Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పారిస్ ఒలింపిక్స్: అథ్లెట్స్ ఏం ఫుడ్ తింటారు? ఫుడ్ మెనూ ఏముంది? అసలు ఏముంటాయి?
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మను భాకర్ ఏకంగా రెండు మెడల్స్ సాధించి భారత్‌ను సంతోషంలో ముంచేసింది. 136 ఏళ్ల చరిత్ర ఉన్న ఒలింపిక్స్ ఈవెంట్లో ప్లేయర్లకు సర్వ్ చేసే ఫుడ్ చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు జరిగే పోటీల్లో రోజూ 40 వేల ప్లేట్ల ఫుడ్ తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 దేశాల నుంచి 15 వేల మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటున్నారని అంచనా. వీరి కోసం 3500 సీట్ల కెపాసిటీతో ఒలింపిక్ విలేజ్‌లో క్యాంటీన్ అందుబాటులో ఉంది. ఫ్రెంచ్, ఆసియన్, ఆఫ్రియకన్ కరీబియన్, ప్రపంచ దేశాల ప్రధాన క్యూజిన్ వంటకాలన్ని మెనూలో ఉంచారట. 1896 నుంచి ప్రతిసారి ఫుడ్ మెనూలో మార్పులు వస్తూ, క్రేజీగా తయారువుతున్నాయట. మరి ఒలింపిక్స్‌లో ఫుడ్ మెనుకూ ఉన్న చరిత్ర ఏంటో తెలుసా?
ప్రోటీన్లే ముఖ్యం అంటూ మెనూ సర్వ్ చేసిన 1896 ఒలింపిక్స్
అవును. అప్పట్లో అథ్లెట్ల ఫుడ్ కి పెర్ఫార్మెన్స్‌కు రిలేషన్ ఏంటో అంతగా ఎవరూ గమనించలేదు. అందుకే అథ్లెట్లకు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ సర్వ్ చేయాలన్నారట. అలా తొలిసారి 1896లో జరిగిన ఒలింపిక్స్‌లో గుడ్లు, బ్రెడ్, చీజ్, ఆలివ్స్, మాంసం, రెడ్ వైన్ ఇదే బాగా సర్వ్ చేశారు. ఆ తరువాత నుంచి న్యూట్రిషన్ ఫుడ్ పైన అవగాహన వచ్చే కొద్దీ కొంచెం కొంచెంగా మార్పులు వచ్చాయి.

ఆయా రీజియన్‌లకు తగ్గట్లు
మరి, దేశం కానీ దేశానికి వెళ్లినప్పుడు అథ్లెట్లు ఆ వాతావరణానికి అలవాటు పడి, మెడల్ తెచ్చే బాధ్యతను తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఆ పోటీల కోసం రోజూ12-16 గంటలపాటు శ్రమించే ప్లేయర్లు అక్కడికి వెళ్లాక కూడా అదే డైట్ మెయింటెన్ చేయడం అన్నింటికన్నా ముఖ్యం. వారు తీసుకునే సరిగ్గా లేకుండా అంతా రివర్స్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే, ఒలింపిక్స్ కమిటీ, ఆయా దేశాలు ప్లేయర్ల డైట్ మీద చాలా కేరింగ్ తీసుకుంటూ వచ్చాయి. ఒక్క ప్రొటీన్ మాత్రమే కాదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేవి. రిఫైన్ చేసిన కార్బ్స్ సమృద్ధిగా ఉండే పళ్లు, సలాడ్‌లూ..ఇలా మెనూ మారుతూ వచ్చింది.
కొరియన్ కిమిచి, జపాన్ రైస్ బాల్..ఫిష్..ఈ స్టోరీ తెలుసా?
1980ల్లోకి వచ్చేటప్పటికీ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు. ఆ ఈవెంట్‌ను తమదైన వంటకాలను ప్రమోట్ చేసేందుకు కూడా ప్రయత్నించాయి. 1988లో సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ తర్వాత కొరయన్ డిష్ కిమిచి బాగా ఫేమస్ అయింది. అంతకుముందు 1964లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ జపనీస్ ఫిష్, రైస్‌బాల్స్‌కు బాగా క్రేజ్ తెచ్చాయట.
కస్టమైజ్డ్ డైట్..
అంతా మారే కొద్దీ, ఒక్కో స్పోర్ట్‌కు తగ్గట్టుగా కస్టమైజ్డ్ డైట్ డిజైన్ చేయడం మొదలైంది. నిజానికి 1932 నుంచి 1970ల మధ్య ప్రొటీనే ఎక్కువ ఉండే ఫుడ్ మెనూకే అంతా ప్రాధాన్యత ఇచ్చారు. 1970ల వరకు కార్బోహైడ్రేట్‌లు అథ్లెట్లకు ఎంత ముఖ్యమో గుర్తించలేదు. ఆ తరువాతనే న్యూట్రిషన్ ఫుడ్ గురించి అవగాహన పెరుగుతూ వచ్చిందని చెప్పాలి. ఆపై కస్టమైజ్డ్ డైట్‌లు వచ్చేశాయి. ఉదాహరణకు స్విమ్మింగ్, రన్నింగ్, మారథాన్ వంటి ఆటల్లో పాల్గొనే వారికి, రెజ్లింగ్, బాక్సింగ్ వంటి ఆటల్లో ఉండేవారికి సేమ్ డైట్ వర్కవుట్ అవదు. పైగా ఆయా ప్లేయర్‌ను బట్టి కూడా మారిపోతుంటుంది. ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్లూయిడ్స్.. ప్రతి ప్లేయర్ ఫుడ్ మెనూలో ఉంటాయి. కానీ మోతాదులో మార్పులుంటాయి.
పారిస్ ఒలింపిక్స్‌లో అందుకు తగ్గట్లుగానే క్యాంటిన్‌లో ఏర్పాట్లున్నాయి. నాన్ వెజ్‌కు ధీటుగా వెజ్ మెనూ కూడా ఉందని ఒలింపిక్స్ నిర్వహకులు చెప్పారు. అయితే, ఫ్రెంచ్ వంటకాలను కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు.
ఇండియా హౌస్
ఈ పారిస్ ఒలింపిక్స్‌లో రిలయన్స్ గ్రూప్ తరఫున ఇండియా హౌస్ ప్రారంభించారు. దేశానికి దూరంగా ఉన్న భారత అథ్లెట్లు మన ఫుడ్‌ని మిస్సవ్వకుండా ఈ ఏర్పాటు. కానీ, అథ్లెట్లు మాత్రం పరిమితికి మించి తినరు. తిన్న ఆహారం మాత్రం శరీరానికి శక్తినిచ్చేలా ఉండాలి. అదే మెనూలో ఉండేలా చూసుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications