Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
నేచురల్ వయాగ్రా.. పడకగదిలో మీ స్టామినాను రెట్టింపు చేసే 5 అద్భుత పానీయాలు!
ఉరుకులు పరుగుల జీవితం, పని ఒత్తిడి వల్ల సాయంత్రానికి శరీరం పూర్తిగా అలసిపోతుంది. మనసు కోరుకున్నా, కొన్నిసార్లు పడకగదిలో శరీరం సహకరించదు. భాగస్వామితో గడిపే మధుర క్షణాలకు ఈ అలసట అడ్డంకిగా మారుతుందా? అయితే మీ రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పానీయాలను చేర్చుకోవడం ద్వారా కోల్పోయిన శక్తిని, శృంగార సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.
పుచ్చకాయ - నేచురల్ వయాగ్రా
పుచ్చకాయ కేవలం వేసవి తాపాన్నే కాదు, మీలోని శృంగార దాహాన్ని కూడా తీరుస్తుంది. ఇందులోని సిట్రులైన్ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి ధమనులకు విశ్రాంతినిస్తుంది. ఫలితంగా పడకగదిలో మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. ఇందులోని లైకోపీన్ పురుషులలో వీర్య కణాల నాణ్యతను పెంచుతుంది. జ్యూస్ చేసేటప్పుడు తొక్క లోపలి తెల్లటి భాగాన్ని కూడా కలపడం మర్చిపోకండి, అసలైన పోషకాలు అక్కడే ఉంటాయి.

బీట్ రూట్ - స్టామినా బూస్టర్
బీట్ రూట్ లోని నైట్రేట్లు శరీరంలోకి వెళ్లాక నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను విస్తరింపజేస్తాయి. ఇది అంగస్తంభన సమస్యలను నివారించి, పురుషాంగాన్ని దృఢంగా ఉంచుతుంది. శృంగారానికి 2-3 గంటల ముందు క్యారెట్, అల్లం, నిమ్మరసం కలిపిన బీట్ రూట్ జ్యూస్ తాగితే మీ భాగస్వామి మీ పనితీరుకు ఫిదా అవ్వాల్సిందే. కిడ్నీ, బీపీ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
గ్రీన్ టీ - ఉత్సాహాల జలపాతం
గ్రీన్ టీ బరువు తగ్గించడానికే కాదు, లైంగిక పటుత్వాన్ని పెంచడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని ఎల్ థియానైన్, యాంటీఆక్సిడెంట్లు జననాంగాలకు రక్త ప్రసరణను పెంచుతాయి. చక్కెర లేకుండా తేనె లేదా నిమ్మరసంతో రోజుకు 2-3 కప్పులు తాగండి. అయితే నిద్రలేమి సమస్యలు రాకుండా రాత్రి పూట తాగడం మానుకోండి.
కలబంద- ఎనర్జీ టానిక్
కలబంద నేరుగా కాకపోయినా, పరోక్షంగా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. అయితే వారానికి 2-3 రోజులు మాత్రమే మితంగా తాగాలి. ఎక్కువగా తాగితే కడుపునొప్పి వస్తుంది. కిడ్నీ, షుగర్ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండటం మంచిది.
డార్క్ చాక్లెట్ - ప్రేమ రసాయనం
70 శాత కోకో ఉన్న డార్క్ చాక్లెట్ శృంగార జీవితానికి మాయాజాలం లాంటిది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు రక్త ప్రసరణను పెంచితే ఫినైల్ ఇథైల్ అమైన్ అనే లవ్ కెమికల్ మూడ్ ని రొమాంటిక్ గా మారుస్తుంది. ఇందులోని జింక్, మెగ్నీషియం టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. గుండె దడ, నిద్ర సమస్యలు ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
