Latest Updates
-
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు
డ్రై జింజర్ పౌడర్ లేదా సొంటితో అద్భుతమైన ప్రయోజనాలు..!
డ్రై జింజర్ పౌడర్ ను సొంటి అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి అచ్చు ఫ్రెష్ జింజర్ లాగే కనిపిస్తుంది. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు ఫ్రెష్ జింజర్ తోనే తయారుచేస్తారు. సొంటి హాఫ్ వైట్ కలర్ లో ఘాటైన ఆరోమా వాసనతో ఉంటుంది. దీన్ని నిల్వచేసుకోవడం చాలా సులభం.
డ్రై జింజర్ ను ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకుని ఒక హెర్బల్ మెడిసిన్ గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నేచురల్ హెర్బల్ రూట్ లో అద్భుతమైన ప్రయోజనాలు దాగున్నాయి. డ్రై జింజర్ ను పౌడర్ చేసివివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సొంటి డికాషన్ లేదా సొంటి కషాయం రూపంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. వింటర్ సీజన్ లో దీని వాడకం ఎక్కువ. శీతాకాలంలో వచ్చే సాధారణ జలుబు దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.వీటితో పాటు మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

1. కులీనరీ ఉపయోగం:
డ్రైజింజర్ పౌడర్ ను పోపుదినుసుగా కూడా ఉపయోగిస్తుంటారు. కర్రీస్, గ్రేవీ మసాలాలకోసం , స్టీవ్స్ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
దాల్చిన చెక్క, సోంపు, యాలకలు మరియు లవంగాలతో తయారుచేసిన మసాలా టీలో కొద్దిగా సొంటి పౌడర్ కూడా మిక్స్ చేసి తాగుతారు. ఇంకా తందూరి స్టార్టర్స్, వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ కోసం డ్రైజింజర్ ముక్కలు కలుపుతుంటారు . డ్రైజింజర్ పౌడర్ ను గర్భం పొందాలనుకునే వారు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా తినవచ్చు . వివిధ రకాల డిష్ లలో జింజర్ కుక్కీస్, జింజర్ క్యాండీస్ లో ఉపయోగిస్తుంటారు.

2. టోనర్:
రెండు స్పూన్ల డ్రైజింజర్ పౌడర్ ను నాలుగు కప్పుల నీటిలో మిక్స్ చేసి వేడి చేయాలి. 2 కప్పుల నీళ్ళు అయ్యే వరకూ ఉడికించాలి. తర్వాత వడగట్టి, గోరువెచ్చగా అయిన తర్వాత అందులో కొద్దిగా ల్యావెండర్ లేదా రోజ్మెర్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో నింపి, ఫ్రిజ్ లో నిల్వచేసుకోవాలి. అవసరమైనప్పుడు కాటన్ డిప్ చేసి ముఖానికి టోనర్ గా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మానికి రక్షణకల్పిస్తుంది. మలినాలను తొలగిస్తుంది. చర్మానికి అవసరమయ్యే హైడ్రేషన్ అందిస్తుంది. చర్మంలో డ్రైనెస్ తొలగిపోతుంది.

3. పొట్ట సమస్యలు తగ్గిస్తుంది:
డ్రై జింజర్ పౌడర్ ను చెరుకు రసంకు మిక్స్ చేసి తాగడం వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది . ప్రతి రోజూ ఉదయం పరగడుపును ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.

4. తలనొప్పి:
డ్రై జింజర్ పౌడర్ ను పేస్ట్ లా చేసి తల నుదిటికి అప్లై చేస్తే తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. చాలా వరకూ తలనొప్పికి ఉపయోగించే థెరఫీలలో దీన్ని ఉపయోగిస్తుంటారు. గొంతుకు అప్లై చేయడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

5. చెస్ట్ పెయిన్ :
డ్రైజింజర్ పౌడర్ ను ఉపయోగించి చెస్ట్ పెయిన్ తగ్గించుకోవచ్చు. డ్రై జింజర్ పౌడర్ మరియు పంచదారను కొబ్బరి బోండాంలో మిక్స్ చేసి తాగడం వల్ల చెస్ట్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

6. యాంటీ ఇన్ఫ్లమేటీరగా పనిచేస్తుంది:
డ్రై జింజర్ పౌడర్ లోయాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ నుండిఉపశమనంకలిగిస్తుంది.రెండు మూడు టేబుల్ స్పూన్ల పౌడర్ లో నీళ్ళు మిక్స్ చేసి వేడి చేసి, తాగడం వల్ల జాయింట్ వాపులను తగ్గిస్తుంది. మోకాళ్ళకు ఈ పేస్ట్ ను లేదా వాటర్ ను అప్లై చేస్తే నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

7. సాధారణ జలుబు నుండి ఉపశమనం:
అల్లం పౌడర్ ను సాధారణంగా లేదా సీజనల్ గా వచ్చే జలుబును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు జింజర్ పౌడర్ కు కొద్దిగా పెప్పర్ పౌడర్, చిటికెడు బెల్లం మిక్స్ చేసి కషాయం చేసి తాగడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా డ్రైజింర్ పౌడర్ కు లవంగాల పొడి, ఉప్పు మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు దగ్గు లక్షణాలు నివారించబడుతాయి.

8. మెటబాలిజం:
డ్రై జింజర్ పౌడర్ లో థర్మోజనిక్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ ను కరిగించి ఓబేసిటి తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. ఈ పౌడర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతంది. ఇది శరీరంలో నిల్వ చేరిన ఫ్యాట్ ను కరిగిస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ కరిగిస్తుంది .

9. బరువు తగ్గిస్తుంది:
బరువు తగ్గడానికి జింజర్ టీ గ్రేట్ రెమెడీ . అరటీస్పూన్ డ్రై జింర్ పౌడర్ ను ఒక కప్పు హాట్ వాటర్ తో మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఈ టీకి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకుంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

10. ఆపానవాయువు తగ్గిస్తుంది:
డ్రైజింజర్ పౌడర్ కు చిటికెడు ఇంగువ , బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి గ్లాసు వేడినీటిలో కలుపుకుని తాగడం వల్ల ఆపానవాయువు(పిత్తుల) సమస్య ఉండదు .

11. యూరిన్ ఇన్ఫెక్షన్:
డ్రై జింజర్ పౌడర్ ను పాలలో మిక్స్ చేసి, కొద్దిగా తేనె లేదా పంచదార మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండవు.

12. జింజర్ బాత్ :
ఒక టేబుల్ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఈ పౌడర్ ను శరీరం మొత్తానికి అప్లై చేసి మర్ధన చేయాలి.

13.మైగ్రేన్ :
2 టేబుల్ స్పూన్ల డ్రై జింజర్ పౌడర్ ను వేడినీటితో మిక్స్ చేసి నిద్రలేచిన వెంటనే తాగితే మైగ్రేన్ తలనొప్పి సమస్య ఉండదు.

14. మొటిమలను నివారిస్తుంది:
అల్లం పౌడర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మిల్క్ పౌడర్ లో డ్రై జింజర్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుని,మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీన్ని వారానికొకసారి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం



Click it and Unblock the Notifications











