Latest Updates
-
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.!
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.!
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రొమ్ము క్యాన్సర్. ప్రతి ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్నాయి. మరణాలు సైతం నమోదవుతున్నాయి. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం కూడా దీని తీవ్రతకి కారణమవుతోంది. అయితే డియోడరెంట్ లేదా యాంటీపెర్సిపరెంట్ వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందనే సందేహం చాలా మందిలో నెలకొంది. ఇది వాస్తమేనా..

వయసు పెరిగే కొద్దీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే ఈ కాలంలో చిన్న వయసులోనే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. అందుకే శరీరంలో జరిగే మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని.. వైద్య సహాయంతో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దాంతో పాటు శరీరంలో జరిగే కొన్ని మార్పులు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతిరోజూ డియోడరెంట్ లేదా యాంటీపెర్స్పిరెంట్ వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే వీటిలో క్యాన్సర్ వచ్చే కారకాలు ఉంటాయని తెలుస్తోంది.

క్యాన్సర్ కారణాలు
అయితే రొమ్ము క్యాన్సర్‌కి సరైన కారణాలు తెలుసుకోవడం మంచిది. ఈ క్యాన్సర్ కేవలం ఒకే కారణం వల్ల రాదని గమనించాలి. వృద్ధాప్యం, శరీరంలో బ్రెస్ట్ లేదా ఇతర క్యాన్సర్ చరిత్ర, జన్యుపరమైన మార్పులు, హార్మోన్ల కారకాలు, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్‌కి దారితీయవచ్చు.
ఇదిలా ఉండగా.. డియోడరెంట్ లేదా యాంటీపెర్స్పిరెంట్(శరీరానికి చెమట పట్టకుండా నిరోధించే ఉత్పత్తి) వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో పాలుపంచుకునే చిన్న అవయవాలు లింఫ్ నోడ్స్‌ను అడ్డుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. దీంతో అది రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీని వల్ల నిజంగానే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా.?

డియోడరెంట్ల ప్రభావం
నిపుణుల సమాచారం మేరకు.. రొమ్ము క్యాన్సర్ శోషరస గ్రంథుల్లో కాకుండా రొమ్ము కణాల్లో అభివృద్ధి చెందుతాయి. ఇక, శోషరస గ్రంథులు శరీర రోగనిరోధక వ్యవస్థలో భాగంగా ఉంటూ సంక్రమణతో పోరాడటానికి దోహదపడతాయి. అయితే చెమట ప్రవాహం ఆగిపోతే, శరీరంలోని ఏదైనా భాగంలో వాపు, అంటే లింఫెడెమా సంభవించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో వీటివల్ల క్యాన్సర్ వస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

డియోడరెంట్ వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. మీరు డైలీ రొటీన్‌లో చేసే తప్పులు ఈ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చు లేదా అదుపులో ఉంచుకోవచ్చు. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బరువును అదుపులో ఉంచుకోవాలి. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శారీరక కార్యకలాపాల్లో ఉండాలి. మీ బిడ్డకి తల్లిపాలు ఇవ్వండి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ బాడీలో రొమ్ములకు సంబంధించి ఏ అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మీ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications