Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ ఎముకలను స్ట్రాంగ్ గా మార్చే క్యాల్షియం ఫుడ్స్..!
ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్నిముఖ్యమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి.
ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్నిముఖ్యమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. ఎముకల అభివ్రుద్దికి స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

వయసు పెరిగే కొద్ది, ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల కూడా బోన్ కు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. శరీరంలో జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం ఎముకల్లో నిల్వచేరడం చాలా అవసరం. అలా ఎముకల్లో కాల్షియం చేరాలంటే, అందుకు మనశరీరానికి విటమిన్ డి చాలా అవసరం.
కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో క్యాల్షియం ఉన్నటువంటి ఆహారాలు సరైనా మోతాదులో తీసుకోకపోతే, ఎముకలు చిట్లడం, ఎముకలు అరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎముకల దృఢత్వానికి కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి.

ఆకుకూరలు
ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర, బ్రొక్కోలి... వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం లభిస్తుంది. ఒక కప్పు ఆకుకూరలో 336మి.గ్రాల కాల్షియం లభిస్తుంది.

పాలు
కాల్షియం అనగానే ముందుగా పాలే గుర్తుకొస్తాయి. సులభంగా జీర్ణమమడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 280మి.గ్రా కాల్షియం లభిస్తుంది.

బాదం
ఒక కప్పు బాదంలో శరీరానికి కావాల్సినంత కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా లభించే ఆహారపదార్థాల్లో ఇది టాప్‌లి్‌స్టలో ఉంటుంది బాదం. ప్రొటీన్స్ కూడా తగినంత లభిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బుల రిస్క్ తగ్గిపోతుంది.

ఆరెంజ్
ఒక ఆరెంజ్ తీసుకుంటే 60 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండటం వల్ల కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది.

పెరుగు
రోజులో కనీసం ఒకసారి పెరుగు వేసుకున్నా 400మి.గ్రాల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్నా తగినంత కాల్షియం లభిస్తుంది.

సోయా మిల్క్
ఒక కప్పు సోయామిల్క్‌లో 60 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications