Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మెమరీ పవర్ పెరగడానికి ఫాలో అవ్వాల్సిన పద్ధతులు
ఉరుకుల పరుగుల జీవితం మనిషిపై ఒత్తిడి పెంచుతోంది. కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. ఒక దగ్గర పెట్టిన వస్తువును మరొక దగ్గర వెతుకుతూ ఉంటారు. దీనికి ఒత్తిడి, ఆందోళన ప్రధాన కారణాలు. అంతేకాదు.. యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడిపోవడంతో.. ఏది గుర్తుపెట్టుకోలేరు. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలని కోరుకుంటున్నారా అయితే.. ఏం ఫర్వాలేదు.. ఇక్కడ చెప్పబోయే పద్ధతులు ఫాలో అవండి మంచి బెన్ఫిట్స్ పొందండి.
READ MORE: జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..? అయితే ఇలా చేయండి...!
నిద్రలేమి వల్ల కూడా జ్ఞాపకశక్తి చాలా తగ్గిపోతోంది. రాత్రంతా టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లు, ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు ఇలా రకరకాల వ్యాపకాలతో.. లేటుగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. మీకే కాదు మీ పిల్లల్లోనూ జ్ఞాపకశక్తి సమస్య ఎక్కువగా ఉంటోంది. జ్ఞాపకశక్తి పెంచే ఆహార పదార్థాలే కాదు.. కొన్ని చిన్న చిట్కాలు ఫాలో అయినా.. మంచి ఫలితాలుంటాయి.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
క్యారెట్స్, క్యాలీ ఫవ్లర్ ను తీసుకుంటూ ఉండాలి. 50 నుంచి 60 గ్రాముల గోబీ, కొంచెం కొత్తిమీర తీసుకుని దానిపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ కలుపుని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సో జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడుతుంది.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
పరీక్షల సమయంలో పిల్లలు ఎక్కువ సేపు చదువుకుంటూ ఉంటారు. రాత్రి పది గంటల తర్వాత కూడా చదువుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతి అరగంటకొకసారి మంచి నీళ్లు తాగడం మంచిది.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
పడుకునే సమయంలో కూర్చుని చదుకుంటే మెదడుకు ఈజీగా చేరుతుంది. కానీ కొంతమంది బోర్లా పడుకుని, వంగి కూర్చుని చదువుకుంటూ ఉంటారు. ఇలా చదవడం వల్ల ప్రమాదం. నిటారుగా కూర్చుని చదివితే.. ఏకాగ్రత కుదురుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరగవుతుంది.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
ఎక్కువ సమయం చదువుతూ ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు రిలాక్స్ కోసం కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. నిద్ర పోగొట్టుకోవడానికి టీ, సిగరెట్టు అలవాటు చేసుకోకూడదు.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
డైరీ ప్రోడక్ట్స్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్, బట్టర్, పెరుగు మెదడు ఉత్సాహానికి తోడ్పడతాయి. ప్రత్యేకంగా పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్ మెమరీ పవర్ పెంచడానికి సహాయపడుతాయి.

జ్ఞాపకశక్తి పెంచే ఈజీ టిప్స్..
ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయంటే.. ఒకేసారి గంటల తరబడి కూర్చుని చదివేస్తుంటారు చాలామంది విద్యార్థులు. ఇలా చేయడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి ఏది సరిగా గుర్తుండదు. కాబట్టి.. ఎప్పటికప్పుడు చదువుకోవడం మంచిది. లేదంటే.. చదువుకునేటప్పుడు అరగంటకోసారి విరామం ఇస్తే మైండ్ కి రిలాక్స్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications