Latest Updates
-
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ
వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తాయి. ఈ క్రమంలో బయట ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం అవసరం. ఈ మేరకు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతూ వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా మిరియాలతో వారంలో రెండు లేదా మూడు సార్లు రసం చేసుకుని తాగి చూడండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

మిరియాల రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
నల్ల మిరియాలు- టేబుల్ స్పూన్
జీలకర్ర- టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- పదిహేను
నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆవాలు- టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
ఎండు మిర్చి- మూడు
ఉల్లిపాయ- ఒకటి(చిన్నది)
టమాటా- ఒకటి(పెద్దది)
కరివేపాకు- కొద్దిగా
ఇంగువ- కొద్దిగా(ఆప్షనల్)
చింతపండు- నిమ్మకాయ సైజు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- పావు టీస్పూన్
బెల్లం- కొద్దిగా
కొత్తిమీర- గుప్పెడు
మిరియాల రసం తయారీ విధానం
ముందుగా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను రోట్లో వేసి మరీ మెత్తగా కాకుండా, బరుకుగా కాకుండా దంచుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండును కడిగి కాసిన్ని వేడి నీళ్లు పోసి నాననివ్వాలి.
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.!
ఇప్పుడు స్టవ్‌పైన రసం చేసే పాన్ పెట్టుకుని వేడయ్యాక నూనె పోసి కాగనివ్వాలి. ఇందులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.

తర్వాత ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా కట్ చేసి తాలింపులో వేయాలి. పచ్చివాసన పోయి దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
టమాటా బాగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసి కలపాలి. అలవాటు ఉన్న వారు ఇంగువ వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు గుజ్జుతో రసం చేసి అందులో పోసుకోవాలి.
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ
రసంలో రుచికి సరిపడా ఉప్పు, పసుపుతో పాటు బెల్లం వేసి ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.
అంతే ఘాటైన, కమ్మనైన మిరియాల రసం రెడీ. జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారే కాదు.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ మిరియాల రసం సంజీవనిలా పనిచేస్తుంది. వేడి వేడి అన్నంలోకి తిన్నట్లయితే రుచితో పాటు ఎనర్జీ మీ సొంతమవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
