Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
బీట్ రూట్-తేనె జ్యూస్ తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!
తరచూ అనారోగ్యానికి గురౌతుంటారా..? ఎప్పుడు, అలసటగా అనిపించడం, బలహీనంగా అనిపించడం.. ముఖ్యమైన విషయాలను మర్చిపోవడం వంటివి జరుగుతున్నాయా? ఎప్పుడూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డాక్టర్స్, మెడిసిన్స్ కోసం ఎక్కువగా ఖర్చుచేస్తున్నామని ఫీలవుతున్నారా?
అవును, అంటే ఖచ్చితంగా మీ ఆరోగ్య స్థితి గతుల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఇలా తరచూ జబ్బు పడుతుంటే, శరీరంలో మీకు తెలియకుండా ప్రమాదకర సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని వ్యాధులు చాలా సింపుల్ గా ఉంటూ..త్వరగా నయమవుతాయి. కొన్ని వ్యాధులు మాత్రం నయమవ్వడానికి ఎక్కువ రోజులు తీసుకుంటుంది. అంతే కాదు ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు అవుతుంది.
ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు
అందువల్ల, ఇలా తరచూ జబ్బు పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. వ్యాధులతో పోరాడాలన్నా, ఇమ్యూనిటి పెంచుకోవాలన్నా..హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అలాంటి ఫుడ్స్ లో బీట్ రూట్ జ్యూస్ ఒకటి. బీట్ రూట్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ జ్యూస్ తయారీకి కావల్సినవి, తయారీ మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..
రెడ్ బీట్ రూట్ లోని టాప్ 15 హెల్త్ బెనిపిట్స్
కావల్సిన పదార్థాలు:
బీట్ రూట్ జ్యూస్ : 1cup
తేనె: 1tbsp
తయారుచేయు విధానం: బీట్ రూట్ తొక్క తీసి, శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి సరిపడా నీళ్ళు పోసి జ్యూస్ తయారుచేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి రోజూ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో తెలుసుకుందాం..

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
బీట్ రూట్ మరియు తేనె మిశ్రమంలో నైట్రేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. శరీరం మొత్తం రక్తం సరఫరా అయ్యేలా చేస్తుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది:
హోం మేడ్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి. దాంతో వివిధ రకాల జబ్బులను, ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తాయి.

మతిమరుపును తగ్గిస్తుంది:
బీట్ రూట్ జ్యూస్ లో తేనె మక్స్ చేసి తీసుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో మతిమరపు వంటి డీజనరేటివ్ డిజార్డ్స్ ను తగ్గిస్తుంది

హార్ట్ అటాక్ :
బీట్ రూట్ మరియు హనీ మిశ్రమం హార్ట్ కు రక్తం సరఫరా చేయడంలో ఎక్కువగా సహాయపడుతుంది. రక్తనాళాల్లో ఏ అడ్డంకులు లేకుండా చేసి, సాఫీగా బ్లడ్ ను సప్లై చేయడంతో హార్ట్ అటాక్ మరియు ఇతర కార్డియో వాస్కులర్ వ్యాధులను నివారించుకోవచ్చు.

ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది:
బీట్ రూట్, హనీ కాంబినేషన్ నేచురల్ జ్యూస్ లోని సిలికా ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది . దాంతో బాడీలోని బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి.

హెల్తీ ప్రెగ్నెన్సీ:
బీట్ రూట్ మరియు హనీ కాంబినేషన్ డ్రింక్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది, అలాగే పుట్టబోయే బిడ్డకు కూడా ఇవి చాలా అవసరం. కాబట్టి, ఈ డ్రింక్ తాగడం వల్ల గర్భిణీ ఆరోగ్యంగా గర్భధారణ సమయాన్ని ముగిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:
ఈ నేచురల్ డ్రింక్ లో క్యాలరీలు తక్కువ మరియు యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ ఎక్కువ . కాబట్టి, ఈ రెండూ బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications