Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈ యాప్‌తో మీకు గుండెపోటు వస్తుందో లేదో తెలుసుకోవచ్చు.. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
భారతదేశంలో రోజురోజుకు గుండెపోటు కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసులు భయంకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత ఇటీవల అధికంగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. అందుకే ఈ గుండె సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు వైద్య నిపుణులు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఇటీవల ఆన్‌లైన్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ FITTO డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కోసం DSSp అనే యాప్‌ను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే, గుండె సంబంధిత రోగాలను కనుగొనేందుకు, గుండె జబ్బులను గుర్తించేందుకు AI-సహాయక హార్ట్ ఫెయిల్యూర్ ప్రిడిక్టర్(HFP) కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ ప్రిడిక్టర్(HFP).

ఈ కొత్త యాప్‌తో ఒక వ్యక్తికి గుండెపోటు వస్తుందా? రాదా అనేది తెలుసుకోవచ్చు. డా.అభిజిత్ రే నేతృత్వంలోని బృందం ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని గురించి అభిజిత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలను ఇక్కడ మీకోసం అందజేశాం ఓసారి చదవండి.
ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే?
గుండె వైఫల్యం ఏది ఇతర వ్యాధుల కంటే భిన్నంగా ఉంటుంది. అలాగే దానిని నిర్ధారించడానికి నిర్దిష్ట ప్రమాణాలు లేవు. అలాగే ప్రతి ఒక్కరికీ గుండె వైఫల్యం లక్షణాలు ఉండవు. అధిక రక్తపోటు, షుగర్ ఉన్న రోగులు సులువుగా ఈ గుండె సమస్యల బారిన పడతారు. అందుకే ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించేందుకు ఒక స్క్రీనింగ్ ఛానెల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ HFPని సృష్టించామని అభిజిత్ తెలిపారు.
హార్ట్ ఫెయిల్యూర్ ప్రిడిక్టర్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
డా. అభిజిత్ రే ప్రకారం, హార్ట్ ఫెయిల్యూర్ ప్రిడిక్టర్ అనేది ఒక వ్యక్తి యొక్క ECG. ఇది ఆ వ్యక్తికి వచ్చే 3 నెలల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అది కూడా రోగి యొక్క ECG డేటాను సేకరించిన తర్వాత, పేటెంట్ ఫార్ములా ఆధారంగా ఒక అల్గారిథమ్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఈ ఫార్ములా ఒక వ్యక్తికి వచ్చే 3 నెలల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలియపరుస్తుంది.
గుండె వైఫల్యానికి కారణాలు
ఒక వ్యక్తి గుండె వైఫల్యానికి అనేక కారణాలు ఉంటాయని డాక్టర్ అభిజిత్ వెల్లడించారు. వాటిలో అధిక రక్తపోటు, మద్యపానం, అధిక షుగర్, హైపోథైరాయిడిజం ముఖ్యమైనవి. వ్యాయామం చేయకపోవడం, సరైన డైట్ పాటించకపోవడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ధూమపానం కూడా ఈ గుండె వైఫల్యానికి ప్రధాన కారమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది గుండె పనితీరును దెబ్బతీసి గుండె ఆగిపోయేలా చేస్తాయి.
ఆరోగ్యవంతమైన జీవితం కోసం AI ఎలా ఉపయోగపడుతుంది?
ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు AI ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి వ్యాధులకైనా ఏ విధమైన టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు అనేది AI చెప్తుంది. అయితే, భవిష్యత్తులో ఒక వ్యక్తికి ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో AI అంచనా వేయగలదు. దీని ద్వారా, ఒక వ్యక్తికి వచ్చే వ్యాధులను గుర్తించడం మాత్రమే కాకుండా, రోగి యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కూడా ముందుగానే గుర్తించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర విషయాల గురించి చెప్పగలదు.
గుర్తుంచుకోవలసిన విషయాలు
గుండెపోటు రావడానికి కారణమయ్యే పనులను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఆ అలవాట్ల నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. అలాగే పుష్కలంగా నీరు కూడా తాగాలి. అలాంటప్పుడే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications