Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
ఇండియన్ సమ్మర్ ను ఎదుర్కొవడానికి బెస్ట్ కూలింగ్ ఫుడ్స్ ...
సీజన్ మారే కొద్దీ వాతావరణం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసు కోవాలి. ముఖ్యంగా వేసవిలో తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధవహించడం చాలా అవసరం. ఎందుకంటే చెమటరూపంలో ఎక్కువగా శరీరంలోని నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అది óగమించేందుకు ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. వీటివల్ల విటమిన్‌లు సమృద్దిగా అంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండ దెబ్బకు వచ్చే నీరసాన్ని చిటికలో నివారించే వీలు చిక్కుతుంది. దీనికితోడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ బయటి తిండ్లకు దూరంగా ఉంటే వేసవిలో అనారోగ్య సమస్యలు రాకుండా గట్టెక్కవచ్చు. ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తిన్నా తాగినా ఆరోగ్యంపై ఖచ్చితంగా దుష్ప్రభావం చూపు తుంది.
ప్రతీ సీజన్‌లో ఏవో పండ్లు దొరుకు తూనే ఉంటాయి. వేసవి కాలంలో మాత్రం చాలా రకాల పండ్లు పలకరిస్తాయి. వీటిలో విటమిన్‌లతో కూడినవాటిని తీసుకోవాలి. నిమ్మ, జామ, ద్రాక్ష, పుచ్చకాయలను తీసు కోవడంవల్ల విటమిన్ సి తోపాటు శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. జీడిపప్పు, బాదం, పిస్తాలలో విటమిన్ ఇ ఉంటుంది. బొప్పాయి, క్యారెట్, మామిడిలో విటమిన్ ఏ లభిస్తుంది. ఆకుకూరల్లో కాల్షి యంతోపాటు ఐరన్ సమృద్దిగా ఉంటుంది.
ఈ సీజన్‌లో దొరికే పండ్లు, వివిధ రకాల కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఆపిల్స్, ఆస్పరాగస్, బ్లూ బెర్రీస్, ఆప్రికాట్,ఆస్ట్రిచెస్ మరియు వెల్లుల్లి వంటివి వేసవి కాలపు ఆహారాలు. ఈ సీజన్ లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. మరి మీరు సీజనల్ ఫుడ్స్ తినాలను కుంటు న్నారా...? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్‌లో దొరికే కొన్ని పండ్లు, కూరగాయల గురించి తెలుసుకుందాం...

మజ్జిగ :
మజ్జిగ వేసవికాలంలో తీసుకోవల్సిన బెస్ట్ ఫుడ్స్ లో ఇది ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ త్రాగుతుంటే, ఇది శరీరంను చల్లగా ఉంచతుంది. మరియు ఇది శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు మరియు దగ్గును నివారిస్తుంది.

పుదీనా:
ఇది మనకు చాలా సులభగా దొరికే ఒక ఆహారం పదార్థం, మరియు చౌకైనది కూడా . ఇది ఒక హెల్తీ హెర్బ్ . పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు . పుదీనాతో మంచి ఫ్లేవరబుల్ చట్నీలు చేసుకోవచ్చు . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

ఉల్లిపాయలు:
ఉల్లిపాయలో అమేజింగ్ కూలింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి . అందుకే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కర్రీస్, సలాడ్స్, రైతాలు, చట్నీస్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది . ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ యాంటీ అలర్జిన్ . సన్ స్ట్రోక్ నుండి ఇది మన శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

వాటర్ మెలోన్:
వేసవిలో తీసుకోవల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ వాటర్ మెలోన్. ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్ లో 90శాతం నీళ్ళు 10శాతం ఫ్లెష్ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరంను పూర్తిగా హైడ్రేషన్ లో ఉంచుతుంది.

మస్క్ మెలోన్:
వేసవికి మరో బెస్ట్ ఫుడ్ మస్క్ మెలోన్ . వేసవికాలంలో మీ డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన మరో ఆహారం ఇది. మస్క్ మెలోన్ లో ఉండే వాటర్ కంటెంట్ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది.

జామకాయ:
జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు జామకాయలో మరికొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి . వీటిని వేసవికాలంలో తీసుకోవడం వల్ల మిమ్మిల్ని హెల్తీగా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. జామకాలో ఉండే ప్రోటీనులు మీకు ఎక్కువ శక్తిని అందిస్తాయి.

కొబ్బరి బోండాం:
కొబ్బరి బోండాంలోని నీరు తీసుకోవడం వల్ల వేసవికాలంలో శరీరంను చల్లగా ఉంచుతుంది . కాబట్టి, కోకనట్ వాటర్ వేసవికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు మీ చర్మం చూడటానికి అందంగా ఫ్రెష్ గా మరియు సాఫ్ట్ గా కనబడేలా చేస్తుంది . మరియు ఇది శరీరంలోని టాక్సిన్స్ నివారిస్తుంది.

క్యారెట్స్:
క్యారెట్స్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది.

ఫవ బీన్స్:
ఈ స్ప్రింగ్ వెజిటబుల్ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇంకా బరువును తగ్గిస్తుంది. మీరు కనుక డైయట్ పాటిస్తున్నట్లైతే ఈ అత్యధిక పోషకాలున్న ఆహారాన్ని మీ డైయట్ లిస్ట్‌లో చేర్చుకోండి.

రెడ్ రాడిష్ (ఎర్ర ముల్లంగి):
ఎర్ర ముల్లంగి ప్రతి రోజూ తీసు కోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన నీటి శాతం పెరుగుతుంది. ఇంకా ఇది సులభ ంగా జీర్ణం అవు తుంది. కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని కలగ నివ్వదు. ఈ ఎర్రని మరియు తెల్లని ముల్లంగి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది.

నిమ్మకాయ:
ఇవి వింటర్‌లో విరివిగా దొరు కుతాయి. బరువు తగ్గించడానికి, శరీరంలోని విషాలను బయటకు పంపడానికి, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి బాగా సహాయ పడుతుంది.

కీరదోసకాయ:
ఈ వాటర్ రిచ్ గ్రీన్ వెజిట బుల్‌లో అత్యధిక పోషకాంశాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగి స్తాయి. వీటిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.

ఫైనాపిల్:
ఇందులో నీటితో కూడిన యాంటి ీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధికంగాఉం టుంది. కాబట్టి ఫైనాపిల్ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉండి ఎము కల బలానికి మరియు జలుబు తగ్గించ డానికి, దంత ఆరోగ్యానికి, జీర్ణ క్రియకు బాగా సహాయపడు తుంది.

ద్రాక్ష:
మధుమేహగ్రస్తులు తినగలిగే మరో సిట్రస్ ఫ్రూట్‌ఇది. ఇందులో శరీరానికి హాని కలిగించే పిండి పదార్థాలు కలిగి ఉంటాయి కాబట్టి తగు మోతాదులో తీసుకోవాలి.

దానిమ్మ
దానిమ్మ గింజలు కప్పు, రెండు కప్పులు ద్రాక్ష (గింజలు లేకుండా), చెంచా పంచదార మొత్తం మిక్స్ చేసి ఆ రసాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు వుంచి సేవించాలి.దానిమ్మ వల్ల అతిసారం, డయేరియా, ప్రేవులలో ఉన్న నులిపురుగులు పోతాయి. జీర్ణక్రియ చైతన్యంగా వుంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కిడ్నీ, లివర్‌లు ఆరోగ్యంగా వుంటాయి. హెమోగ్లోబిన్ పెరుగుతుంది. గుండె జబ్బుల నివారణకు మంచి దోహదకారి.

బొప్పాయి:
బొప్పాయి పండులో విటమిన్ సి, ఫోలెట్, కెరోటినాయిడ్స్ మరియు సాధా రణంగా జీర్ణశక్తిని పెంచే ఎంజైములు కలిగి ఉంటుంది. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లో 55 కెలోరీలు ఉంటాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

బ్లూ బెర్రీస్:
బెర్రీపండ్లు బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగ నీస్, పొటాషియమ్ ఉంటాయి. బ్లూ బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి బరువు తగ్గడానికి బాగా సహకరిస్తాయి.

రాగి మాల్డ్
మార్కెట్లో రాగి పిండి చౌకగా లభిస్తుంది. లేకుంటే రాగులను పిండి పట్టించి వుంచుకుని ప్రతి రోజూ మాల్డ్ (జావ) గా కాచి, వినియోగించుకోవచ్చు. కప్పు రాగి పిండి రెండు, మూడు కప్పుల నీరు కలిపి వేడి చేసి, దానిలో రెండు స్పూన్‌ల పంచదార, ఒక ఏలక్కాయ పొడి కలిపి, చల్లగాను, కొంచెం వేడిగానూ సేవించవచ్చు. రాగి మాల్డ్‌ను ప్రతి రోజూ సేవించడం వల్ల, శరీరానికి ధాతుపుష్టి కలగడమే కాక, శరీరంలోని అదనపు వేడిని హరిస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా హుషారుగా వుంచుతుంది.



Click it and Unblock the Notifications











