Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగుటకు గల గ్రేట్ రీజన్స్ ...
ఆరెంజ్ ఫ్లేవర్ సాధారణంగా అందరికి ఇట్టే నచ్చుతుంది. చూడటానికి మంచి రంగు, అంతకుమించిన రుచి.. ఎవరినైనా ఆరెంజ్ పండ్లు ఇష్టపడేలా చేస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇందులో విటమిన్ C, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆల్కహాల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ రెగ్యులర్ గా ఆరెంజ్ జ్యూస్ త్రాగుతుంటే ముఖంలో ముడుతలను నివారించుకోవచు. అదే విధంగా జలుబు నివారించుకోవచ్చు. అదేలాగో లైఫ్ స్టైల్లో సింపుల్ గా మంత్రం ఒకటి ఫాలో అవ్వాల్సిందే. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు.
శరీర పెరుగుదలకి, జీవక్రియలు చురుకుగా పనిచేయడానికి, బి.పి.ని తగ్గించడాకోవడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు ఆరెంజ్ లో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక ఫైబర్ శాతం సంగతి చెప్పనక్కరలేదు. మందులు వేసుకున్న తర్వాత ఓ గ్లాసు ఆరెంజు జ్యూస్ తాగితే అవి మరింత త్వరగా ఒంటబడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం ఆరోగ్యానికే కాదు.. మంచి శరీర ఛాయని కలిగి ఉండాలన్నా, వయసు ప్రభావం కనిపించకుండా ఉండాలన్నా కూడా రోజు ఒక ఆరెంజ్ తింటే చాలు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాల్ని నియంత్రించడంతో పాటు, వయసును మీద పడనివ్వదని, కోల్డ్, దగ్గు మరియు బ్లడ్ ప్రెజర్, హైకొలెస్ట్రాల్ వంటి సమస్యలుండవని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది.
మనం తొక్కతీసి తింటే.. అబ్బబ్బ పులుపు అని అంటుంటాం కదా! కానీ తొక్క తీయకుండా తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఆరెంజ్ జ్యూస్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి, పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే కాబట్టి ఎవ్వరూ ఆరెంజ్ జ్యూస్ ను త్రాగకుండా ఉండలేరు . అయితే క్యాలరీలు మరిన్ని చేరకుండా ఉండాలంటే ఆరెంజ్ జ్యూస్ కు పంచదార జోడించకుండా తీసుకోవాలి. మరియు ఆరెంజ్ జ్యూస్ ను ఫ్రెష్ గా తీసుకోవాలి. మరి ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా ఎందుకు తాగాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

1. క్యాన్సర్ నివారిణి:
ఆరెంజ్ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నివారించడంతో పాటు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఆరెంజ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సిలు క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది . ఆరెంజ్ జ్యూస్ లో ఉండే హెస్పరిడిన్, యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ కణతులు ఏర్పడకుండా నివారిస్తుంది. దాంతో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

2. బాడీ డిటాక్స్:
ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ శరీరంను డిటాక్సిఫై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . కిడ్నీలు ప్రొపర్ గా పనిచేయడానికి సహాయపడుతుంది . విటమిన్ ఎ ఐసైట్ ను మెరుగుపరుస్తుంది . కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా త్రాగడంవల్ల రేచీకటి సమస్యలను నివారిస్తుంది.

3. బ్లడ్ సర్క్యులేషన్:
ఆరెంజ్ జ్యూస్ లో ఉండే ఫొల్లెట్ డిఎన్ఎ ఉత్పత్తిని పెంచుతుంది.దాంతో కొత్త సెల్స్ ను పెంచుతుంది . శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను శుభ్రపరచడానికి ఫొల్లెట్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది శరీరంలో జీవక్రియలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దాంతో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా పనిచేస్తాయి.

4. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది:
హెప్పర్డిన్ అనే అంశం శరీరాన్ని వివిధ రకాల వైరస్సుల నుండి కాపాడుతుంది . ఓవర్ బ్లడ్ ప్రెజర్ కు గురికాకుండా బ్లడ్ సెల్స్ ను కంట్రోల్ చేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

5. కొలెస్ట్రాల్ నిర్వాహణకు:
కార్డియో వ్యాస్యులర్ డిసీజ్ లకు కారణం హై కొలెస్ట్రాల్. కాబట్టి రెగ్యులర్ గా ఆరెంజ్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలోని రక్తనాళాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది. దాంతో రక్తకణాలకు రక్తం ఫ్రీగా సరఫరా అవ్వడానికి సహాయపడుతుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

6. ఇన్ఫ్లమేషన్:
సహజంగాఆరెంజ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది అవయావాలకు ఇన్సులిన్ సరిపడా ప్రసరింపచేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో హార్ట్ కు రక్షణ కల్పించబడుతుంది. కార్డియో వ్యాస్కులర్ వీన్స్ కు రక్షణ కల్పిస్తుంది దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు.

7. బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది:
ఆరెంజ్ లో విటమిన్ బి9, ఫొల్లెట్ అధికంగా ఉంటాయి . ప్రెగ్నేన్సీ సమయంలో ఈ రెండు విటమిన్స్ ముఖ్య పాత్రపోషిస్తాయి . ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ ను క్రమం తప్పకుండా త్రాగడం వల్ల బేబీ పుట్టుకలో లోపాలను నివారిస్తుంది . ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్ త్రాగడానికి ఇది ఒక గ్రేట్ రీజన్ .



Click it and Unblock the Notifications