Latest Updates
-
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం!
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరుగుతుండటం మనకు తెలిసిన విషయమే. డెంగ్యూ జ్వరం వచ్చిందనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్లేట్ లెట్ల కౌంట్ పడిపోవడం. ఈ టైంలో చాలామంది బాడీలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెంచుకునేందుకు కివీ పండ్లతో పాటు అనేక రకాల ఆహారాలను తీసుకుంటారు.
అయితే ఇదే సమయంలో చాలామంది ప్లేట్ లెట్ల సంఖ్య పెంచుకోవడం కోసం బొప్పాయి ఆకు రసం కూడా తాగుతుంటారు. అయితే బొప్పాయి ఆకుల రసం నిజంగానే డెంగ్యూకి బ్రహ్మాస్త్రమా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూడండి.

బొప్పాయి ఆకు రసం నిజంగా పనిచేస్తుందా?
డెంగ్యూ రోగులకు బొప్పాయి ఆకు సారాన్ని ఇచ్చినప్పుడు, ట్రీట్మెంట్ మొదలైన నాలుగో రోజు తర్వాత ప్లేట్ లెట్ల సంఖ్యలో పెరుగుదల కనిపించిందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. అలా అని, బొప్పాయి ఆకు రసమే డెంగ్యూకి ఏకైక నివారణ అని గుడ్డిగా నమ్మలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ఆధారాలు అంత బలంగా లేవు. పైగా ప్లేట్ లెట్లు పెరిగినంత మాత్రాన డెంగ్యూ వల్ల వచ్చే ఇతర ప్రమాదాలు పూర్తిగా తొలగిపోతాయన్న గ్యారెంటీ కూడా లేదు.
ఇంటికి, ల్యాబ్ కి ఉన్న తేడా అదే
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. పరిశోధనల్లో, ల్యాబ్ లలో వాడే ప్రామాణిక బొప్పాయి సారానికి, మనం ఇంట్లో సొంతంగా తయారుచేసుకునే రసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆకుల వయసు, వాటి తాజాదనం, రసం తీసే విధానం, వాడే మోతాదును బట్టి ఆ రసం ప్రభావం మారుతుంది. కాబట్టి ఇంట్లో తీసిన రసం వంద శాతం, అందరికీ ఒకేలా పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
డెంగ్యూలో శరీరానికి అసలు ఏం కావాలి?
డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్ లెట్ల కన్నా ముందు శరీరం కోరుకునేది నీరు, కేలరీలు, ప్రొటీన్లు. జ్వరంలో ఆకలి మందగిస్తుంది కాబట్టి కిచిడీ, పప్పు, పెరుగు, సూప్స్, బాగా ఉడికించిన కూరగాయలు, పండ్లు వంటి తేలికపాటి ఆహారం కొద్దికొద్దిగా తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ఓఆర్ఎస్ (ORS), కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతూ శరీరాన్ని ఎప్పుడూ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి.
ప్రమాద సంకేతాలను గుర్తించండి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. కేవలం ప్లేట్ లెట్ల సంఖ్యను చూసుకుని రోగి పరిస్థితిని అంచనా వేయడం మూర్ఖత్వం అవుతుంది. డెంగ్యూలో రోగిని నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. తీవ్రమైన కడుపునొప్పి, ఆగని వాంతులు, ఎక్కడైనా రక్తస్రావం అవ్వడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, లేదా చర్మం పాలిపోయి చల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే.. అవి అత్యంత ప్రమాదకరమైన సంకేతాలని గుర్తించాలి. ఇవి కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్లను కలవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
