Latest Updates
-
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే! -
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది? -
గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం..అదృష్టం మీ వెంటే! -
సర్వార్థ సిద్ధి యోగం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధన లాభం! -
అన్నం మిగిలిపోయిందా? వృధా చేయకుండా ఇలా కరకరలాడే పకోడీలు చేసేయండి
మగవాళ్ల డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాల్సిన ఫుడ్స్
ఆహారం విషయంలో ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాం అనేదానిపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మగవాళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఉన్నాయి. వాటిని డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి.
చాలామంది మగవాళ్లు తమరేమి తింటున్నారో పట్టించుకోరని నిపుణులు చెబుతున్నారు. కానీ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మగవాళ్లు ఫాలో అవ్వాల్సిన డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

టొమాటో
టమోటాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లైకోపిన్ ఉండటం వల్ల కొలొరెక్టర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్ వంటి రిస్క్ నుంచి బయటపడేస్తుంది. కాబట్టి ఇవన్నీ మగవాళ్లలో ఎక్కువగా కనిపించే సమస్యలు. అందుకే మగవాళ్ల డైట్ లో కంపల్సరీ టమోటాలు చేర్చుకోవాలి.

ఓల్ గ్రెయిన్స్
ఓల్ గ్రెయిన్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఓట్స్, బ్రౌన్ రైస్ లో విటమిన్ బి ఉంటుంది కాబట్టి.. ఇది మగవాళ్లకు చాలా మంచిది. వాళ్లలో ఒత్తిడి, డిప్రెషన్ తగ్గిస్తాయి. ఓల్ గ్రెయిన్స్ లో ఉండే ఫోలేట్ స్పెర్మ్ ఆరోగ్యానికి, బయోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

వెల్లుల్లి
గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా మంచిది. కాబట్టి రోజూ మగవాళ్లు వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

సాల్మన్
ప్రొటీన్స్ మాత్రమే కాదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే ఆహారం సాల్మన్. అలాగే ఇందులో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కూడాఉంటాయి. కాబట్టి మగవాళ్ల డైట్ లో సాల్మన్ చేర్చుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు, కొలెరెక్టల్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, డిప్రెషన్ రిస్క్ తగ్గిస్తాయి.

బ్లూబెర్రీస్
బ్లూబెర్రీస్ లో ఎక్కువ మొత్తంలో ప్రొంథోసైయినిడిన్స్ ఉంటాయి. ఇవి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి. అంతేకాదు హార్ట్ ఎటాక్ రిస్క్ ని కూడా ఇవి తగ్గిస్తాయి. టైప్ టు డయాబెటిస్, అల్జీమర్స్ వంటి వ్యాధులను కూడా బ్లూబెర్రీస్ అరికడతాయి.

బ్రొకోలి
బ్రొకోలి, క్యాబేజ్, స్ప్రౌట్స్ లో క్యాన్సర్ తో పోరాడే కెమికల్స్ సల్ఫోరఫేన్ ఉంటాయి. ఇవి మగవాళ్లలో బ్లాడర్ క్యాన్సర్ వృద్ధిని, ప్రొస్టేట్, కొలెరెక్టల్ క్యాన్సర్ ను అరికడతాయి.

కోడిగుడ్లు
మీకు జుట్టు రాలే సమస్య ఉందా ? అయితే.. మీ డైట్ లో ఖచ్చితంగా కోడిగుడ్లు చేర్చుకోండి. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. పచ్చసొనలో ఐరన్ ఉంటుంది.

దానిమ్మ జ్యూస్
దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. ఎందుకంటే వీటిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications