వేసవైనా..వింటరైనా...పరిమితికి మించి తీసుకుంటే సమస్యలే....

నిమ్మరసం అంటే మనందరికీ ఇష్టమే. పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే నిమ్మరసాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. వేసవిలో అయితే దీనిక మరీ డిమాండ్ ఎక్కువ. అలాగే లెమన్ మరియు హనీ కాంబినేషన్ వాటర్ తో బరువు తగ్గించుకొనే వారు కూడా ఎక్కువే...

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

సాధారణంగా చాలా వరకూ డాక్టర్లు మరియు ఆహార నిపుణులు, స్పెషలిస్టులు ‘విటమిన్ సి' అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోమని సలహాలిస్తుంటారు. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారాలను మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరాలకు అత్యంత అవసరమైన ఒక పోషకాహారం ఈ ‘విటమిన్ సి' మన శరీరం విటమిన్ సి 8 అనుబంధ విటమిన్స్ గా మార్పు చెంది మన శరీర ఆరోగ్యానికి సహాయపడుతుందని అంటారు.

నిమ్మ జ్యూస్ తాగితే అనేక వ్యాధులకు గుడ్ బై చెప్పొచ్చు..!

విటమిన్ సిలో ఆస్కోర్బిక్ యాసిడ్ కలిగి ఉంటుందని, ఇది ఫుడ్ యాడిటివ్ గా తీసుకోవడం వల్ల యాక్సిడేషన్ ను నివారిస్తుందని చెబుతారు. ఈ విటమిన్ సి తాజాగా ఉండే ఆరెంజ్, మరియు నిమ్మ వంటి వాటిలో అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి విటమిన్ సి బరువు తగ్గించడానికి, జీవక్రియలు మెరుగ్గా పనిచేయడానికి మరియు బరువు తగ్గడానికి, దంత ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. వివిధ రకాల కారణాల చేత విటమిన్ సి మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసంలో కూడా కొన్ని దుష్ప్రభావాలు దాగి ఉన్నాయి. అవేంటంటే...

హార్ట్ బర్న్:

హార్ట్ బర్న్:

విటమిన్ సి అధికగా ఉన్న నిమ్మరం త్రాగడం వల్ల హార్ట్ బర్నింగ్ గా అనిపిస్తుంది. అలాగే అసిడిక్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ హార్ట్ బర్న్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఇదివరికే ఉన్నట్లైతే పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది కాబట్టి, నిమ్మరసంను మితంగా తీసుకోవాలి.

స్టొమక్ అల్సర్:

స్టొమక్ అల్సర్:

ఎక్కువగా నిమ్మరసం త్రాగడం వల్ల స్టొమక్ అప్ సెట్ అవుతుంది. నిమ్మరసంలో అసిడిక్ లెవల్స్ అధికంగా ఉండటం వల్ల మ్యూకస్ మెంబరేన్ కు చిరాకు కలిగిస్తుంది. దాంతో పొట్టనొప్పి మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ కలిగిస్తుంది లేదా హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది . స్టొమక్ లైనింగ్ కు చీకాకు కలిగించడం వల్ల స్టొమక్ అల్సర్ నయం కాకుండా పొట్టలో బ్లీడింగ్ మొదలవుతుంది. ఫలితంగా ఇంటెన్సిల్స్ నొప్పి పుడుతుంది.ఇతర పొట్ట సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, స్టొమక్ అల్సర్ తో బాధపడే వారు నిమ్మరసం త్రాగడం మానేయాలి. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల ఇది ఒక సైడ్ ఎఫెక్ట్.

అజీర్తి మరియు పొట్టనొప్పి:

అజీర్తి మరియు పొట్టనొప్పి:

నిమ్మరసం కొన్ని సందర్భాల్లో తీసుకొన్న ఆహారంను జీర్ణం కాకుండా చేస్తుంది. అందువల్ల, నిమ్మరసం అధికంగా తీసుకొన్నప్పుడు నిమ్మరసంలో ఉండే అసిడిటి వల్ల వికారానికి, పొట్టనొప్పి, వామిటింగ్, యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు పొట్టగా నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి, ఈ పానియాన్ని నివారించడం వల్ల కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది. నిమ్మరసంను భోజనానికి తర్వాత తీసుకోవాలి. అది కూడా ఎక్కువ నీళ్ళు కలిపి తీసుకోవడం మంచిది.

ఫ్రీక్వెంట్ యూరినేషన్ మరియు డీహైడ్రేషన్:

ఫ్రీక్వెంట్ యూరినేషన్ మరియు డీహైడ్రేషన్:

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ న్యూట్రీషియన్ ఫుడ్ లో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కిడ్నీలో యూరిన్ ప్రొడక్షన్ పెంచుతుంది). అందువల్ల శరీరంలోని అదనపు ఫ్లూయిడ్స్ మరియు సోడియం తగ్గిపోవడానికి కారణం అవుతుంది . లెమన్ జ్యూస్ త్రాగిన తర్వాత కూడా డీహైడ్రేషన్ ఫీలైతే, వెంటనే లెమన్ జ్యూస్ త్రాగడం మానేయాలి.

కిడ్నీ లేదా గాల్ బ్లాడర్ సమస్యలు:

కిడ్నీ లేదా గాల్ బ్లాడర్ సమస్యలు:

నిమ్మరసంలోని ఆక్సలేట్స్ బాడీలో అధికంగా ఫ్లూయిడ్స్ ఉత్పత్తి అవ్వడానికి కారణం అవుతాయి. అంతే కాదు ఇవి, ఘనంగా మారడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుంది. ఆ కారణం వల్ల చికిత్సనందివ్వలేని కిడ్నీ, లేదా గాల్ బ్లాడర్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి, లెమన్ జ్యూస్ ను నివారించడం మంచిది. నిమ్మతొక్కలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీమరియు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడుటకు కారణం అవుతాయి. ఎవరికైతే ఇప్పటికే కిడ్నీ మరియు గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడుతుంటారు వారు నిమ్మరసం తీసుకోవడం మంచిది.

మందులతో పాటు నిమ్మరసం?:

మందులతో పాటు నిమ్మరసం?:

మెడికల్ కండీషన్స్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు, మరియు నిమ్మరసం తీసుకోకూడదు. ఒకేసారి ఎక్కువ మోతాదులో నిమ్మరసం తీసుకోకూడదు . నిమ్మరసం తీసుకొన్న తర్వాత ఏవిధమైన లక్షణాలు కనబడినా వెంటనే లెమన్ జ్యూస్ తీసుకోవడం మానేయాలి.

 నిమ్మరసం బివాక్స్ కోటెడ్ కూడా:

నిమ్మరసం బివాక్స్ కోటెడ్ కూడా:

గుర్తుంచుకోవల్సింది! కమర్షియల్ లెమన్స్ కోటెడ్ గా వాక్స్ నిమ్మకాలను అమ్ముతుంటారు. వీటిని మనం తెలియకుండా తీసుకోవడం వల్ల ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

డయేరియా:

డయేరియా:

చాలా కేసుల్లో విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందిలో ఎదురయ్యే ఒక మేజర్ సమస్య డయేరియా. అధికమోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.

 దంతాలు సలుపడం:

దంతాలు సలుపడం:

విటమినస్ సి అధికంగా ఉండే నిమ్మరసం దంతాలకు తగిలిన వెంటనే అందులో ఉండే అసిడిక్ కంటెంట్ వల్ల దంతాల మీద ఎండే ఎనిమిల్ ను తగ్గించేస్తుంది మరియు దంతాలను మరింత సెన్షిటివ్ గా మార్చేస్తుంది. కాబట్టి, లెమన్ జ్యూస్ ను నేరుగా అలాగే తీసుకోకుండా లెమన్ జ్యూస్ కు మరేదైనా మిక్స్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేసి తీసుకోవాలి.

Desktop Bottom Promotion