Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు
బెల్లీ ఫ్యాట్.. బాన పొట్ట, కుండలాంటి పొట్ట, ఫ్యామిలీ ప్యాక్ ఇలా చాలా రకాలుగా పిలిచే పొట్ట కొవ్వు చాలా సులభంగా పెరిగిపోతుంది. చిటికెడు చెమట బొట్టు కూడా దారపోయాల్సిన అవసరం లేదు. పొట్ట నిండా తింటూ కూర్చుంటే అది పెరుగుతూ పోతుంది. కానీ ఆ పొట్టను తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. శరీరాన్ని, నోటిని కష్ట పెట్టాల్సిందే. తీవ్రంగా చెమటోడ్చాల్సిందే.
కుండలాంటి పొట్ట కొవ్వుకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు కూడా నిలయం. బెల్లీ ఫ్యాట్, తర్వాత అధిక బరువు.. అధిక బరువుతో పాటు వచ్చే అనేక రకాల అనారోగ్యాలు. గుండెపోటు, హైబీపీ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు మోకాలి నొప్పులు, బ్యాక్ పెయిన్, కాళ్లలో వాపు, జీర్ణ సంబంధిత సమస్యలు, మలబద్ధకం, శృంగార సమస్యలు.. ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

సమస్యలకు నిలయమయ్యే భారీ పొట్టను తగ్గించుకునేందుకు శ్రమించాల్సిందే. నోరు కట్టేసుకోవడంతో పాటు శరీరాన్ని కష్టపెడితే గానీ పొట్ట కొవ్వు తగ్గదు. నిబద్ధతతో, పట్టుదలతో కృషి చేస్తే బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. జిమ్ లకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా పొట్టను కరిగించొచ్చు. ఈ వ్యాయామాలను రోజూ సాధన చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇవి చేస్తే ఫ్యాట్ కరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.
ఇంట్లో ఉంటూనే బెల్లీ ఫ్యాట్ కరిగించే వర్కవుట్స్:
1. నీలింగ్ అబ్ వీల్ - 10 రెప్స్
2. సైడ్ ప్లాంక్ హిప్ లిఫ్ట్స్ - 20 రెప్స్ (ఒక్కో వైపు 10)
౩. లెగ్ రైసెస్ - 10 రెప్స్
4. రష్యన్ ట్విస్ట్‌లు - 20 రెప్స్ (ఒక్కో వైపు 10)
5. మెక్‌గిల్ సిట్-అప్ - 20 రెప్స్ (ఒక్కో వైపు 10)
6. ప్లాంక్ - వీలైనంత ఎక్కువసేపు
12 నిమిషాలకు టైమర్ ని సెట్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు చేయడానికి ప్రయత్నించాలి. 2-4 రౌండ్లు చేయాలి. సాధారణ కార్డియో, వెయిట్ ట్రైనింగ్ తో పాటు ఈ వర్కవుట్స్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ అబ్స్ వర్కవుట్స్ తో పాటు చేయవచ్చు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి డైట్ చిట్కాలు:
* ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండేలా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ కండరాలను నిర్మించడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల వల్ల త్వరత్వరగా ఆకలి వేయదు.
* రిఫైన్డ్ కార్బ్స్ ను తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అస్సలే తినొద్దు
* పుష్కలంగా నీరు తాగాలి. ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి.
* నెయ్యి, ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె, కొబ్బరి నూనె, అవొకాడో లాంటి మంచి ఫ్యాట్ ఉన్న వాటిని డైట్ లో చేర్చుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications