Latest Updates
-
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'!
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.?
నవ మాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఏ తల్లికైనా ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివి. పసిపాప బోసినవ్వులు, ఏడుపులు ఆ కుటుంబంలో ఎనలేని సంతోషాన్ని తీసుకువస్తాయి. కానీ ప్రసవానంతరం తల్లికి మాత్రం శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులతో కఠిన రోజులను తీసుకువస్తుంది. ఈ సమయంలో బాలింత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రసవం తర్వాత తల్లుల జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల మార్పులు, నిద్రలేమి, అలసట, పుట్టిన బిడ్డకు పాలివ్వడం, లాలించడం ఇంకా ఎన్నో మార్పులతో వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ పరిస్థితిని చాలా మంది సాధారణంగా భావిస్తారు. వీటితో పాటు విచారం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, రోజువారీ జీవితంలో మార్పులు ఇవన్నీ ప్రసవానంతర డిప్రెషన్‌కి దారితీస్తాయి. ఈ లక్షణాలు ఎక్కువైతే ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబీకులు కీలక జాగ్రత్తలు తీసుకుని నివారణ మార్గాలను పాటించాల్సి ఉంటుంది.
ప్రసవానంతర డిప్రెషన్ అంటే ఏమిటి?
ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో ఏర్పడే మానసిక ఆరోగ్య సమస్యను ప్రసవానంతర డిప్రషన్‌గా గైనకాలజిస్టులు చెబుతున్నారు. ప్రసవానంతరం తల్లుల్లో కలిగే బేబీ బ్లూస్ త్వరలోనే తగ్గిపోయినా ఈ డిప్రెషన్ అనేది కొన్ని నెలల పాటు కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.

విచారం, నిరాశ
ప్రసవం తర్వాత డిప్రెషన్‌లో తల్లులు నిరంతరం విచారంతో ఉంటారు. అంతేకాకుండా మానసికంగా మార్పులు చోటుచేసుకుని కారణం లేకుండా ఏడుస్తారు. దేనిలోనూ ఆనందంగా ఉండలేరు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజువారీ జీవితంపై ప్రభావం చూపిస్తుంది.
ఆందోళన, ఆత్రుత
ఏ తల్లికైనా నవజాత శిశువు గురించి ఆందోళన సహజమే. కానీ ఎప్పుడూ భయంగా, ఆందోళనగా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
నిద్ర, ఆకలి ప్రభావం
కొందరు మహిళలు ప్రసవం తర్వాత ఎక్కువగా నిద్ర మత్తులో ఉంటారు. లేదంటే నిద్ర లేమితో బాధపడుతుంటారు. తరచుగా నీరసంగా అనిపిస్తుంటుంది. లేదంటే విపరీతమైన ఆకలితో సతమతమవుతుంటారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే నిపుణుల సలహా తప్పనిసరి.

బిడ్డతో భావోద్వేగ బంధం
కొందరు తల్లులు పేగు తెంచుకుని బిడ్డతో ఒక్కోసారి భావోద్వేగంగా బంధాన్ని ఏర్పరుచుకోలేరు. బిడ్డను చూసుకోవడంలో ఆసక్తి కనబరచలేరు. ఇది కూడా ప్రసవానంతరం డిప్రెషన్‌గా చెబుతున్నారు. మరికొందరు బిడ్డను ఒంటరిగా చూసుకోలేక, కుటుంబీకుల మద్దతు సరిగా లేక తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో జీవితం ముగించేసుకోవాలనే ఆలోచనలతో సతమతమవుతుంటారు.
ఆర్థిక ఇబ్బందులు
ప్రసవం తర్వాత బిడ్డ బాధ్యత సమయంలో ఖర్చులు పెరగడం, ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడం, కవల పిల్లల బాధ్యత ఇలా పలు కారణాల వల్ల డిప్రెషన్‌కి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పసిపాప ఆరోగ్యంతో పాటు తల్లి క్షేమానికి కుటుంబీకులు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇలా కాపాడుకోండి..
ప్రసవం తర్వాత బాలింతకి తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోవాలి. పోషకాహారం సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఆమెను సంతోషపరిచే విషయాలను పంచుకుంటూ ఉండాలి. ఆమె భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమం తప్పకుండా ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. అయితే బాలింతలో డిప్రెషన్ ఎక్కువ కాలం కొనసాగితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
