Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కోల్డ్ వెదర్ లో వ్యాధినిరోధక శక్తిని పెంచే ...వార్మ్ వింటర్ ఫుడ్స్..!
సంవత్సరానికి ఒక సారివచ్చే ఈ శీతాకాలా, చల్లని వాతారణంతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ శీతాకాలనికి , చలికి తగినవిధంగా మనం సిద్ధిం చేసుకోవాలి . వార్డ్ రోబ్ లో ఉన్న ఉలెన్ స్కార్ఫ్స్ మరియు స్వెటర్లను బయటకు తీసి చలిని తట్టుకోవడానికి సిద్దంగా ఉంచుకుంటాం. ఈ శీతాకాలం మొత్తం మన శరీరానికి కలిగే చలి, వాతావరణంలో కఠినమైన గాలుల వల్ల చర్మం మరియు జుట్టు కూడా పొడిబారుతుంది. మరి ఈ కఠినమైన సీజన్ ను ఎదుర్కోవడానికి వింటర్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. వింటర్ సీజన్ లో చర్మం గురించి ఎంత సన్నాహాలు చేసుకొన్నా, మీరు సరైన ఆహారం మరియు న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సీజన్ మొత్తం చాలా సజావుగా సాగుతుంది.
ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయం. మన శరీర ఆరోగ్యానికి అవసరమైన, సరైన ఆహారం తీసుకోవడం, శరీరం యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ను మెయింటైన్ చేయడం చాలా అవసరం. సీజన్ బట్టీ మన శరీరం కూడా సర్దుబాటు చేసుకోవడం అవసరం. సీజన్ బట్టి, సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
వింటర్లో తీసుకొనే ఆహారాలు కొంత వెచ్చదనం కలిగించేవిగా ఉండాలి. వింటర్ వెచ్చదనం కోసం తీసుకొనే ఆహారం మరియు వేసవిలో చల్లని ఆహారాలు తీసుకోవడం చాలా సాధరణం. వింటర్ డైట్ అనుసరించడానికి సరైన ఆహారంను ఎంపిక చేసుకోవాలి. వింటర్ డైట్ లోకొన్ని ఆహారాలను చేర్చుకోవడం వల్ల వెచ్చదనాన్ని కలిగిసాయి. సమర్థవంతమైన జీవక్రియలన్ని సీజన్లలో మరియు ముఖ్యంగా శీతాకాలంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది . ఇవి రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది. దాంతో వ్యాధులను దూరంగా ఉంచుతుంది. శీతాకాలంలో వెచ్చగా ఉండడానికి సహాయపడే కొన్ని ఆహారపదార్థాలు ఇక్కడ ఉన్నాయి.

ఓట్ మీల్:
ఓట్ మీల్లో బీటా గులిటెన్ అధికంగా ఉంది. ఇది తక్షణ ఎనర్జీని అందిస్తుంది. ఇందులో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఇందులో ఎక్కవగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. చలికాలంలో లేజిగా కనబడుతారు. ఒక బౌల్ ఓట్ మీల్ తీసుకోవడం వల్ల వింటర్లో పొట్ట నిండుగా వార్మ్ గా ఉంటుంది.

అల్లం:
శీతాకాలంలో తీసుకొనే ఆహారాల్లో అల్లం కూడా సాధారణ ఆహారవస్తువు. దీన్ని పిల్లలు పెద్దలు ఉపయోగించివచ్చు. అల్లంలో ఉండే వైద్యపరైన గుణగణాల వల్ల శీతాకలంలో ఎదురయ్యే సాధారణ జలువు మరియు ఫ్లూ వంటి జబ్బులను ఎదుర్కొంటుంది. వింటర్ సీజన్ లో ఒక కప్పు జింజర్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి సహాయపడుతుది మరియు ఎసిడిటిని నివారిస్తుంది. జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం ఒక ఉత్తమ రెమడీ. వింటర్ సీజన్ లో మీరు తయారుచేసే వంటకాల్లో కొద్దిగా అల్లం చేర్చడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

3. కోల్డ్ కాఫీ:
పచ్చి కోకా బీన్ మరియు కోకా ఫ్లేవర్ కాదు. ఇది మీ వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కోకా బీన్ లోఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధకతను ఉద్దీపనచేస్తుంది. కోకోగింజలతో తయారు చేసిన పొడిని, ఒక కప్పులో పాలలో మిక్స్ చేసి తాగడం వల్ల అద్భుతమైన టేస్ట్ మాత్రమే కాదు వింటర్ డైయట్ తో శరీరంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఇంకా కోకోలో ఉన్న ఫ్లెవనాయిడ్ వల్ల హర్ట్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి భోజనంతో లేదా భోజనం తర్వాత కోకోను కొద్దిగా తాగడం ఆరోగ్యానికి మంచిది.

4. రెడ్ చిల్లీ:
వింటర్ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికి మన శరీరాన్ని వెచ్చగాఉంచుకోవడం చాలా అవసరం. బాడీ టెంపరేచర్ క్రమంగా ఉన్నప్పుడు ఎలాంటి జబ్బులు రావు. ముఖ్యంగా పచ్చిమిర్చిలో ఉండే క్యాప్ససిన్ అనే కాంపౌడ్ శరీరానికి అవసరం అయ్యే వెచ్చదానాన్ని అందిస్తుంది. చలికాలంలో చర్మం పగుళ్లు, బర్నింగ్ సెన్సేషన్ నుండి ఉపశమనం కలిగించడానికి చిల్లీ గ్రేట్ గా సహాయపడుతుంది.

5. హాట్ చాక్లెట్:
హాట్ చాక్లెట్ చూస్తే చాలు నోట్లో నీళ్ళు ఊరాల్సిందే? ఒక కప్పు హాట్ చాక్లెట్ ను వింటర్ నైట్ తీసుకోవడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. హాట్ చాక్లెట్ లో మార్ష్ మాల్లోస్ లేదా బాదం మిల్క్ వేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం మీద అవగాహన ఉన్న వారు మిల్క్ చాక్లెట్ కు బదులుగా డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు.

6. లీన్ మీట్:
శీతాకాలంలో పాదాలు మరియు చేతులు చల్లగా ఉంటుంది? మన శరీరంలో ఐరన్ లోపం లేకుండా చేస్తుంది. లీన్ మీట్ శరీరానికి కావల్సిన ఐరన్ పుష్కలంగా అందిస్తుంది.

7. బ్లాక్ బీన్ సూప్:
ఈ వింటర్ లో సూప్స్ అంటే ఇష్టపడని వారుండరేమో. సూప్స్ రుచిగా మాత్రమే కాదు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. శీతాకాలంలో శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది.చలి ఎక్కువగా ఉండే ఈ సీజన్ లో ఒక బౌల్ చికెన్ సూప్ చాలా టెప్టింగ్ గా ఉంటుంది. బ్లాక్ బీన్ లేదా చికెన్ సూప్ తో చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి . ఇవి బరువు తగ్గించే క్రమంలోనే కాకుండా ఇది కడుపు నింపుతుంది మరియు ఇది మీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు మరియు ఫ్లూతో పోరాడుతుంది.

8. నట్స్ :
తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తో పాటు నట్స్ ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్ లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.కాబట్టి స్నాక్స్ టైమ్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.



Click it and Unblock the Notifications