Latest Updates
-
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
జిమ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.!
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం కోసం రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్, యోగా లాంటివి చేయడం చాలా మందికి అలవాటు. ఇంకా శారీరక దృఢత్వం కోసం జిమ్‌కు సైతం వెళ్తుంటారు. అయితే జిమ్‌కి వెళ్లేటప్పుడు మీ బాడీ దానికి సిద్ధంగా ఉందా లేదా అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిమ్‌కి వెళ్లేముందు తప్పనిసరిగా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటి.. నిపుణుల సలహాలు చూద్దాం..

ఇటీవలి కాలంలో జిమ్‌లో ఉన్నప్పుడే కొందరు గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలి మరణించిన సందర్భాలు చూశాం. దీంతో వ్యాయామం విషయంలో కొందరిలో అనేక రకాల సందేహాలు నెలకొన్నాయి. వ్యాయామం ద్వారా రక్త ప్రసరణ మెరుగవడంతో పాటు, జీర్ణక్రియకి దోహదపడుతుంది. మానసిక ఆరోగ్యం సైతం బాగుపడుతుంది. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సైతం తగ్గించవచ్చు. అయితే ఇంట్లో చేసుకునే చిన్నపాటి వ్యాయామాలు పక్కనపెడితే జిమ్‌కి వెళ్లేవారు మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని విషయాలు మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
కొందరిలో జిమ్‌లో జాయిన తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెల్త్ హెక్స్‌పర్ట్స్ అంటున్నారు. జిమ్‌లో వ్యాయామం ప్రారంభంచిన కొన్ని రోజులకి తీవ్రమైన అలసట కలగవచ్చు. తల తిరగడం, కండరాల నొప్పులు, గుండే వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తుంటారు. శరీరం క్రమంగా వీటికి అలవాటు పడుతుందని అనుకుంటున్నారు. కానీ.. వీటిని హెచ్చరిక సంకేతాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

జిమ్‌కి వెళ్లేముందు ఈ పరీక్షలు తప్పనిసరి..
రక్త పరీక్ష
ముందుగా కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC) తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్‌ల సంఖ్యను సీబీసీ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ రక్తపరీక్షలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే.. మీరు అలసట, నీరసం, ఆయాసం, తల తిరగడం వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జిమ్‌లో వ్యాయామం చేయడం అనేది సవాలుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాగా, ఇప్పటికే నీరసం, అలసట, పచ్చకామెర్లు, ఆయాసం వంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే వైద్యుల సలహాతో జిమ్ ప్రాక్టీస్ చేయాలి.
కొలెస్ట్రాల్ టెస్ట్
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్లతో పాటు గుడ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థితిని తెలుసుకోవచ్చు. బరువు అధికంగా ఉన్నవారు, ధూమపానం ఇంకా గుండె జబ్బుల చరిత్ర ఉంటే తప్పనిసరిగా ఈ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరిగినట్లు వెల్లడైతే వైద్యుల సలహాతో జిమ్ వ్యాయామం పాటించాలి.
సోడియం, పొటాషియం టెస్ట్
బాడీలో కండరాలు, నరాల పనితీరుకు పొటాషియం, సోడియం, ఇతర ఎలక్ట్రోలైట్లు దోహదపడుతుంటాయి. మీరు కండరాల నొప్పులు, బలహీనత, ఎక్కువగా చెమట పట్టడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఎలక్ట్రోలైట్ పరీక్షలు చేయించుకోవాలి. దీని ద్వారా వీటి లోపం ఉందా లేదా అని తెలుస్తుంది. ఎలక్ట్రైలైట్ల సమతుల్యతను పాటించడం ద్వారా జిమ్ వ్యాయమాలు చేసుకోవచ్చు.

ఐరన్, విటమిన్ పరీక్షలు
జిమ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా ఐరన్, విటమిన్ డి, బి12 పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అలసట, బలహీనత, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, ఎముకలు, కండరాల సమస్యలను తెలుసుకోవచ్చు. టెస్ట్‌ల్లో పోషకాహార లోపం ఉన్నట్లు తేలినట్లయితే జిమ్ విషయంలో వైద్యుల సలహా తప్పనిసరి. పోషకాహార లోపంతో వ్యాయామాలు చేస్తే అది తర్వాత కండరాల సమస్యకి దారితీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
