Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
పాలలో మిరియాలు, జీలకర్ర పొడిని మిక్స్ చేసి తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు..!!
పెప్పర్, జీర పౌడర్ ను మిల్క్ తో కలిపి తీసుకుంటే పొందే లాభాలు
ఈ మోడ్రన్ యుగంలో చాలా మందికి హెల్త్ కాన్షియస్ నెస్ బాగా పెరిగింది. వ్యాధులకు భయపడి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయమాలు చేయడం, ఆహారం పట్ల తగిన మెలుకువలు పాటించడం, డైట్ ఫాలో అవ్వడం వంటివి ఎన్నో ఫాలో అవుతున్నారు. దీర్ఘకాలంలో కూడా వ్యాధులకు దూరంగా ఉండాలన్న ఆలోచనలతో దినచర్యలో నేచురల్ రెమెడీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.!
భూమి మీద ఉన్న ప్రాణులన్ని ఏదో ఒక సందర్భంలో అనారోగ్యానికి గురికాకతప్పదు. అదే విధంగా మనుష్యలు కూడా, ఇమ్యూనిటి లోపిస్తే ఖచ్చితంగా వ్యాధుల భారీన పడతారు. ఎన్నిముందు జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని డిజార్డర్స్ ఎదుర్కోక తప్పదు. వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం మనకు తెలియకుండానే వ్యాధులకు గురిచేయడం సహజం.

కొంత మంది హెల్త్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, క్యాన్సర్, డయాబెటిస్, హెచ్ ఐవి వంటి ప్రాణాంతక వ్యాధలుకు గురి అవుతుంటారు.
కాబట్టి, ఇలా వ్యాధులను బారీన పడకుండా ఉండాలంటే, మన శరీరంలో ఇమ్యూనిటి పవర్ స్ట్రాంగ్ గా ఉండాలి. వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములతో పోరాడేందుకు కావల్సినంత ఇమ్యూనిటిని పెంచుకోవాలి. అందుకు నేచురల్ పద్దతుల్లో ఆరోగ్యాన్ని మరియు ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుకోవాలి. వ్యాధులు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ , డాక్టర్స్ చుట్టూ తిరగడం కంటే నేచురల్ పద్దతిలో ఇమ్యూనిటి పవర్ పెంచుకోవడం మంచిది .

ఇమ్యూనిటి పెంచుకోవడానికి కొన్ని నేచురల్ హెల్త్ డ్రింక్స్ ను మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. నేచురల్ డ్రింక్స్ తయారుచేసుకోవడానికి అవసరమయ్యే పదార్థాలు మన వంటగదిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి.
వ్యాధులతో పోరాడటానికి అవసరయ్యే ఇమ్యూనిటి పవపర్ పెంచడానికి అటువంటి హెల్త్ డ్రింక్ ఒకదాన్ని, మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే డ్రింక్ ను మీకు పరిచయం చేస్తున్నాము...

ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ ను పాలు, మిరియాలు, జీలకర్రతో తయారుచేసుకోవచ్చు. ఎలా తయారుచేయాలి. ఇది ఇమ్యూనిటి పవర్ ను ఏవిధంగా పెంచుతుంది. దీని వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం....
కావల్సిన పదార్థాలు :
పాలు - I Cup
జీలకర్ర - 1 Teaspoon
మిరియాలు - ½ a Teaspoon
ఈ మూడింటి కాంబినేషన్లో తయారుచేసే నేచురల్ హెల్త్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యంతోపాటు, ఇమ్యూనిటి పవర్ ను పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిరూపించబడినది. ఈ హెల్త్ డ్రింక్ తో పాటు, హెల్తీ డైట్ మరియు వ్యాయామంను రొటీన్ గా ఫాలో అవ్వాలి.
ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్ లో వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణాలకు తగిన పోషణను అందిస్తుంది. బాడీలోని కణాలు ఎలాంటి వ్యాధులతోనైనా పోరాడే శక్తిని అందిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

పాలు, జీలకర్ర, మిరియాల కాంబినేషన్ డ్రింక్ దగ్గు, వైరల్ ఫ్లూ, అజీర్తి మొదలగు సాధారణ జబ్బులను నివారిస్తుంది. ఈ ఒకే ఒక్క నేచురల్ డ్రింక్ తో అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవడంతో పాటు ఇమ్యూనిటి పవర్ ను కూడా గ్రేట్ గా పెంచుకోవచ్చు .
ఎలా తయారుచేయాలి? తీసుకునే పద్దతి:
1. ఒక కప్పు పాలను బాయిల్ చేయాలి.
2. ఇప్పుడు, ఒక టీస్పూన్ పెప్పర్, ఒక టీస్పూన్ జీలర్రను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
3. తర్వాత వేడి పాలను ఒక గ్లాసులోకి తీసుకుని, అందులో పెప్పర్ , జీర పౌడర్ ను మిక్స్ చేయాలి.
4. స్పూన్ తో బాగా మిక్స్ చేసిన తర్వాత తాగాలి.
5. ముఖ్యంగా ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications