Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
త్వరగా నిద్రలోకి జారుకోవడానికి సైంటిఫిక్ రూల్స్
త్వరగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది ఇది అందరూ చెప్పే సలహా. కానీ ఎంత త్వరగా నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర మాత్రం రావడం లేదని చాలా మంది ఫీలవుతుంటారు. అది నిజమే. అందరికీ పడుకోగానే నిద్రపోయే అద్భుతాలు జరగవు.
మనిషి మనుగడకు నీరు, గాలి, ఎండ, ఆహారం ఎంత అవసరమో నిద్రకూడా అంతే ముఖ్యం. సరిగా నిద్రపోకపోతే, ఆరోగ్యం మీద వివిధ రకాలుగా దుష్ప్రభావాలను చూపుతుంది. కాబట్టి సరైన నిద్ర ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. నిద్ర కోసం మన చుట్టూ ఉన్న వాతావరణనాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అప్పుడే త్వరగా నిద్రపోవచ్చు. త్వరగా నిద్రపట్టడానికి తొమ్మిది సైంటిఫిక్ మార్గాలున్నాయి.. ట్రై చేయండి

ఖర్చుల వివరాలు
బ్రెయిన్ రిలాక్స్ గా ఉంటే నిద్ర సరిగా వస్తుంది. పడుకునేటప్పుడు బిల్లులు, లెక్కల గురించి ఆలోచిస్తే.. నిద్ర ఆమడదూరం పారిపోతుంది. కాబట్టి.. మీ ఖర్చులు, బిల్లుల విషయాలు, ఎవరికోసం ఏం ఖర్చు చేశారు ఇలాంటి విషయాలన్నింటితో ఓ జర్నల్ తయారు చేసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి.

పడుకోవడానికి మాత్రమే బెడ్ రూమ్
బెడ్ మీద లాప్ టాప్ లు బ్రౌజ్ చేయడం, సెల్ ఫోన్లు చూసుకోవడం మంచిది కాదు. వీటన్నింటిని హాల్ లోనే ఫినిష్ చేసుకోవాలి. కేవలం నిద్రపోవడానికి మాత్రమే బెడ్ రూమ్ ని వాడుకోవాలి.

చీకటిలో నిద్రపోవడం
నిద్రపోయే గదిని చీకటిగా ఉంచితే బెటర్. లైటింగ్ పడటం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది.

గదిలో ఉష్ణోగ్రత
పడక గదిలో సరైన ఉష్ణోగ్రత ఉండాలి. 18 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే.. నిద్ర బాగా పట్టడానికి సరిపోతుంది.

బ్రీతింగ్
చాలా ప్రశాంతంగా ఊపిరిపీల్చుకోండి. దీనివల్ల మంచి రిలాక్సేషన్ కలుగుతుంది. రెండు సెకన్లు లోపలికి పీల్చి, 4 సెంకడ్లు.. అలానే బిగపట్టుకుని.. నిదానంగా.. అంటే 8 సెంకండ్లపాటు గాలి వదిలేయాలి. దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది.

స్మోకింగ్
నిద్రకు ముందు పొగత్రాగరాదు. దీనివల్ల మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. మధ్యాహ్నం ఎక్కువ మోతాదులో కాఫీలు కూడా తాగకుండా ఉండటం మంచిది. కాబట్టి హ్యాపీగా నిద్రపోవాలంటే వీటన్నిటికీ దూరంగా ఉండటం బెటర్.

పుస్తకాలు చదవడం
మంచి నిద్రకు పుస్తకం చదవడం సరైన పరిష్కారం. త్వరగా నిద్రలోకి జారుకోవాలంటే.. బుక్ చదవితే.. చాలు మీకు తెలియకుండానే నిద్రపోతారు.



Click it and Unblock the Notifications