Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
అన్ని మతాల ప్రజలను అలరించే క్రిస్టమస్ పండుగ

అర్ధరాత్రి మాస్ కు క్రిస్టియన్ మతస్తులు వారి కుటుంబ సభ్యులతో కలసి పాల్గొంటారు. మాస్ తర్వాత వివిధ రకాల రుచులు కల పదార్ధాలతో బ్రహ్మాండమైన విందు చేసుకుంటారు. బహుమతులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. చర్చీలన్ని రంగురంగుల పూలతో, కొవ్వోత్తుల దీపాలతో అర్ధరాత్రి మాస్ లో కన్నుల పండువగా అలంకరిస్తారు. ఒకరికొకరు 'హేపీ క్రిస్టమస్' అంటూ వారి వారి భాషలలో అభినందించుకుంటారు. సాంప్రదాయమైన క్రిస్టమస్ ట్రీలకు బదులుగా, అరటి లేదా మామిడి చెట్లు కూడా అలంకరిస్తారు. కొంతమంది వారి ఇండ్లకు మామిడి ఆకులు కూడా కడతారు.
దక్షిణ భారత దేశంలో, క్రిస్టియన్లు జీసస్ ప్రపంచానికి వెలుగు చూపాడని చెపుతూ నూనెతో కూడిన దీపాలను కూడా తమ ఇండ్ల బయట వెలిగిస్తారు.కొంతమంది క్రిస్టియన్లు తమ ఇండ్లముందు, ఎండు గడ్డి వంటివి కూడా వుంచి అందులో మతపర అలంకరణలు చేస్తారు. లైటు వెలిగే నక్షత్రాలను రంగు పేపర్లతో తయారు చేసి ఇంటి ముంగిట వేలాడదీస్తారు. వచ్చిన అతిధులకు ప్రతి ఇంటిలోను స్వీట్లు తినిపిస్తారు.
కొన్ని ప్రాంతాలలో కొంతమంది క్రిస్టియన్ ప్రజలు రాత్రంతా పాటలు పాడుతూ, భజనలు చేస్తూ గడుపుతారు. సమీప గ్రామాలకు వెళ్ళి పండుగ ప్రాముఖ్యతను కధలరూపంలో వివరిస్తారు. క్రిస్టమస్ పండుగనాడు శాంతా క్లాజ్ పిల్లలకు తన గుర్రపు బండిలో వచ్చి బహుమతులు ఇస్తాడు. ఆయనను పిల్లలు ముద్దుగా తమ భాషలలో క్రిస్టమస్ బాబా అని పిలుస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
