Latest Updates
-
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
కుజ, రాహువుల మధ్య నవపంచమ యోగం.. ఈ 4 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు -
రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్ తో ఇలా చేసేయండి! -
90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా..
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు?
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రోడ్ల పక్కన దుమ్ములో ఆడుకునే బిచ్చగాళ్ల పిల్లలను మనం రోజూ చూస్తుంటాం. చలికి స్వెట్టర్ ఉండదు, వానకు గొడుగు ఉండదు, కనీసం కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. ఏసీ గదుల్లో పెరిగే పిల్లలు చిన్న గాలి వీస్తేనే జబ్బు పడుతుంటే.. సరైన తిండి, వ్యాక్సిన్లు లేని ఆ పిల్లలు అంత స్ట్రాంగ్ గా, యాక్టివ్ గా ఎలా ఉంటారు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? వారు అలా బలంగా కనిపించడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ భగత్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియోలో చెప్పారు.

మట్టితో స్నేహం - సూర్యరశ్మి: రోజంతా ఎండలో, గాలిలో, మట్టిలో ఆడుకోవడం వల్ల వాళ్ల శరీరంలో D విటమిన్ పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది.
న్యాచురల్ ఇమ్యూనిటీ: చిన్నప్పటి నుంచే దుమ్ములో తిరగడం వల్ల రకరకాల బ్యాక్టీరియాలకు ఎక్స్పోజ్ అవుతారు. దీనివల్ల వాళ్ల శరీర రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సహజంగానే మొండిగా, బలంగా తయారవుతుంది.
శారీరక శ్రమ: వాళ్లలో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ. అలాగే మన పిల్లల్లా పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ తినే అవకాశం వారికి అసలే ఉండదు.
కానీ.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే
బయటకు కనిపించే ఈ దృశ్యం వెనుక కన్నీళ్లు పెట్టించే ఒక ఘోరమైన నిజం దాగి ఉంది. బయటకు ఎంత యాక్టివ్ గా కనిపించినా, వాళ్లలో చాలా మంది తీవ్రమైన ఐరన్, విటమిన్ల లోపంతో ఎనీమియా (రక్తహీనత) బారిన పడుతుంటారు.
సరైన ట్రీట్మెంట్, వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల ప్రతి ఏటా వందలాది మంది పసివాళ్లు న్యూమోనియా, డయేరియా వంటి సాధారణ జబ్బులకే ప్రాణాలు వదులుతున్నారు. సైన్స్ పరిభాషలో దీనిని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు. ఆ కఠినమైన చలి, ఎండ, వానలను, రోగాలను తట్టుకుని నిలబడిన కొద్దిమంది బలమైన పిల్లలు మాత్రమే మనకు రోడ్ల మీద యాక్టివ్ గా కనిపిస్తారు. ఆ పోరాటంలో ఓడిపోయి ప్రాణాలు విడిచిన ఎంతో మంది పసివాళ్లు ఈ సమాజానికి కనబడకుండానే మట్టిలో కలిసిపోతున్నారు.
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఏం చేయాలి
-జంక్ ఫుడ్ కు దూరం చేసి, ఇంట్లో వండిన బలమైన, తాజా ఆహారం పెట్టండి.
-ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే ప్రతి వ్యాక్సిన్ ను వయసును బట్టి తప్పనిసరిగా వేయించండి.
-మొబైల్ ఫోన్లు పక్కనపెట్టి, రోజూ కనీసం గంటసేపు చెమట పట్టేలా బయట ఆడుకోనివ్వండి.
-ఉదయం లేదా సాయంత్రం లేత ఎండ పిల్లల ఒంటికి తగిలేలా చూడండి.
-పిల్లలకు శారీరక పరిశుభ్రతతో పాటు, వారు మానసికంగా ధైర్యంగా ఎదిగేలా మీ ప్రేమానురాగాలను పంచండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications