Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీరు అనుకున్న దాని కంటే రెట్టింపు ప్రయోజనాలున్న7 హెల్తీ కామన్ ఫుడ్స్..!!
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే వ్యక్తులైనా..కాకపోయినా... కొన్ని కామన్ ఫుడ్స్ హెల్తీ మరియు అన్ హెల్తీ ఫుడ్స్ గురించి కొన్ని ఐడియాస్ కలిగి ఉండటం మంచిది.
మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే వ్యక్తులైనా..కాకపోయినా... కొన్ని కామన్ ఫుడ్స్ లో హెల్తీ మరియు అన్ హెల్తీ ఫుడ్స్ గురించి కొన్ని ఐడియాస్ కలిగి ఉండటం మంచిది. రెగ్యులర్ గా తీసుకునే ఆహారాలే అయినా, వీటి గురించి ఎలాంటి అగహాన ఉండదు. కొన్ని ఆహారాలు మీరు అనుకున్న దానికన్నా మరింత ఆరోగ్యకరమైని అన్న విషయం మీకు తెలుసా?

ఎప్పుడూ హెల్తీగా , ఫిట్ గా ఉండాలని కోరుకుంటారో అలాంటి వారు ఫుడ్స్ గురించి మరింత లోతుగా తెలుసుకోవడమే. అలాంటి ఆహారాలను రెగ్యులర్ గా డైలీ బేసిస్ తీసుకోవాలి. డైట్ గురించి ఎక్కువగా తెలుసుకోవడం వల్ల, హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయడం వల్ల జీవితంలో మరిన్ని ఎక్కువ రోజులు, మరింత ఆరోగ్యంగా జీవించగలుగుతారు.
మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాలే అయినా, వాటిలో న్యూట్రీషినల్ విలువలు ఎంత వరకూ ఉంటాయి. ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడుతాయన్న విషయం తెలుసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్స్ ను మరింత ఎక్కువగా డైట్ లో చేర్చుకుంటారు. అనారోగ్యకరమైన వాటికి దూరంగా ఉంటారు .
ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతాయో అన్న టెన్షన్ లేకుండా రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవల్సిన ఆహారాలు కొన్నిఉన్నాయి. ఇవి మీరు అనుకున్న దాని కంటే రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. మరి ఆ హెల్తీ డైట్ ఫుడ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

కాలీఫ్లవర్ :
కాలీఫ్లవర్ చాలా సింపుల్ వెజిటేబుల్ ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫొల్లెట్, మరియు ఫైబర్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి. బరువు తగ్గించడంలో గొప్పగా సహాయపడడుతాయి. మలబద్దకాన్ని అరికడుతాయి.

మష్రుమ్స్ :
ఆరోగ్యానికి మరో గ్రేట్ రెమెడీ మష్రుమ్ . ఇది డిప్రెషన్ తగ్గిస్తుంది. ఓస్టిరియోఫోసిస్ ను దూరం చేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ డి లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడుతాయి.

ఓట్స్ :
ఓట్స్ లో సోలుబల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. శరీరంలో చేరిన టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేసి, ఆరోగ్యంగా ఉంచే హెల్తీ ఫుడ్ ఇది.

పాలు :
మజిల్ బిల్డింగ్ కు గ్రేట్ ఫుడ్. పాలు తాగిన వెంటనే ఎనర్జింటిక్ గా మారుతారు. స్ట్రెస్, డిప్రెషన్ తగ్గిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్స్ బ్రెయిన్ లో సెరోటినిన్ లెవల్స్ ను పెంచుతుంది.

క్వీనా :
క్వీనా ఒక సూపర్ ఫుడ్ గా సూచిస్తుంటారు. వీటిలో అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ తో పాటు, విటమిన్ ఇ, క్యాల్షియం, పొటాసియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి, మరిన్ని న్యూట్రీషియన్ విలువలుండటం వల్ల ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

పెరుగు :
పెరుగులో గ్రేట్ ప్రోబయోటిక్ లక్షణాలున్నాయి. నేచురల్ ప్రోబయోటిక్స్ కలిగిన ఫుడ్ ఇది. ఇది పేగుల్లో కొన్ని అద్భుతాలను చేస్తుంది. పొట్టలైనింగ్ ను ఆరోగ్యంగా ఉంచతుంది. పొట్టలో హెల్తీ బ్యాక్టీరియాకు సహాయపడుతుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు బహు విధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లీసిన్ అనే యాక్టివ్ కాంపోనెంట్ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ను నయం చేస్తుంది. ఇంటర్ కోర్స్ సమయంలో ఆరోసెల్ అనే హార్మోన్ ను పెంచుతుంది.



Click it and Unblock the Notifications