Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దోసకాయ నీటిని ఉదయాన్నేతీసుకోవటం వల్ల కలిగే 10 ప్రయోజనాలు
ఒక గ్లాసుడు చల్లటి దోసకాయ నీటిని తీసుకోవటం వలన కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు. దోసకాయ నీటివలన శరీరంలోని డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సజావుగా జరుగుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే, బరు
ఒక గ్లాసుడు చల్లటి దోసకాయ నీటిని తీసుకోవటం వలన కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు. దోసకాయ నీటివలన శరీరంలోని డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సజావుగా జరుగుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పోతాయి. అలాగే, బరువు తగ్గేందుకు ఈ నీరు ఉపయోగపడుతుంది.
ప్రతి రోజూ దోసకాయ నీటిని తీసుకోవడం ద్వారా మీరు శరీరానికి అవసరమైన విటమిన్లను అలాగే మినరల్స్ ను అందించినవారవుతారు.
తీపికలిగిన పానీయాలకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్నామ్నాయం. అలాగే, దోసకాయ నీటిని తీసుకోవడం ద్వారా మీరు హైడ్రేటెడ్ గా ఉంటారు. దోసకాయలో విటమిన్లు, మినరల్స్, డైటరీ ఫైబర్ అలాగే ఫైటో న్యూట్రియెంట్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ శారీరకంగా అలాగే మానసికంగా మనల్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకు తోడ్పడతాయి.
దోసకాయ ఏ విధంగా వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుందోనని మీరు ఆశ్చర్యపోవచ్చు. దోసకాయ నీరు లేదా దోసకాయ డీటాక్స్ నీటీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా లభిస్తుంది. వెయిట్ లాస్ డైట్ లో ఇది ముఖ్య చేర్పు. ఇది మీకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది అలాగే తరచూ వచ్చే హాంగర్ ప్యాంగ్స్ ను తగ్గిస్తుంది.
విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దోసకాయలో పుష్కలంగా లభిస్తాయి. దోసకాయ నీటిని పొద్దున్నే తీసుకోవడం ద్వారా లభించే 10 ప్రయోజనాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

1. యాంటీ ఆక్సిడెంట్స్ ని అందిస్తుంది
ఫ్రీ రాడికల్స్ వలన కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి సెల్ డేమేజ్ ను అరికట్టేందుకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. దోసకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్, మాంగనీస్ తో పాటు మరిన్ని ఇతర ఫ్లెవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి.

2. క్యాన్సర్ ను అరికడుతుంది
యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు దోసకాయలో కుకుర్బిటాసిన్స్ అనే కాంపౌండ్స్ మరియు లిగ్నాన్స్ అనే న్యూట్రియెంట్స్ సమూహం కలిగి ఉన్నాయి. ఇవన్నీ క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దోసకాయలో లభించే ఫీసెటైన్ అనే డైటరీ ఫ్లెవనాయిడ్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని నెమ్మదించేందుకు తోడ్పడుతుంది.

3. బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది
ఆహారంలో ఉప్పుని ఎక్కువగా తీసుకోవటంతో పాటు పొటాషియంను తక్కువగా తీసుకోవటం వలన అధిక రక్తపోటు సమస్య వేధిస్తుంది. శరీరంలోని అదనపు ఉప్పు అనేది ద్రవాలను కలిగి ఉంటుంది. తద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దోసకాయలోని పొటాషియం అనేది ఎలెక్ట్రోలైట్ గా పనిచేసి కిడ్నీలలో స్థాయిలను నియంత్రిస్తుంది.

4. చర్మసంరక్షణకు తోడ్పడుతుంది
చర్మాన్ని లోపలి నుంచి వెలుపలి వరకు సంరక్షించేందుకు దోసకాయ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా, శరీరానికి తగిన మోతాదులో నీటిని అందచేస్తూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఆ విధంగా, శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. దోసకాయ నీటిలో లభించే విటమిన్ బి5 అనేది చర్మకాంతిని పెంపొందిస్తుంది.

5. ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది
విటమిన్ కే అనేది దోసకాయలో సమృద్ధిగా లభిస్తుంది. రోజువారీ ప్రమాణములో శరీరానికి అవసరమయ్యే విటమిన్ కే ని 9 శాతం వరకు దోసకాయ నుంచి గ్రహించుకోవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి అవసరమయ్యే ప్రొటీన్ల ఏర్పాటుకు విటమిన్ కే అనేది అత్యంత అవసరం. అలాగే, రక్తం సరైన విధంగా గడ్డకట్టేందుకు కూడా కే విటమిన్ అనేది అవసరం. దోసకాయ నీటిని తాగడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

6. అధిక బరువును తగ్గించుకోవచ్చు
మీరు తాగే తీపి పానీయాలను, స్పోర్ట్స్ డ్రింక్స్ ని అలాగే డైట్ సోడాలను దోసకాయ నీటితో భర్తీ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు తీసుకునే కేలరీల సంఖ్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే, మీ మెటబాలిజం మెరుగుపడటంతో పాటు మీ అప్పెటైట్ అనేది నియంత్రించబడుతుంది. ఆహారం తీసుకోవడం వలన లభించే సంతృప్తి అధికమవుతుంది.

7. కండరాలను హైడ్రేట్ చేసేందుకు తోడ్పడుతుంది
వయసు మీదపడే కొద్దీ కండరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. దోసకాయలో లభించే సిలికా కంటెంట్ అనేది చర్మ సంరక్షణకు ఉపయోగపడటంతో పాటు కండరాల టిష్యూల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దోసకాయ నీటిని రోజూ తీసుకోవటం ద్వారా కండరాలకు కోలుకునే శక్తి లభిస్తుంది. అలాగే, వ్యాయామం తరువాత శరీరానికి తగిన హైడ్రేషన్ లభిస్తుంది.

8. బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది
దోసకాయలో లభించే ఫీసెటైన్ అనే యాంటీ ఇంఫ్లేమేటరీ ఫ్లెవనాయిల్ అనేది బ్రెయిన్ ఫంక్షన్ ను అలాగే మెమరీను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. తద్వారా, బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా అలాగే యవ్వనంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది అల్జీమర్ వ్యాధిగ్రస్తులలో కాగ్నిటివ్ ఫంక్షన్స్ ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది.

9. నోటి దుర్వాసనని నివారిస్తుంది
దోసకాయ వలన శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా, నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. పొట్టలో వేడి ఎక్కువగా పేరుకుపోవడం వలన నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది. దోసకాయ నీటిని తీసుకోవడం వలన లాలాజలం పెరిగి దుర్వాసనని కలిగించే బాక్టీరియా అనేది నశింపబడుతుంది.

10. జీర్ణక్రియను పెంపొందిస్తుంది
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వలన అజీర్ణంతో పాటు గ్యాస్ట్రయిటిస్ వంటి సమస్యలు దరిచేరవు. దోసకాయ నీటిని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులో లభించే ఫైబర్ కంటెంట్ ఇందుకు ప్రధాన కారణంగా వ్యవహరిస్తోంది. దోసకాయ పొట్టులో కరగబడని ఫైబర్ లభిస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణకోశం వరకు తీసుకువెళ్లేందుకు తోడ్పడుతుంది.



Click it and Unblock the Notifications