చుట్టూ వాపును కూడా తగ్గిస్తుంది.

ఆలూ రసం
కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు పోవడానికి ఆలూ ఉపయోగపడుతుంది. ఆలూ నుంచి తీసిన రసాన్ని కొంతసేపు ఫ్రిజ్ లో ఉంచాలి. అవి చల్లబడిన తర్వాత కళ్లచుట్టూ అద్దుకోవాలి.

మసాజ్
కళ్లను అప్పుడప్పుడు మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరగడమే కాదు.. కళ్ల చుట్టూ ముడతలు తగ్గి ఫ్రెష్ గా కనిపిస్తాయి. చూపుడు వేలితో కంటి చుట్టూ సున్నితంగా మర్దనా చేయాలి.

ఐ డ్రాప్స్
కొన్ని సందర్బాలలో కళ్లలో దురద విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు కంటి డాక్టర్ సూచించిన ఐ డ్రాప్స్ ని వాడాలి. ఐ డ్రాప్స్ మూత ఓపెన్ చేసిపెట్టినవి.. చాలా కాలం తర్వాత వాడితే.. ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. కాబట్టి కళ్ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.



Click it and Unblock the Notifications