Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ తో ఆరోగ్యం మెండు..
పండ్లు ,కాయలు మానవ ఆరోగ్యం కాపాడటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. వేసవి వచ్చిందంటే పుచ్చకాయ, సపోటా, చెరకు రసం, కీరా వంటి వాటికి భలే గిరాకీ ఉంటుంది. వీటితో పాటు నిత్యం లభ్యమయ్యే కొబ్బరి బొండాలతో అధికంగా ఉపయోగం ఉంటుంది. సహజ సిద్ధంగా లభ్యమయ్యే పండ్లు, కాయలు మానవ శరీరానికి కావలసిన ఖనిజాలు, లవణాలు, పోషకాలను అందించి అలసటను తీరుస్తున్నాయి. అంతే కాకుండా పలు వ్యాధులకు ఔషధాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.

పుచ్చకాయ..
శరీరాన్ని చల్లబరిచే గుణం పుచ్చకాయకు అధికంగా ఉంది. ఇది ఉదరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలోని ఆమ్లాలను తొలగిస్తుంది. మూత్రపిండాలు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. పుచ్చకాయ రసం జీలకర్ర, పంచదార కలిపి రాస్తే గనేరియా వంటి వ్యాధులు నయమవుతాయి. తేనే కలిపి తాగితే గుండె, మూత్రపిండాల సమస్యలు నయమవుతాయి. పుచ్చకాయ రసాన్ని కొద్దిగా వేడి చేసి తాగితే ఆస్తమా, జలుబు తగ్గుతాయి. అజీర్తికి మందులా పని చేస్తుంది. విత్తనాల రసాన్ని తాగితే బీపీ, మూత్ర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో క్యాన్సర్‌ను నిరోధించే గుణం కూడా ఉంది.

చెరుకు
వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో చెరుకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి, జ్వరంతో ఉన్నవారికి చెరకు రసాన్ని ఇస్తే శరీరానికి కావాల్సిన షుగర్, ప్రోటీన్స్, ఎలక్ర్టోలైట్స్ అందించి ఉపశమనం కలుగుతుంది. శొంటితో కానీ అల్లంతో కానీ చెరకు రసం కలిపి ఇస్తే వెక్కిళ్లు,జాండిస్ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్‌కు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా చెరకు గడ తినడం వల్ల పళ్లు, దవడలు గట్టిపడతాయి.ఒక్కగ్లాసు చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది.

సపోటా
వేసవి కాలంలో విరివిగా దొరికే పండు సపోటా....దీనిలో ఎక్కువ క్యాలరీలు ఉండటంతో అధిక శక్తిని ఇస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కేన్సర్ కారక విషపదార్థాల నుంచి పెద్దపేగును కాపాడుతుంది. అంతే కాకుండా అతిసారం, రక్తస్రావం కాకుండా పేగు వ్యాధులనుంచి కాపాడుతుంది.

మామిడిపండ్లు:
మామిడిపండ్లును వేసవి సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి . ఇది శరీరంలో వేడి పుట్టించే ఫుడ్స్ అయినా, వేసవి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

అరటిపండ్లు:
అరటిపండ్లలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ ఇండియన్ సూపర్ ఫుడ్ .

ద్రాక్ష:
ద్రాక్ష మహిళలకు ఒక ఆరోగ్యకరమైన ఫుడ్. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

స్ట్రాబెర్రీస్:
స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఈ సూపర్ ఫుడ్ సమ్మర్ సీజన్ ఒక ఒక ఉత్తమ ఫుడ్ అంతే కాదు వీటిలో క్యాల్షియం కంటెంట్ కూడా అధికంగా ుండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications