వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల భయం.. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన హెల్త్‌ కిట్స్‌ ఇవే.!

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ఈ కాలంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు. జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలతో సతమతమవుతుంటారు. అయితే ఈ సమస్యలకి ఎక్కువగా ఆస్పత్రికి వెళ్లడం కంటే ఇంటి చికిత్సకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో చికిత్స కంటే నివారణకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో రోగాల బారి నుంచి బయటపడేందుకు ఇంట్లో తప్పనిసరిగా ఈ హెల్త్‌ కిట్స్‌ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Seasonal diseases during monsoon every household should have these medical kits

సాధారణంగా ఇంట్లో స్వల్ప జ్వరం, వాంతులు, విరేచనాలు, జలుబు దగ్గుకి ఇంట్లోనే చికిత్స చేసుకోవడం సర్వసాధారణం. వాతావరణంలో తేమ పెరుగుదల, నీటి నిల్వ, కలుషితమైన ఆహారం, ఫుడ్‌ పాయిజనింగ్‌, దోమల వ్యాప్తి ఇలా పలు కారణాలతో వ్యాధులకి ఆస్కారం ఎక్కువ. ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పడు సకాలంలో సరైన చికిత్స అవసరం లేదంటే అది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈ క్రమంలో ఆహారం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే అనారోగ్యాలకు చెక్‌ పెట్టొచ్చు. ఇక, దీంతో పాటు ఈ కాలంలో ప్రతి ఇంట్లో ప్రైమరీ హెల్త్‌ కిట్‌ తప్పనిసరి. ఎమర్జెన్సీ సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఓఆర్‌ఎస్‌, థర్మామీటర్‌

వర్షాకాలంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా వాంతులు, విరేచనాలతో పాటు జ్వరం సమస్య ఎదురవుతుంది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కి గురవుతారు. ఈ సందర్భంలో ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తప్పనిసరిగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్‌ థర్మామీటర్‌ ద్వారా శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. దీని ద్వారా వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

Seasonal diseases during monsoon every household should have these medical kits

యాంటీసెప్టిక్, బ్యాండేజీ, హ్యాండ్ శానిటైజర్

వర్షాకాలంలో చర్మం పలు సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్లు, ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. జారిపడటం ఫలితంగా గాయాలు కావడంతో రక్తం కారి ఇన్‌ఫెక్షన్లకి దారితీస్తుంది. ఇందుకోసం ఇంట్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తప్పనిసరి. యాంటిసెప్టిక్‌ స్పిరిట్‌, శుభ్రమైన క్లాత్‌, కట్లు కట్టడానికి బ్యాండేజ్‌, మెడిక్‌ టేప్‌ బ్యాండేజ్‌ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కాలంలో ఇంటా బయటా దోమలు, ఈగలతో పాటు అపరిశుభ్రత కారణంగా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. ఇందుకోసం ఇంట్లో తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌, సబ్బును సిద్ధంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేవారు తమ హ్యాండ్‌ బ్యాగులో హ్యాండ్‌ శానిటైజర్‌ పెట్టుకోవాలి. దీనిద్వారా బ్యాక్టీరియా చేతి నుంచి నోటిలోకి వ్యాపించకుండా కాపాడుకోవచ్చు. అయితే గాయం తీవ్రత ఆధారంగా మాత్రమే ఫస్ట్‌ ఎయిడ్‌ తీసుకోవాలి. లోతైన గాయం, రక్తస్రావం ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Seasonal diseases during monsoon every household should have these medical kits

రోజువారీ మందులు

కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్‌, హైబీపీ, ఆస్తమాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు రోజూ వాడే మందులను హెల్త్‌ కిట్‌లో తగినంత పరిమాణంలో ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుడు సూచించిన ప్రిస్క్రిప్షన్లను తప్పనిసరిగా వద్దే ఉంచుకోవాలి.

హెల్త్‌ కిట్‌కి ఒక గడువు తేదీ తప్పనిసరిగా ఉంటుంది. ఆ తేదీని ఎప్పుటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. గడువు ముగిసిన మందులను ఇంట్లో ఉంచకుండా పడేయాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారి నుంచి సకాలంలో రక్షించుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, July 13, 2026, 16:24 [IST]
Desktop Bottom Promotion